అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

 ,అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు.పోస్ట్ లోకి వెళ్లేముందు ఒక చిన్న మాట.

హలో,వెల్ కం టూ ది పోస్ట్ అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు.@ap web academy . నేను ఇప్పుడు మీకు ఒక మంచి డొమైన్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా పాటించవలసిన బేసిక్ పాయింట్స్ మరియు నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,ఇంకా సెలెక్ట్ చేసుకున్నాక కొనేటప్పుడు మనం చెయ్యాల్సిన కొన్ని తప్పనిసరి జాగ్రత్తల గురించి వివరిస్తాను.

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా పెద్ద సంఖ్యలో డొమైన్ నేమ్స్ నమోదు అవుతున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొనే డొమైన్ ఏ విధంగా ఉంటె మీరు సెర్చ్ రిజల్ట్స్ లో మంచి రాంక్ సాదించ గలుగుతారు.అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ కొనాలి? ఇంకా చాలా అనుమానాలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి . ముఖ్యంగా కొత్తగా డొమైన్ కొనే వాళ్లకి ఈ విధమైన క్యూరియాసిటి ఇంకా ఎక్కువగా ఉంటుంది . మీ ప్రశ్నలన్నిటికీ నేను మీకు స్టెప్ బై స్టెప్ సమాదానాలు అందిస్తాను .

ఈ ఆర్టికల్ యొక్క గురించి పేస్ బుక్ లో నేను చేసిన పోస్ట్ కి 200 లైక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ ఫుల్ థాంక్స్.

నా గురించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే అబౌట్ మీద క్లిక్ చేయండి .

1.డొమైన్ సెలెక్ట్ చేసుకొనే ముందుగా ఫాలో అవ్వ వలసిన బేసిక్ పాయింట్స్.

ముందుగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను డిస్కస్ చేద్దాం.మీ వెబ్ సైట్ మీ డొమైన్ నేమ్ తో ఎలా మంచి రాంక్ సాధిస్తుంది? మీ వెబ్ సైట్ గూగుల్ సెర్చ్ ఫస్ట్ పేజీ లో రావడానికి మీరు డొమైన్ నేమ్ మీకు ఎలా సహకరిస్తుంది? నేను చెప్పే విషయం నూటికి నూరు శాతం కచ్చితంగా పనిచేస్తుందని నేను చెప్పను.కానీ,ప్రయత్నించడం వల్ల పోయేదేమీ లేదు.చేసే ప్రతి పనిలో మనం చేసే ప్రయత్నాలు ద్వారా మనకు లభించే జయాపజయాలను పక్కన పెడితే మనం ప్రయత్నలోపం లేదు అనే విషయం మనకు ఎంతో సంతృప్తిని కలగజేస్తుంది.ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి దీనిని అన్వయించుకోగలరు.

నేను మీకు చెప్పబోయే విషయాలన్నీ గూగుల్ వెబ్ స్పామ్ టీం హెడ్ మాట్ కట్స్ వివిధ సందర్భాలలో చెప్పిన అనేక విషయాలలోని సారాంశం. ఆయన మాటలలోని సారాంశాన్ని నేను మీకు అర్ధమయ్యే విధంగా ఈ క్రింద తెలియజేస్తున్నాను.

యిప్పుడు నేను చెప్పబోయే విషయాలను మీరు మీ డొమైన్ నేమ్ కొనడం మొదలుపెట్టిన దగ్గర్నుండి మీరు రాసే ప్రతి పోస్ట్ లోని ఆఖరి అక్షరం వరకు ఎప్పుడు గుర్తు చేసుకొంటూ ఉండండి.

1 మీరు ఏ విషయం మీద పోస్ట్స్ రాద్దామని అనుకొంటున్నరో ఆ విషయానికి సంబంధించిన ఒక మంచి కీవర్డ్ మీ డొమైన్ నేమ్ గా ఉండాలి,అది కూడా మీ కీవర్డ్ తొనే మీ డొమైన్ నేమ్ స్టార్ట్ కావాలి.

2 మీ వెబ్ సైట్ పేరు ఏమి పెట్టాలనుకుంటున్నారా అదే పేరు మీ డొమైన్ లోను మీ కీ వర్డ్ లోను ఉండాలి.

3 మీ పోస్ట్ లో మీరు కనీసం 4 నుండి 6 సార్లు మీ కీవర్డ్ అంటే మీ డొమైన్ నేమ్ మీ వెబ్ సైట్ టైటిల్ రిపీట్ అవ్వుతూ ఉండాలి.

మాట్ కట్స్ ఇంకా చాలా విషయాలనే చెప్పాడు కానీ మనకు డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడంలో ముఖ్యంగా ఈ విషయాలు ఉపయోగపడతాయి.

చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది.మీకు ఉదాహరణ కావాలంటే , నేను చాలా విషయాలు నేర్చుకున్న హర్ష అగర్వాల్ షౌట్ మీ లౌడ్ బ్లాగ్ చాలా మంచి బ్లాగ్ ఇది.అతని టైటిల్ నేమ్ కానీ డొమైన్ నేమ్ కానీ అతను చాలా తక్కువగా బహుశా అసలు ఉపయోగించక పోవచ్చు.మూడు రోజుల క్రిందట ఉదయం ఆతని బ్లాగ్ లో గురు ఎరిక్ రాసిన ఒక గొప్ప పోస్ట్ In The Next 15 Minutes I Will Show You How To Make Your Blog More Professional అనే పోస్ట్ చదివాను.చాలా గొప్ప పోస్ట్ అది. మనం ఇంగ్లీష్ లో రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే పోస్ట్ అది.నాకు చాలానే ఉపయోగ పడింది.ఇంకా ఈ విధంగా డొమైన్ నేమ్ తో సంబంధం లేకుండా బాగా పేరున్న బ్లాగ్స్ చాలానే ఉన్నాయ్.

కానీ సాధ్యమైనంత వరకు నేను మాట్ కట్స్ రూల్స్ అని పిలుచుకునే బేసిక్ పాయింట్స్ నే ఫాలో అవుదాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ నేను ఫాలో అయ్యి మంచి రిజల్ట్ సాదించనవే.నేను కేవలం నమ్మకంతో ఏదయితే చేసానో అదే కాన్సెప్ట్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను.

అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా? చూద్దాం!

మీ వద్ద ఒక అద్భుతమైనడొమైన్ నేమ్ ఉంటె నా ఉద్దేశంలో నా ఆలోచనలో అది డొమైన్ కాదు.అది ఒక గోల్డ్ మైన్.

అవును, ఒక అద్భుతమైన డొమైన్ వెబ్ సైట్ కు సంబందించిన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ సగానికి పైగా పూర్తీ చేసేస్తుంది.

1 మీ వెబ్ సైట్ దేనికి సంబంధించినది?
2 మీ వెబ్ సైట్ లొకేషన్ ఎక్కడ?
౩ వెబ్ సైట్ యొక్క టార్గెట్ విజిటర్స్ ఎవరు?
4 మీ వెబ్ సైట్ యొక్క బాష ఏమిటి?
5 మీ వెబ్ సైట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?

నేను పైన చెప్పిన పాయింట్స్ గురించి ఇప్పుడు వివరంగా చెపుతాను.ముందుగా పెన్ను పేపర్ తీసుకొని మీ వెబ్ సైట్ గురించి ఒక రఫ్ ప్లాన్ గాని లేదా ఒక ప్రొఫెషనల్ ప్లాన్ గాని తయారు చేసుకోండి.

hఅద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు domains image అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు domains image

1 మీ వెబ్ సైట్ దేనికి సంబంధినది?

చాలా జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి.

 • మీరు ఏ విధమైన వెబ్ సైట్ బిల్డ్ చేయటానికి ప్రయ్తత్నిస్తున్నారు.
 • పర్సనల్ బ్లాగ్, ప్రొఫషనల్ బ్లాగ్ ,లేక వెబ్ సైట్ ఏది?
 • లేదంటే ఈకామర్స్ స్టోర్ లాంటిదా లేక మెంబర్ షిప్ వెబ్ సైట్ లాంటిదా?
  మీరు ఎలాంటి వెబ్సైటు లేదా బ్లాగ్ నిర్మించాలనుకొంటున్నారో చక్కగా ఒక ఆలోచనకు రండి.
 • అప్పటికే మీకు డొమైన్ నేమ్స్ ఐడియా వచ్చిఉంటాయి.
 • అదే మీరు ఈ కామర్స్ స్టోర్ లాంటిది స్టార్ట్ చెయ్యాలని అనుకుంటే బ్రాండ్ స్టోర్.కామ్ లేదా డీల్స్ షాప్.కామ్ లేదా షార్ప్ ప్రైస్ సేల్.కామ్ లాంటి నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి.

 

ఉదాహరణ:- మీ బ్లాగ్ లేదా వెబ్ సైట్ పర్సనల్ బ్లాగ్ ఐతే మీపేరు.మీ ఇష్టమైన ఎక్సటెన్షన్ సెలెక్ట్ చేసుకోండి.మీరు కానక ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ లేదా ప్రొఫసషనల్ వెబ్ సైట్ క్రియేట్ చేయాలనుకునే మీ డొమైన్ నేమ్ కూడా అంత ప్రొఫెషనల్ గా ఉండేటట్టు చూసుకోండి.మీ ప్రొఫషనల్ డొమైన్.కామ్ లాగా తెలుగు టెక్నాలజీ.కామ్ లాగా

ap web academy కి మరియు అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు పోస్ట్ ని ఇంట్రెస్ట్ గా చదువుతున్న ఒక ముఖ్యమైన విజిటర్ గా మీరు నాకు ఎప్పుడు చాలా విలువైన వ్యక్తి.

అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు post domain names image అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు post domain names image

కాబట్టి నేను మీకు ఒక అభిమాన పూర్వకమైన హెచ్చరిక ఇస్తున్నాను.”ఎటువంటి బ్లాగ్ కైనా,వెబ్ సైట్ కైనా సరే ఎప్పుడు ఒక ప్రొఫెషనల్ డాట్.కామ్ డొమైన్ నే సెలెక్ట్ చేసుకోండి”.నాకు తెలుసు దీనికి మీరేమంటారో మిగిలిన చాలా ఎక్సటెన్షన్ లు డాట్.కామ్ కన్నా చాలా తక్కువ కదా? ఇదే కదా మీ ప్రశ్న? అవును, మీరు చెప్పింది కరెక్టే ,మిగిలిన చాలా ఎక్సటెన్షన్ లు డాట్.కామ్ కన్నా చాలా తక్కువ. అలాగే సెర్చ్ ఇంజిన్ లైన గూగుల్బింగ్ లాంటి వాటి దృష్టిలో కూడా వాటి విలువ డాట్.కామ్ డొమైన్ కు ఉన్న విలువ కన్నా చాలా తక్కువ.మిగత డాట్.ఎక్సటెన్షన్స్ తో పోలిస్తే సెర్చ్ ఇంజిన్ లు డాట్.కామ్ డొమైన్ కు ఎక్కువ విలువనిస్తాయి. ఇప్పుడు చెప్పండి? మీరు ఎటువంటి డొమైన్ కొనాలని అనుకొంటున్నారో?

మనం ఇప్పుడు తరవాతి అంశం లోకి వెళదాం.

2 మీ వెబ్ సైట్ లొకేషన్ ఎక్కడ?

మీరు అద్భుతమైన డొమైన్ ని సెలెక్ట్ చేసుకోవడం లో ఈ పాయింట్ మరొక మరొక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.అది ఎలాగో మనమిప్పుడు చూద్దాం.

 • మీరు కనక uk లో ఉన్నట్లయితే మీరు డాట్.in డొమైన్ సెలెక్ట్ చేసుకొంటే మీరు uk ట్రాఫిక్ ని పోగుట్టు కొంటారు.
 • మీవ్యాపారం  వైజాగ్ లో ac లు అమ్మే వ్యాపారి ఐతే ఆలిండియా కూలింగ్ సోలుషన్స్ .కామ్ అనే డొమైన్ వల్ల మీకు ఉపయోగం ఉండదు.
 • మీరు విజయవాడ లో పచ్చళ్ల వ్యాపారం ఐతే మీరు మాగాయ.కామ్ అనో టేస్టీఆనపకాయ.కామ్ అనో పెట్టుకుంటే తెలంగాణా ప్రాంతం చాలా పల్లెటూర్లలో లో ఇప్పటికి చాలా మందికి మాగాయ ఆనపకాయ అనే పేర్లే తెలియవు.

ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన విషయాన్ని చెపుతాను.

ఉదారణకు మీరు లేదా మీ రెస్టారెంట్ చికెన్ బిర్యానీ వండటంలో ఎక్సపర్ట్ అనుకోండి.అందుట్లో కూడా ధం బిర్యానీ బాగా చేస్తారనుకోండి.మీరు హైదరాబాద్ లోని నాంపల్లి లో ఉన్నారనుకోండి.అప్పుడు మీ డొమైన్ నేమ్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ డాట్.కామ్ అని ఉంటె కచ్చితంగా మీరు పొరపాటు చేసినట్టే ఎందుకంటె మీరు చికెన్ ధం బిర్యానీ లో స్పెషలిస్ట్ అది కూడా నాంపల్లి లో .డెలివరీ ఐన కొంత దూరం మాత్రమే చెయ్యగలరు .అలాగే ఆ చుట్టూ పక్కల ఉన్న వారు వస్తారు. మీరు బాగా పాపులర్ ఐతే దూరం నుండి కూడా వస్తారు అది వేరే విషయం. కానీ మీరు ముఖ్యంగా కాన్సంట్రేషన్ చేయవలసినది మాత్రం నాంపల్లి లోనే. అప్పుడు మీ డొమైన్ నేమ్ నాంపల్లిదంబిర్యాని .కామ్ అని వుండే విధంగా చూసుకోవాలి.

ఇప్పుడు మనం తర్వాత పాయింట్ కి వెళదాం.

౩ వెబ్ సైట్ యొక్క టార్గెట్ విజిటర్స్ ఎవరు?

ఈ టాపిక్ కూడా మీ డొమైన్ నేమ్ సెలక్షన్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.అది ఎలాగో చూద్దాం.

 • మీ వెబ్ సైట్ గుండె పోటు నిరోధించడానికి సంబంధించిన చిట్కాలు,రక్త ప్రసరణ ను అదుపు చేయటానికి చేయవలసిన పనులు గురుంచి చెప్పే వెబ్ సైట్ ఐతే మీ డొమైన్ నేమ్ యంగ్ హెల్త్ టిప్స్.కామ్ అంటే ఎం జరుగుతుంది?
 • మీ వెబ్ సైట్ ఆండ్రాయిడ్ మొబైల్ గురించి అనుకోండి.మీ డొమైన్ నేమ్ మొబైల్ టిప్స్.కామ్ అని ఉంటె ఏంటి పరిస్థితి?
 • మీరు రాజమండ్రి లో స్కూల్ పిల్లల యూనిఫార్మ్స్ అమ్మే వ్యాపారం ఐతే స్కూల్ యూనిఫార్మ్స్.కామ్ అనో చిల్డ్రన్ స్కూల్ యూనిఫార్మ్స్.కామ్ అనో రాజమండ్రి యూనిఫార్మ్స్.కామ్ అనో ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవద్దు. కేవలం చిల్డ్రన్ స్కూల్ యూనిఫామ్ ఇన్ రాజమండ్రి.కామ్ అనే విధంగా అంటే మీ డొమైన్ నేమ్ చదువుతుండగానే మీ వెబ్ సైట్ ఏంటో అర్ధం అయ్యే విధంగా ఉండాలి.
 • అలాగే సాధ్యమైనంత వరకు డొమైన్ నేమ్ సింపుల్ గా ఉండేటట్లు చూసుకోండి అంటే ఎక్కువ పదాలు లేకుండా నిజంగా మీ బిజినెస్ కు అవసరం అనుకుంటే తప్ప రెండు లేదా మూడు పదాలు డొమైన్ నేమ్ తోనే ఉండటానికి ప్రయత్నించండి.

ఎప్పుడు మీ టార్గెట్ విజిటర్స్ ఎవరు అనేది మీకు స్పష్టంగా ఐడియా ఉండాలి.అలాగే వారిని మీ డొమైన్ నేమ్ లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి.

మనం తర్వాతి పాయింట్ కి వెళదాం

4 మీ వెబ్ సైట్ యొక్క బాష ఏమిటి?

మరొక ముఖ్యమైన విషయం మీ వెబ్ సైట్ యొక్క బాష. ఇది అతి కీలకమైన పాత్ర పోషిస్తుంది మీ డొమైన్ సెలక్షన్ లో, అది ఎలాగో మనమిప్పుడు చూద్దాం.

 • ముఖ్యమైన విషయం ఏంటంటే మీ వెబ్ సైట్ ఇంగ్లీష్ లో ఉంటె అసలు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవలిసిన అవసరం లేదు.
 • ఒకవేళ మీ సైట్ లోకల్ లాంగ్వాజ్ లో ఉంటె సాధ్యమైనంత వరకు మీ డొమైన్ నేమ్ లో మీ యొక్క లాంగ్వేజ్ లేదా దానికి సంబంధించిన షార్ట్ వర్డ్స్ ఉండేలా చూసుకోండి.
 • మీ సైట్ తెలుగు కవితల గురించి అనుకోండి.అప్పుడు మీ డొమైన్ నేమ్ గ్రేట్ పోయెట్స్.కామ్ అని ఉంటె దాని వల్ల ఉపయోగం ఉండదు.తెలుగు పోయెట్స్.com అని ఉండేలా చూసుకోండి.
 • సాధ్యమైనంత వరకు మీ లాంగ్వేజ్ కి సంబంధించిన పేరు లేదా షార్ట్ వర్డ్స్ మీ డొమైన్ నేమ్ లో ఉండేలా చూసుకోండి.

ఇప్పుడు మనం చివరిది అతి ముఖ్యమైనది ఐనటువంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ను బట్టి డొమైన్ ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసు కుందాం

5 మీ వెబ్ సైట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?

ఇది ఎందుకని అత్యంత ముఖ్యమైనదో మనమిప్పుడు చూద్దాం.

 • మీరు ఇప్పుడు ఒక బ్లాగ్ లాగ స్టార్ట్ చేసి ఫ్యూచర్లో ఈ కామర్స్ స్టోర్ లాగానో మెంబర్ షిప్ వెబ్ సైట్ లాగానో మార్చే ఉద్దేశం ఉంటె మీపేరు.కామ్ పనిచేయదు.
 • మీ సైట్ ఇప్పుడు రాజమండ్రి చిల్డ్రన్స్ స్కూల్ యూనిఫార్మ్స్.కామ్ ఐతే ఫ్యూచర్లో మీరు యూత్ జీన్స్ అండ్ టీ షర్ట్స్ అమ్మే ఉద్దేశం ఉంటె మీ డొమైన్ పని చేయదు.
 • మీ వెబ్ సైట్ ప్రసుతం నాంపల్లి ధం బిర్యానీ.కామ్ ఐతే, ఫ్యూచర్లో జీడిమెట్ల లో మీరు ధం బిర్యానీ అమ్మాలనుకొంటే మీ డొమైన్ నేమ్ పని చేయదు.

మీకు ఈ పాటికే మీ డొమైన్ నేమ్ ఎలా ఉండాలో ఒక ఐడియా వచ్చిందని అనుకొంటున్నాను.

ప్రశాంతంగా కూర్చొని పైన ఐదు విషయాల గురించి ఆలోచించండి.ఒక అద్భుతమైన డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవటానికి మీకు యెంత టైం కావాలో అంత టైం తీసుకోండి.ఇక్కడ నేను మీకు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెపుతాను.మీ డొమైన్ నేమ్ చూడగానే విజిటర్ కి మరియు సెర్చ్ బాట్స్(search robots) కి మీ వెబ్సైటు గురించి ఒక ఐడియా వచ్చెయ్యాలి. ఎందుకంటె ఎప్పుడైనా ఎవరైనా మీ వెబ్ సైట్ కి సంబంధించిన కంటెంట్ గురించి సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ బాట్స్ మీ వెబ్ సైట్ ను సాధ్యమైనంత ర్యాంకింగ్ పొజిషన్ లో చూపించడానికి ట్రై చేస్తాయి.

విజయవాడ కొరియర్ సర్వీసెస్, చెన్నై మూవర్స్ అండ్ పాకెర్స్, గుంటూరు మిర్చి స్టోరేజెస్, హైదరాబాద్ లోకల్ క్యాబ్స్.
ఫై పేర్లు చదివాక ఆ వెబ్ సైట్స్ ఏంటో అర్ధం చేసుకోవడానికి మీరు సైట్ చూడాలంటారా?

ఇప్పటి వరకు మనం డొమైన్ కొనేటప్పుడు మన డొమైన్ నేమ్ ఎలా ఉండాలో తెలుసు కున్నాం. ఇప్పుడు ఎలా ఉండకూడదో తెలుసుకుందాం!

 • ఎప్పుడు కూడా మీ డొమైన్ నేమ్ లో నంబర్స్ ఉండకూడదు. 1నేనొక్కడినే.కామ్ , సచిన్ 50 హాఫ్ సెంచరీస్.కామ్ , మూవీస్ అఫ్ 365 డేస్.కామ్ ఇలాంటివి ఉండకూడదు.
 • అలాగే డొమైన్ నేమ్ లో ఎటువంటి హైపన్స్ వాడకూడదు. సూర్యాపేట-వరంగల్ ట్రావెల్స్.కామ్, x కంపెనీ స్పేర్స్ -సేల్స్-సర్వీస్.com లాంటివి వాడకూడదు.
 • ఎటువంటి స్పాం వర్డ్స్ వాడకూడదు.వాటిని గురించి నేను నా వెబ్ సైట్ లో చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు.మీకు అవేంటో తెలియకపోతే గూగుల్ లో సెర్చ్ చేసుకొని తెలుసుకోగలరు.
 • అత్యంత ముఖ్యమైన విషయం ఎటువంటి బ్రాండ్ నేమ్స్ మీ డొమైన్ నేమ్ లో వాడొద్దు.ఉదాహరణకు నా గూగుల్ ప్రొఫైల్.కామ్, మేమెంత పేస్ బుక్ ఫ్రెండ్స్.కామ్,నా యూట్యూబ్ ఛానల్.కామ్ లాంటివి అసలు రాకుండా చూసుకోండి. ఇవి ఫ్యూచర్లో మీకు చాలా తల నొప్పిని కలిగిస్తాయి.
 • ఎప్పుడు కూడా మీకు కావలసిన డొమైన్ నేమ్ దొరికితేనే కొనండి.లేదంటే కొంత లేటైనా మరొక మంచి నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి.
 • మీరు సెర్చ్ చేసే డొమైన్ నేమ్ ఆల్రెడీ ఎవరైనా కొనుక్కొని ఉంటె డొమైన్ అమ్మే వెబ్ సైట్ లన్ని ముందో వెనకో ఒక అక్షరాన్ని పెంచడం లేదా తగ్గించడం కానీ, లేదంటే మధ్యలో ఒక అంకెనో సంఖ్యనో తగిలించడం కానీ, ఇవేమి కాకపొతే ఒక హైపెన్ తీసుకొచ్చి మీ డొమైన్ మధ్యలో జోడిస్తాయి.దాంతో మీ డొమైన్ నేమ్ అర్ధమే మారి పోతుంది.
 • ఉదాహరణకు క్రికెట్ వితౌట్ యాడ్స్ లైవ్.కామ్ కోసం మీరు సెర్చ్ చేస్తే అది లేకపోతె వాళ్లు క్రికెట్ వితౌట్-యాడ్స్ లైవ్.కామ్ అని సజెస్ట్ చేస్తారు.సో, మీరు ఏమి కొనాలనుకుంటున్నారా ఆ డొమైన్ నేమ్ దొరికితేనే కొనండి. లేకపోతె మీకు కావలిసినంత టైం తీసుకొని ఇంకొక మంచి నేమ్ సెలెక్ట్ చేసుకోండి.

చాలా చాలా చాలా అత్యంత ముఖ్యమైన విషయం

మీ సెలెక్ట్ చేసుకునే డొమైన్ నేమ్ పట్ల మీరు నూటికి నూరు శాతం సంతృప్తి కరంగా ఉంటె మీరు ఆ పేరు తప్ప మారేది మీ వెబ్ సైట్ కి సెట్ అవ్వదన్నట్లుగా ఉన్న డొమైన్ నేమ్ దొరికితే మీరు ఇంకా వేరే ఏమి ఆలోచించనవసరం లేదు.ఎందుకంటే మీ వెబ్ సైట్ విజిటర్స్ చూడక ముందు మీ వెబ్ సైట్ గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే.

సరే, అంతా పర్ఫెక్ట్ గా ఉంది మంచి డొమైన్ నేమ్ ని సెలెక్ట్ చేసుకొన్నారు.అది మీ వెబ్ సైట్ కి టైలర్ మేడ్ గా సరిపోతుంది.కానీ తర్వాత ఏంటి? ఒక్క నిమిషం కూడా లేట్ చెయ్యకుండా దానిని మీ సొంతం చేసుకోవడమే.ఎందుకనే ప్రతి నిమిషం పెద్ద సంఖ్యలో డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది.మీరు ఎటువంటి డొమైన్ నేమ్ కొనాలో దాని పేరు ఏమిటో కూడా సెలెక్ట్ చేసుకొన్నా ఒక క్షణం కూడా వేస్ట్ చెయ్యొద్దు.ఎందుకంటె అది మరెవరైనా బుక్ చేసుకొంటే దాన్ని మీరు కొనలేరు.కానీ ఎక్కడ కొనాలి? నమ్మకమైన డొమైన్ సెల్లర్ ఎవరు?

దానికి సమాధానం జైంట్ అఫ్ వెబ్ ఇండస్ట్రీ hostgator , అవును నిస్సందేహంగా,

ఎందుకని hostgator దగ్గర డొమైన్ కొనాలి? ఒకే ఇప్పుడు మనం థియరి నుండి ప్రాక్టికల్ కి వెళదాం.

ఎందుకంటె,వారి యొక్క 24 / 7 /365days అద్భుతమైన సపోర్ట్.పర్సనల్ గా నా వెబ్ రిక్వైర్మెంట్స్ అన్ని hostgator టీం చాలా బాగా ఫుల్ ఫిల్ చేశారు.ఒక మంచి అద్భుతమైన అన్ని రకాల వెబ్ సర్వీస్ ప్రొవైడర్ hostgator .ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారి వద్ద మీరు డొమైన్ కొంటే మీ డొమైన్ తో పాటుగా 5000 రూపాయల విలువైన సర్వీస్ లను ఉచితంగా అందిస్తున్నారు.ఈ సర్వీస్ ల గురించి మనం తర్వాత మాట్లాడుకొందాం.నేను hostgator ఎందుకు ప్రిఫర్ చేసుతున్నానో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెపుతాను.

నాకు వారి తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది.నిజం వారి 24 / 7 /365 days సపోర్ట్ అత్యద్భుతం.నేను నా సొంత అనుభవం తర్వాత మీకు సజెస్ట్ చేస్తున్నాను.

 • hostgator లోకలైజ్డ్ హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది.దీని వల్ల మీ వెబ్ సైట్ రాకెట్ స్పీడ్ తో లోడ్ అవ్వుతుంది.
 • hostgator తో మనం చేసే పెమెంట్స్ అన్ని కూడా మన లోకల్ కరెన్సీ లో మన ఇష్టమైన విధానంలో చెయ్యొచ్చు.
 • ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే వారు మనకు లోకల్ లాంగ్వేజ్ లో సపోర్ట్ ఇస్తారు.
 • నేను hostgator తో నా జర్నీ మొదలు పెట్టాక నా వెబ్ రిలేటెడ్ ఇష్యూ గురించి కానీ మరే ఇతర వెబ్ సంబంధ విషయాలలో కానీ ఎప్పుడు ఏ విధమైన ఆందోళన చెందలేదు.

మీకు ఎవరైనా hostgator కన్నా మంచి సర్వీస్ ఇచ్చే ప్రొవైడర్ తెలిసుంటే కచ్చితం గా మీరు వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు.

సరే,ఇప్పుడు మనం hostgator లో డొమైన్ నేమ్ ఎలా కొనాలో తెలుసు కొందాం.నేను మీకు ఈ విషయాన్ని మీకు అర్ధం అయ్యే విధం గా చెపుతాను.

ముందుగా hostgator అనే లింక్ ని క్లిక్ చేసి వారి వెబ్సైటు కి వెళ్ళండి.మీరు క్లిక్ చేసిన లింక్ మిమ్మల్ని కింద చూపించబడే వెబ్ పేజీ కి తీసుకు వెళుతుంది.

hostgator image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు hostgator image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

ఇప్పుడు మీరు పైన చూపిస్తున్న డొమైన్ అనే ట్యాబు మీదకి మౌస్ ని తీసుకు వెళ్ళండి.మీ మౌస్ డొమైన్ ట్యాబు మీదకు వెళ్ళగానే, అక్కడ ఒక డ్రాప్ డౌన్ మెనూ కనపడుతుంది.దానిలో మూడు స్టెప్స్ ఉంటాయి.1 రిజిస్టర్ డొమైన్ నేమ్. 2 ట్రాన్సఫర్ డొమైన్ నేమ్. 3 idn డొమైన్ నేమ్.
domain registration hostgator image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు domain registration hostgator image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

రిజిస్టర్ డొమైన్ మీద క్లిక్ చెయ్యండి.ఒక వేళా మీ డొమైన్ నేమ్ హిందీ లో .భారత్ అనే ఎక్సటెన్షన్ తో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే idn డొమైన్ నేమ్ మీద క్లిక్ చెయ్యండి.hostgator మిమ్మల్ని డొమైన్ సెర్చ్ అనే ఈ క్రింద ఇమేజ్ లో గల పేజీ లోకి తీసుకు వెళ్తుంది.

domain registration page for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు domain registration page for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

సెర్చ్ బాక్స్ లో మీ ఫేవరేట్ సైట్.కామ్ ఎంటర్ చెయ్యండి.తర్వాత సెర్చ్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.మీ డొమైన్ నేమ్ కనక అవైలబిలిటీ ఉంటే hostgator ఈ క్రింది ఇమేజ్ లో లాగ చూపిస్తుంది.ఓకే మీ ఫేవరేట్ సైట్.కామ్ మీ సెర్చ్ లో మీకు దొరికింది.

domain name finding image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు domain name finding image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

ఆడ్ టూ కార్ట్ అనే మీ డొమైన్ నేమ్ పేరుకు ఎదురుగా ఉన్న బటన్ ను నొక్కండి.తర్వాత ప్రొసీడ్ టూ చెక్ అవుట్ అనే బటన్ మీద క్లిక్ చెయ్యండి.అది మిమ్మల్ని ఈ క్రింది పేజీ కి తీసుకు వెళుతుంది.

checkout page of hostgator for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు checkout page of hostgator for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

షాపింగ్ కార్ట్ పేజీ ని జాగ్రత్తగా గమనించండి. మీకేమి అర్ధమైంది? మీ డొమైన్ నేమ్ తో పాటుగా 5౦౦౦ రూపాయల విలువైన ఫ్రీ సర్వీసెస్ తో పాటుగా డొమైన్ ప్రైవసీ ప్రొటెక్ట్ మీ కార్ట్ కి ఆటోమేటిక్ గా ఆడ్ ఐయ్యింది.డొమైన్ గడువు ఒక సంవత్సరం అని మరియు కూపన్ కోడ్ ఎంటర్ బాక్స్ ,మీరు చెల్లించావలిసిన మొత్తం దానికి సంబందించిన టాక్స్ చూపించ బడుతోంది. మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాము.

“What do I get?

ముందుగా 5000 విలువైన సర్వీసెస్ ఏమిటో మనం తెలుసుకుందాం.దీని గురించి తెలుసు కోవడానికి ముందుగా వాట్ డూ ఐ గెట్? అనే బ్లూ లింక్ మీద క్లిక్ చెయ్యండి.మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత hostgator మీరు 5000 విలువైన సర్వీసెస్ ఏం పొందుతారో చూపించడానికి ఒక విండో ఓపెన్ చేస్తుంది.అందుట్లో ఇప్పుడు నేను క్రింద చెప్ప బోయే విషయాలన్నీ ఉంటాయి.

2 ఇమెయిల్ అకౌంట్స్ -మీరు.మీ డొమైన్ నేమ్.కామ్
డొమైన్ ఫార్వార్డింగ్
యుఆర్ఎల్ మాస్కింగ్
dns మేనేజ్మెంట్
డొమైన్ తెఫ్ట్ ప్రొటెక్షన్
బల్క్ టూల్స్
ఈజీ టూ యూజ్ కంట్రోల్ ప్యానెల్
24/7 లోకల్ సపోర్ట్

what do i get? hostgator image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు what do i get? hostgator image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

అదండి సంగతి!, ఇప్పుడు మనం తర్వాతి పార్ట్ ప్రైవసీ ప్యూటెక్ట్ గురించి మాట్లాడుకుందాం.మాములుగా చాలా మంది ఇదెందుకు? అనవసరపు ఖర్చు అనుకొంటారు.కానీ, నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే మీరు డొమైన్ తో పాటుగా ప్రైవసీ ప్రొటెక్ట్ కూడా కొనుక్కోండి.ఎందుని?ఎందుకనో నేను మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను.ముందుగా ప్రైవసీ ప్రొటెక్ట్ గురించి hostgator ఏమి చెపుతుందో చూద్దాం.అది చూట్టానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

“Why Privacy Protect?

Protect yourself from identity theft, spammers and telemarketers. Without Privacy Protection for your domain name, your contact information is public and visible to anyone who does a WHOIS check on your domain name.

Privacy Protection ensures that the contact information associated with your domain name is not visible publicly. It does this by replacing all your publicly visible contact details with alternate contact information, as shown in the screenshot below:

the image look like below.

whois image of hostgator for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు whois image of hostgator for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

నా ఉద్దేశ్యం లో hostgator వారు చక్కగా అందరి కి అర్ధమయ్యే రీతిలో డొమైన్ ప్రైవసీ ప్రొటెక్ట్ గురించి వివరంగానే చెప్పారని అనుకొంటున్నాను.కానీ మనం మరొక సారి వాళ్ళేమి చెపుతున్నారో చూద్దాం.మీ ఐడెంటిటీని స్పామర్స్ మరియు టెలి మార్కెటర్స్ నుండి కాపాడేందుకు డొమైన్ తెఫ్ట్ నిరోధించేటందుకు ప్రైవసీ ప్రొటెక్ట్ ఉండాలని చెపుతున్నారు.ప్రైవసీ ప్రొటెక్టన్ లేకపోతె మీ ఇన్ఫర్మేషన్ ను ఎవరైనా సరే whois చెక్ ద్వారా తెలుసుకోవచ్చని చెపుతున్నారు.ప్రైవసీ ప్రొటెక్షన్ ఉండటం  వల్ల, పబ్లిక్ మీ డొమైన్ నేమ్ తో అసోసియేట్ ఐ ఉన్న కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను యాక్సస్ చేయలేరని కూడా చెపుతుంది.అలాగే మీకు సంబందించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పైన ఇమేజ్ లో చూపించినట్లుగా వేరే ఇన్ఫర్మేషన్ తో రీప్లేస్ చేయబడి ఉంటుంది.

నిజంగా ప్రైవసీ ప్రొటెక్ట్ అనేది మన భద్రత కోసమే.అవును,మీరు కానక ప్రైవసీ ప్రొటెక్ట్ లేకుండా డొమైన్ నేమ్ కొన్నట్లైతే ఆ తర్వాత ఒక గంటలోపే ఫోన్ కాల్స్, మెసేజెస్,మెయిల్స్,వరదల వచ్చి పడతాయి. వాళ్లంతా మీ వెబ్సైటు ని సూపర్ గా డిజైన్ చేస్తామని, మీకు కావలసిన విధంగా డెవలప్ చేస్తామని , seo సోషల్ మార్కెటింగ్ అబ్బో రకరకాల ఆఫర్స్ తో మీకు పిచ్చెక్కిస్తారు.

మిమ్మల్ని ఎప్పుడు ఫోన్ కాల్స్,మెయిల్స్,మెసేజ్ లతో చేజ్ చేస్తారు,వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్లు ఉంటుంది పరిస్థితి. మీకు ఇటువంటి పరిస్థితి అవసరమంటారా?కాబట్టి నేనిచ్చే సజ్జెషన్ ఏమిటంటే డొమైన్ నేమ్ ను ప్రైవసీ ప్రొటెక్ట్ తో పాటుగా బుక్ చేసుకోండి.లేదంటే మీరు ఆ మార్కెటింగ్ వాళ్ళతో చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది.

మీరు డొమైన్ కొనేటప్పుడు పాటించ వలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు డొమైన్ పది సంవత్సరాల వరకు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

 • నా సలహా ఏటంటే సాధ్యమైతే మూడ్ నుండి ఐదు సంవత్సరాల వరకు రిజిస్టర్ చేసుకోండి.
 • ఇది కూడా ర్యాంకింగ్స్ లో ఒక అంశం.
 • నాకు తెలుసు నేను చెప్పేది మీకు కొంత ఇబ్బందికరంగానే ఉండవచ్చు.
 • కొత్త బ్లాగ్ లేదా వెబ్ సైట్ మొదలు పెట్టె వారికీ ఇది కొంచెం ఇబ్బందికరమే.
 • మీకు అవకాశం ఉంటె మాత్రం ఎక్కువ కాలానికి రిజిస్టర్ చేసుకోండి.
 • లేదంటే ప్రతిసంవత్సరం చేసుకోవచ్చు.
 • ఒక వేళా కూపన్ కోడ్ ఆ టైం లో రన్నింగ్ లో ఉంటె అది ఆటోమేటిక్ గా యాడ్ ఐ పోతుంది.
 • ఇప్పుడు కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చెయ్యండి.

అది మిమ్మల్ని ఈ కింద కనపడే పేజీ లోకి తీసుకు వెళుతుంది.

hostgator account create page for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు hostgator account create page for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చెయ్యండి.మీకు అప్పుడు ఇంకొక పేజీ కనపడుతుంది.ఆ పేజీ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను మీ యూజర్ ఇన్ఫర్మేషన్ ను అడుగుతుంది.కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీ డొమైన్ ను మీ పేరు మీద రిజిస్టర్ చెయ్యటానికి మరియు మీ బిల్లింగ్ ఇన్వాయిస్ కోసమైతే యూజర్ ఇన్ఫర్మేషన్ మీ లాగిన్ మరియు మీరు ఎపుడైనా పాస్వర్డ్ మర్చిపోతే రీసెట్ చేసుకోవడం వంటి వాటికోసం మాత్రమీ వివరాలన్నీ ఎంటర్ క్రియేట్ అకౌంట్ అనే బటన్ ని నొక్కండిమే.మీరు ఎటువంటి ఆలోచన లేకుండా మీ డీటెయిల్స్ ఎంటర్ చెయ్యొచ్చు.

contact and user information image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు contact and user information image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలుsecrets.

 

contact and user information image 2 for contact and user information image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు contact and user information image 2 for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

ఇది మిమ్మలి పేమెంట్ ఆప్షన్ పేజీ కి తీసుకు వెళుతుంది.మీకు ఇష్టమైన పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయండి.

మీరు అమౌంట్ పే చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం.

 • ఎందుకంటె నాకు తెలుసు, మీరు కొత్తవాళ్ళని,కొత్తగా బ్లాగ్ లేదా వెబ్ సైట్ బిల్డ్ చేద్దామనుకొంటున్నారని, మీరు పూర్తిగా నా మాటలను బేస్ చేసుకునే ముందుకు వెళుతున్నారని, అందుకనే నేను మిమల్ని ఆగమంటున్నాను.
 • ఎందుకంటె నేను మీకు ఫాల్స్ గైడెన్స్ ఇస్తే దాని వల్ల మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగిన, లేదా నేను చెప్పిన విషయాన్ని మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయిన, లేదా నేనే చెప్పటంలో పొరపాటున ఏదైనా పొరపాటు చేసిన, అల్టిమేట్ గా సఫర్ అయ్యేది మీరే!
 • మీరు రిస్క్ తీసుకోవడానికి ఈ సైట్ లోకి వచ్చి ఇప్పటి దాకా ఈ ఆర్టికల్ చదవాల్సిన అవసరం లేదు.
 • అలాగే మీరు నా సజెషన్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తే మరెప్పుడు apwebacademy.com కి తిరిగి రారని నాకు తెలుసు.

అలాగే నేను ప్రతి రోజు రివైజ్ చేసుకొంటాను.నేను చెప్పే విషయాల వల్ల ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుందా? దాని వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడం, లేదా హర్ట్ కావడం, అల్టిమేట్ గా రిలేషన్ దెబ్బ తినడం ఎందుకు అని, కానీ నేనెప్పుడూ నాకు తెలియని ఉపయోగం లేని విషయాన్ని తెలుసు అని ఎప్పటికి చెప్పను.

అలాగే ఇప్పుడు నేను పైన చెప్పిన ప్రతి విషయం, నాకు తెలిసి నేను ప్రయత్నం చేసి దాని వల్ల నాకు ఉపయోగం ఉంది ఇది జెన్యూన్ మెథడ్ అని నాకు అనిపిస్తేనే ఈ వారికి లో మీకు చెపుతున్నాను.

ఒక్కసారి తిరిగి వెనక్కి వెళ్ళండి.మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి,నేను చెప్పిన ప్రతి విషయం మీకు అర్ధం ఐయ్యిందా? ఒక్క సారి రివైజ్ చేసుకొందాము.

 • మీరు సెలెక్ట్ చేసుకొన్నా డొమైన్ నిజంగా మంచి డొమైన్ అని మీరు 100 % శాటిస్ ఫై ఐయ్యారా?
 • మీ డొమైన్ మాట్ కట్స్ రూల్స్ ని రీచ్ ఐయ్యిందా?,
 • 1.అంటే మీ ప్రైమరీ కీవర్డ్ తోనే డొమైన్ నేమ్ స్టార్ట్ కావడం,
 • 2.మీ WEBSITE టైటిల్ కూడా అదే కీవర్డ్ అయ్యేటట్టు చూసుకోవడం,
 • 3.అది కూడా టైటిల్ మొదట్లోనే వచ్చేట్టట్టు గా ఉండడం,
 • 4.మీ డొమైన్ నేమ్ అనబడే మీ వెబ్ సైట్ టైటిల్ అనబడే మీ కీవర్డ్ మీ పోస్ట్ లన్నింటిలో 4 నుండి 6 సార్లు వచ్చే అవకాశం ఉందా?
 • మీరు మీ డొమైన్ ను మూడు నుండి ఐదు సంవత్సరాల కాలానికి కొనేటట్లుగా ప్లాన్ చేసుకున్నారా?(ఇది అంత ఇంపార్టెంట్ కాదు.కానీ ఫాలో ఐతే మంచిది.)
 • మీ డొమైన్ నేమ్ “అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు” పోస్ట్ లో చిప్పిన అన్ని రిక్వైర్మెంట్స్ ని మీట్ ఐయ్యిందా?
 • చివరిది మరియు ముఖ్యమైనది భవిష్యత్తులో మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకొన్నా డొమైన్ నేమ్ కే కట్టుబడి మీరు సెలెక్ట్ చేసుకున్న వెబ్ సైట్ టైటిల్ ,మరియు డొమైన్ నేమ్ ల కు అనుకూలంగా ఆర్టికల్స్ రాయగలరా?

కాదు ,అసలు నాకు ఇవేమి వద్దు?నేను సెలెక్ట్ చేసుకొన్న వేరే డొమైన్ నేమ్ కి కట్టుబడి హర్ష అగర్వాల్ లాగ నేనేంటో నిరూపించు కోగలను అనే ఆలోచన ఏమైనా ఉందా?

ఫై విషయాలన్నిటి పైన మీకు పూర్తి క్లారిటీ వచ్చాక పే బటన్ ను క్లిక్ చెయ్యండి.

అద్భుతం! అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా? అనేది మీకు అర్ధం ఐపోయింది. ఇంతవరకు ఎవ్వరు చెప్పని విషయాలు మీరు అర్ధం చేసుకొని ఒక గొప్ప డొమైన్ నేమ్ సొంతం చేసుకొన్నారు.

మీరు మీ డొమైన్ నేమ్ కొనడం పూర్తి ఐయ్యాక మీ డొమైన్ నేమ్ కి సంబంధించిన అన్ని వివరాలతో కూడిన ఒక మెయిల్ మీకు వస్తుంది.మీరు డొమైన్ హోస్టింగ్ అకౌంట్ లోకి లాగిన్ అయినా తరువాత మీకు ఈ క్రింది పేజీ కనపడుతుంది.

hosting account admin area image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు hosting account admin area image for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు

 • మీ మౌస్ ని మీరు మేనేజ్ ఆర్డర్స్ అనే ట్యాబు మీదకి తీసుకు వెళ్ళండి.
 • మీ మౌస్ ఆ ట్యాబు మీదకు వెళ్ళగానే మీకు డ్రాప్ డౌన్ మెనూ కనపడుతుంది.
 • ఈ క్రింది చిత్రంలో చూపించినట్లుగా ఉంటుంది.
 • ఇప్పుడు లిస్ట్/సెర్చ్ ఆర్డర్స్ అనే టాబ్ మీద క్లిక్ చెయ్యండి.
 • ఈ పేజీ మిమ్మని లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ అనే మరొక పేజీ లోకి తీసుకు వెళుతుంది.
 • ఆ పేజీ మీ డొమైన్ నేమ్ కనపడుతుంది.
 • అది గ్రీన్ బుల్లెట్ పాయింట్ లిస్ట్ లాగ ఉంది.
 • పక్కనే మూడు కాలమన్స్ ఉంటాయి.
 • మొదటి కాలమ్ మీ డొమైన్ నేమ్ ను, రెండవది మీ ప్రొడక్టును, మూడవది మీ డొమైన్ ఎక్సపైరీ డేట్ ని చూపిస్తుంది.
 • ఎక్సపైరీ అంటే లోగానే మీరు రెన్యువల్ చేసుకోవాలన్న మాట.

list of orders page for అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు list of orders page for how to set up your domain with hosting name servers

ప్రైవసీ పోటెక్ట్ యెంత విలువైనదో మనమిప్పుడు అర్ధం చేసుకొందాం.

నేను మీకు ఇప్పుడు ఒక విషయం చెపుతాను. దానివల్ల ప్రైవసీ ప్రొటెక్ట్ గురించి ఇంకా మీకు ఏమైనా అనుమానాలుంటే క్లియర్ అవుతాయి.

 • మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి whois.com అని అడ్రస్ బార్ లో టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 • ఏమి జరిగింది?
 • మీకేమి అర్ధమైంది?
 • అక్కడ మీ పేరు.అడ్రస్ బదులుగా ఏ ఆస్ట్రేలియా వాళ్ళాదో, ఐరోపా వాళ్ళదో పేరు, అడ్రస్ ఉంటాయి!
 • ప్రైవసీ ప్రొటెక్ట్ మీరు చెల్లించిన 200 లేదా ౩౦౦ రూపాయలు ఎక్కువంటారా?
 • లేకపోతె ప్రతి వ్యక్తి whois సెర్చ్ చేసుకొని, మీకు  ఫోన్, ఇమెయిల్, మెసేజ్ లతో విసిగించడం ఎక్కువంటారా?
 • నిస్సందేహంగా ప్రైవసీ ప్రొటెక్ట్ మీ డబ్బుకు ఎన్నో వందల రేట్లు విలువ మీకు తిరిగిస్తుంది.

అదండీ సంగతి! దాదాపుగా నాకు తెలిసిన నేను ఆచరించిన విషయాలన్నింటిని మీకు అర్ధమయ్యే రీతిలోనే చెప్పానని అనుకొంటున్నాను. కానీ, ఇబ్బందేమీ లేదు. నిదానంగా అన్ని అర్ధం అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చెయ్యవచ్చు. నేను మీ లాంటి వాళ్లకి హెల్ప్ చెయ్యడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఎందుకంటె మీరు కూడా నాలాగే ఒక గొప్ప అద్భుతమైన వెబ్ సైట్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. ఒక వేళా ఏవైనా చిన్న చిన్న డౌట్ ఉంటే కామెంట్స్ రూపం లో పోస్ట్ చేసిన సమాధానం చెప్పేస్తాను.

కంక్లూజన్: అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు.

ఇది ఇప్పటికే చాలా పెద్ద పోస్ట్ ఐయ్యింది. కానీ నా లక్ష్యం ఒక్కటే విజిటర్స్ కి మనం ఏదయినా ఒక సమాచారం ఇస్తున్నాం అంటే, అది అంతా కరెక్ట్ గా వివరంగా ఉండాలి. ఎందుకంటె ఉదాహరణకు మీరు లేదా మీలో కొందరు ఇదంతా ఎన్నో పుస్తకాలు,  మరెన్నోఆర్టికల్స్ చదివి, ఎన్నో వీడియోలు చూసినేర్చుకొని ఉంటారు. మీకు బ్రీఫ్ గా కాకపోయినా కొంచెం టచ్ చేసి వదిలి పెట్టిన మీ లాంటి వాళ్ళు అర్ధం చేసుకో గలరు. కానీ కొత్త వాళ్ళ పరిస్థి ఏమిటి?

 • వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు.
 • వాళ్లకు వివరంగా చెబితేనే కానీ అర్ధం చేసుకోలేరు.
 • వాళ్ళు ఈ ఆర్టికల్ నుండి ఉపయోగం పొంది ఒక మంచి డొమైన్ నేమ్ ని కొనుక్కో గలిగితే, ఆర్టికల్ రాసినందుకు నాకు, చదివినందుకు వాళ్లకు ఉపయోగం ఉంటుంది.

మీరు కనక ఈ ఆర్టికల్ చదివి దీనిని అర్ధం చేసుకొని ఒక మంచి డొమైన్ నేమ్ ని కొనుకుంటే, మీకన్నా కూడా నేను ఎక్కువగా సంతోషిస్తాను. మీరు ఈ పోస్ట్ మీకు ఉపయోగ పడిందని భావిస్తే,  మీ స్నేహితులు లేదా మీకు సంబంధించిన మరెవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి. అలాగే ఇటువంటి మరిన్ని మీకు ఉపయోగపడే ఆర్టికల్స్ ని మిస్ కాకుండా ఉండాలంటే, మీ ఇమెయిల్ అడ్రస్ ద్వారా నా సైట్ కు సబ్ స్క్రైబ్ కావడం కానీ,  లేదా నా సోషల్ లింక్స్ లో మీకు నచ్చిన ఒక అకౌంట్ ను ఫాలో కావడం కానీ చేయగలరు.

నేను మీ లాంటి గొప్ప వ్యక్తులు అందరి మధ్య గర్వంగా నిలబడటానికి కారణమైన వాటిని ఇప్పుడు మీ ముందుకు తీసుకు వస్తున్నాను.

కాన్ఫిడెంటుగా apwebacademy లాంటి ఒక సైట్ బిల్డ్ చేయటానికి, ఒక అద్భుతమైన డొమైన్ కొనడం ఎలా? ఇంతవరకు ఎవ్వరు చెప్పని విషయాలు లాంటి పోస్ట్ రాయటానికి, నాకు కొన్ని బుక్స్ ఒక ప్రో లాగా ఉపయోగపడ్డాయి! ఈ బుక్స్ మీకు కూడా నాకన్నా చాలా ఉపయోగ పడతాయని నేను భావిస్తున్నాను.

ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారా నేను గెస్ చేయ గలననే అనుకొంటున్నాను. ఇప్పుడు మీరొక మంచి డొమైన్ నేమ్ కొన్నారు. ఇప్పుడేమి చెయ్యాలి? ఎక్కడ నుండి స్టార్ట్ చెయ్యాలి? ఎలా? లాంటి చాలా ప్రశ్నలే మిమ్మల్ని తొలిచేస్తూ ఉంటాయి. కచ్చితంగా రాబోయే ఆర్టికల్స్ లో మనం వాటన్నిటి గురించి కూడా నేర్చుకుందాం.

కానీ నాకు ఈ విజ్ఞానాన్ని అందించిన వాటిగురించి మాత్రం నేను గుర్తు చేసుకోకుండా మీకు చెప్పకుండా ఉండలేను. ఎందుకంటె ఈ పుస్తకాలన్నీ మీకు కచ్చితమైన గైడెన్స్ ఇస్తాయి, అది మీరు డొమైన్ కొన్నకైనా, కొనక ముందైనా, మీరు ఏ  స్టేజి లో ఉన్న మీకు కోడింగ్ తో నైనా, కోడింగ్ తో సంబంధం లేకుండానైనా, మీరు వీటి సపోర్ట్ తో ఎటువంటి వెబ్ సైట్ నైనా నిర్మించగలరు. మీరు కొత్త వాళ్ళైనా, సీనియర్ అయినా ఇవి మీకు ఏంటో ఉపయోగపడతాయి.

ఈ బుక్స్ మీకు నాకన్నా ఎక్కువగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు డొమైన్ కొనక పోతే, hostgator వద్ద ఒక మంచి నేమ్ కొనుక్కోండి. ఒక వేళా మీరు ఆల్రెడీ డొమైన్ నేమ్ కొని ఉంటే బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే ఆర్టికల్ ని చదివి మంచి వెబ్ హోస్ట్ ని సెలెక్ట్ చేసుకోగలరు.

మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ మీద క్లిక్ చెయ్యండి.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

Summary
అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు
Article Name
అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు
Description
నేను మీకు చెప్పబోయే విషయాలన్నీ గూగుల్ వెబ్ స్పామ్ టీం హెడ్ మాట్ కట్స్ వివిధ సందర్భాలలో చెప్పిన అనేక విషయాలలోని సారాంశం. ఆయన మాటలలోని సారాంశాన్ని నేను మీకు అర్ధమయ్యే విధంగా ఈ క్రింద తెలియజేస్తున్నాను.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love
 • 190
  Shares

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

Specify Facebook App ID and Secret in Super Socializer > Social Login section in admin panel for Facebook Login to work

Specify GooglePlus Client ID and Secret in Super Socializer > Social Login section in admin panel for GooglePlus Login to work

%d bloggers like this: