ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తో జాబ్ లేదా బిజినెస్

హలో, Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు మనం మీ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్తో జాబ్ లేదా బిజినెస్ మీ అవకాశాన్ని బట్టి దేన్నయినా ఒక దానిని సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే విషయాన్ని తెలుసుకుందాం. వినటానికి బానే ఉంది కానీ ! ఇది ఎంతవరకు సాధ్యం? ఇదే కదా! మీ అనుమానం? సరే మనమిప్పుడు అసలు ఇదంతా ఏమిటి ఎలా సాధ్యపడుతుందో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుత వెబ్ ప్రపంచం లో రోజు వేలకొద్దీ వెబ్ సైట్ లు పుట్టుకొస్తున్నాయి. వారందరి లక్ష్యం ఒక్కటే ఆన్ లైన్ లో సక్సస్ కావడం, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవడం, సాధ్యమైనంత ఎక్కువమంది ఇంటర్నెట్ యూజర్స్ ని రీచ్ అవ్వడం. అంటే దానికి ఉన్న ఏకైక మార్గం.అత్యుత్తమైన కంటెంట్ ను తయారు చేయడమే. అంటే రాబోయే రోజుల్లో(ఇప్పటి వరకు కూడా) అన్నిటికన్నా కీలకమైన పాత్ర కంటెంట్ మాత్రమే. ఎందులో మన ఎవ్వరికీ ఏ సందేహం లేదు ఈ పాయింట్ ను బేస్ చేసుకొనే ఈ రోజు ఆర్టికల్ లో మనం దీన్నెలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం.

మీరు నా గురించి అబౌట్ పేజీ లో తెలుసుకోవచ్చు.

ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తో జాబ్ లేదా బిజినెస్

మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా నాకు ఈ క్రింది విషయాలకు సమాధానం చెప్పండి.

 • ఎందుకని గూగుల్ కొన్ని వెబ్ సైట్ లను, బ్లాగ్ లను మాత్రమే సెర్చ్ రిజల్ట్స్ లో మొదటి పేజీ లో చూపిస్తుంది?
 • మీలో ఎంతమంది ఒక సైట్ కు మంచి డొమైన్ నేమ్ ఉందని లేదా ఆ సైట్ మంచి web హోస్ట్ వద్ద హోస్ట్ చేయబడి ఉందని ఆ సైట్ ని విజిట్ చేశారు?
 • ఎంతమంది ఒక సైట్ యొక్క సైడ్ బార్ డిజైన్ బావుందని మీలో యెంత మంది ఆ సైట్ ని రెగ్యులర్ గా విజిట్ చేస్తారు?
 • ఒక బ్లాగర్ యొక్క పేరు గాని లేదా యూజర్ నేమ్ గాని బావుందని ఎంతమంది ఆ సైట్ ని రెండోసారి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు విజిట్ చేశారు?
 • మీరు మిస్ అవ్వకుండా రోజు ఫాలో అయ్యే సైట్ ని ఎందుకని రోజు చూస్తున్నారు? సైట్ డిజైన్ కోసమా? సైట్ పేరు బావుందని చూస్తున్నారా? కలర్ కాంబినేషన్ బావుందనా? లేదంటే మరేదేనా కారణం ఉందా?

ఉంది కదా? అది ప్రత్యేకమైనది. దాని మించింది ఏది ఒక సైట్ పాపులర్ కావడం లో మొదటి స్థానంలో ఉండదు. అదేమిటంటే ఆ సైట్ యొక్క కంటెంట్. అందులో ఎటువంటి సందేహం లేదు! కాదంటారా?

రోజు రోజుకి కంటెంట్ రైటర్స్ అంటే విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది? ముందు ముందు రోజుల్లో అది ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది నూటికి నూరు పాళ్ళు వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంగ్లీష్ లేదా మీ మాతృ భాషలో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ గా కానీ లేదా మీ స్నేహితులతో మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళతో కలసి సొంత కంటెంట్ రైటింగ్ స్టార్ట్ అప్ ని కానీ మీ కెరీర్ గా ఎంచు కోవడం లో తప్పేముంది?

ఇప్పుడు మనం ఇందుకు కావలిసినది ఏమిటో, మరియు ఏ విధంగా సాధ్యపడుతుందో, అవకాశాలేమిటో చూద్దాం?

ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తో జాబ్ లేదా బిజినెస్ ప్రారంభించడానికి కావలసినది ఏమిటి?

నాకు తెలిసినంతలో ఇప్పుడు నేను చెప్పే అర్హతలు అన్ని మీకు ఉండే ఉంటాయి.

 •  తప్పని సరిగా కరెక్ట్ స్పెల్లింగ్స్ మరియు రెగ్యులర్ వర్డ్స్ బాగా తెలిసుండాలి.
 • మీకు సెంటెన్స్ ఫార్మషన్ గురించి బాగా తెలిసుండాలి.
 • మీకు మంచి పంక్చుయేషన్ నాలెడ్జి అంటే ఎక్కడ కామా పెట్టాలి? ఎక్కడ పుల్ స్టాప్ వాడాలి అనే విషయం బాగా తెలిసుండాలి.
 • మీకు మంచి స్టైలింగ్ అంటే పేరా డిజైనింగ్ వంటివి తెలిసుండాలి.
 • మీకు కస్టమర్ కి కావలసిన సబ్జెక్టు మీద రీసెర్చ్ చేసి ఒక మంచి అనాలసిస్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటె అది మంచి ప్లస్ పాయింట్ అవ్వుతుంది.
 • అంతే కాక మీకు seo మరియు కీ వర్డ్స్ ఫై అవగాహన ఉంటె అది మీకు మరియు కస్టమర్ కి ఇద్దరికీ ఉపయోగ కరంగా ఉంటుంది.

ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తో జాబ్ లేదా బిజినెస్ ఎలా సాధ్యపడుతుంది?

నేను ఇప్పుడు చెప్పబోయే సింపుల్ విషయాలు మీకు ఓకే ఐతే మీకు ఇది సాధ్యపడుతుంది.

 • మీకు రోజు ఒకటి నుండి రెండు గంటల ఖాళీ సమయం ఉండాలి.
 • మీకు మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్న ఫ్రెండ్స్ లేదా కమ్యూనిటీ ఉండాలి.
 • మీరు అవసరాన్ని బట్టి స్టార్ట్ అప్ మొదలు పెట్టాలనుకుంటే కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
 • అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు కంటెంట్ రైటింగ్ స్టార్ట్ అప్ మొదలు పెట్టాలి అనే ఆసక్తి ఉండాలి.
 • లేకపోతె మీరు ఫ్రీలాన్స్ రైటర్ గా ఉండటం మేలు. కొన్ని రిజెక్షన్స్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తో జాబ్ లేదా బిజినెస్ మొదలు పెట్టటానికి ఎవరికి అవకాశాలు ఉంటాయి?

మీరు ఎంచుకునే అవకాశం మీ నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలియజేస్తుంది. మీకు ఒక వేళ స్టార్ట్ అప్ గురించి ఇంట్రెస్ట్ ఉంటె మీరు ఒక మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

 • మీరు ఒక ప్రొఫషనల్ జాబ్ లేదా బిజినెస్ చేస్తున్నారనుకుందాం. మీ ప్రొఫషన్ మీకు బాగానే ఉంది. మీకు రోజు రెండుగంటల టైం ఉంది. మీ స్నేహితులు కూడా మంచి ఇంగ్లీష్ లేదా మీకు కావలసిన లాంగ్వేజ్ లో ఎక్సపర్ట్స్ అనుకోండి. మీకు ఏదయినా క్రియేటివ్ చెయ్యాలని ఉంది.
 • ఇప్పుడే మీ స్టడీస్ కంప్లీట్ చేశారు. ఇంకా జాబ్ చెయ్యాలో, బిజినెస్ చెయ్యాలో నిర్ణయించుకోలేదు. మీకు కావలిసినంత టైం ఉంది. మీ కమ్యూనిటీ కూడా మీలాగే మంచి రైటింగ్ ఎక్సపర్ట్స్.
 • మీరు ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా మరేదయినా చేస్తున్నారనుకొందాం. మీకు ఏదయినా కొత్తగా చెయ్యాలని ఉంది.
 • మీరు మీ జాబ్ లేదా బిజినెస్ నుండి రిటైర్ అయ్యారు. ఏదయినా కొత్త విషయం మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచాలి.
 • ఇంకా మిగిలినవి చాలా కూడా.

అన్ని ఓకే, తర్వాత ఏంటి?

క్రాస్ రోడ్స్ . మీరు ఎటు వెళ్లాలో , ఎక్కడికి చేరాలో నిర్ణయించుకోండి.

 • ముందుగా మీరు డిసైడ్ చేసుకోండి! మీరు స్టార్ట్ అప్ మొదలు పెడతారా? లేక ఫ్రీలాన్స్ రైటర్ గా సెటిల్ అవుతారా?
 • ఒక వేళ మీరు పార్ట్ టైం కంటెంట్ రైటర్ గా సెటిల్ కావాలనుకొంటే go for Fiverr? Or Freelancer.
 • ఒక వేళ మీరు ప్రొఫషనల్ కంటెంట్ రైటర్ గా స్థిరపడాలనుకుంటే go for Content mart. Create content that is genuinely useful to your customers.

Contentmart-freelance writers
Contentmart.com deal of Free $10 on the refill of $10 or above. Use Code: AFFL10

మీరు స్టార్ట్ అప్ మొదలు పెట్టాలనుకుంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

మీకు ఇంకా ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తో జాబ్ లేదా బిజినెస్ అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి

Summary
ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తో జాబ్ లేదా బిజినెస్
Article Name
ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ తో జాబ్ లేదా బిజినెస్
Description
వినటానికి బానే ఉంది కానీ ! ఇది ఎంతవరకు సాధ్యం? ఇదే కదా! మీ అనుమానం? సరే మనమిప్పుడు అసలు ఇదంతా ఏమిటి ఎలా సాధ్యపడుతుందో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: