జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా

హలో, Ap Web Academy కి స్వాగతం.ఈ రోజు మనం జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా? అనే విషయం గురించి తెలుసు కుందాం. ఒకరకంగా చెప్పాలంటే మీ జీమెయిల్ అకౌంట్ సెక్యూరిటీ ఎలా ఉండాలి అనేదానికి సంబంధించిన టాపిక్.

ప్రసుతం ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరికి జీమెయిల్, ఫేసుబుక్, వాట్సాప్ లాంటి అకౌంట్లన్నీ కామన్ గానే ఉంటున్నాయి. కానీ నేను జీమెయిల్ సెక్యూరిటీ గురించే ఎందుకు చెపుతున్నానంటే మీరు ఫేసుబుక్, వాట్సాప్ మరే ఇతర వెబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్న లేదా ఏదయినా న్యూస్ లెటర్ కి లేదా యూట్యూబ్ ఛానల్ వంటి వాటికి సబ్ స్క్రైబ్ చేసుకోవాలన్న మీకు తప్పనిసరిగా ఒక మెయిల్ అడ్రస్ అవసరం. మీ సొంత డొమైన్ నేమ్ తో మెయిల్ అడ్రస్ మెయింటైన్ చేయడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అలాంటి ఫీచర్స్ అన్నిటితో ఈజీ ఇంటర్ పేస్ ఆప్షన్స్ తో అంటే ఎవరైనా తేలికగా వాడేలా ఉండే విధంగా మనకు ఇంటర్నెట్ లో గూగుల్ మాత్రమే జీమెయిల్ అని ప్రొవైడ్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్, యాహు మెయిల్, మరి కొన్ని కంపనీలు ఇమెయిల్ ఫ్రీగా నే ప్రొవైడ్ చేస్తున్న వాటిలోని ఆప్షన్స్ కొంతమందికి అర్ధం కావు.అందు వల్ల ఈ రోజు ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కరు జీమెయిల్ అకౌంట్ కే ఎక్కువ ప్రిఫరెన్సు ఇవ్వడం జరుగుతుంది. అంత ముఖ్యమైన జీమెయిల్ అకౌంట్ ను మనం హ్యాకర్ల దాడి నుండి కాపాడుకోవడం ఎలా?

మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా నాగురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చూడండి

జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా

ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నన్ను ఫాలో అవ్వండి.

  • ముందుగా మీ జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
  • రైట్ సైడ్ పైన ఉన్న ప్రొఫైల్ ఇమేజ్ మీద క్లిక్ చెయ్యండి.
  • అప్పుడు మీకు డ్రాప్ డౌన్ ప్రొఫైల్ బాక్స్ కొన్ని లింక్స్ తో ఓపెన్ అవుతుంది.
  • అది ఈ క్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.
profile tab image for జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా
profile tab image for జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా
  • ఇప్పుడు అక్కడ బ్లూ కలర్ లో ఉన్న మై అకౌంట్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.
  • సైన్ ఇన్ & సెక్యూరిటీ అనే ఒక కొత్త పేజీ మీకు కనపడుతుంది.
  • అది ఈ క్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.
  • ఇప్పుడు మీరు siginig into గూగుల్ అని బ్లూ కలర్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చెయ్యండి.
  • ఇది సైన్ ఇన్ & సెక్యూరిటీ పేజీ లో ఫస్ట్ సెక్షన్ లో ఉంటుంది.
sign in& security tab image for జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా
sign in& security tab image for జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా
  • మీరు క్లిక్ చేసాక ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు ఆ పేజీ లో 2 -స్టెప్ వెరిఫికేషన్ అనే లింక్ కోసం స్క్రోల్ డౌన్ చెయ్యండి.
  • 2 -స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ మోడ్ లో ఉంటుంది.
  • దానిమీద క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు మీ మిమ్మల్ని ఒక కొత్త పేజీ లోకి తీసుకు వెళుతుంది.
  • ఒక వేళ మీ మెయిల్ అకౌంట్ మీ పాస్వర్డ్ అడిగితే మరోసారి ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు మీకు 2 -స్టెప్ వెరిఫికేషన్ పేజీ కనిపిస్తుంది.
  • 2 -స్టెప్ వెరిఫికేషన్ పేజీ లోని గెట్ స్టార్టెడ్ అనే బ్లూ కలర్ లింక్ పేజీ ని క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు మరొక పేజీ ఓపెన్ అవుతుంది.

అది ఈ క్రింది ఇమేజ్ లో లాగ ఉంటుంది.

mobile number asking page for జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా
mobile number asking page for జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా

imporatant steps

  • ఇప్పుడు అక్కడ మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చెయ్యండి.
  • ఒక వేళ మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ కాబడి ఉంటే అది ఇక్కడ చూపిస్తుంది.
  • తర్వాత మీరు టెక్స్ట్ మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ అనే దాంట్లో మీకు కన్వినెంట్ గా ఉండే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చెయ్యండి.
  • మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక కోడ్ కన్ఫర్మేషన్ box ఎంప్టీ గా ఉంటుంది.
  • ఇప్పుడు మీకు ఒక OTP మీ మొబైల్ నెంబర్ కు పంపించబడుతుంది.
  • ఆ యొక్క OTP ని మీరు కోడ్ కన్ఫర్మేషన్ బాక్స్ లో ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ క్లిక్ చెయ్యండి.
  • ఇప్పడు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ లో మీరు “It worked! Turn on 2-Step Verification?” అనే సెంటెన్స్ పేజీ పైన మీకు కనపడుతుంది.
  • ఇప్పుడు మీరు టర్న్ ఆన్ అనే బటన్ ను క్లిక్ చేయండి.

అంతే, ఇప్పుడు మీరు మీ జీమెయిల్ అకౌంట్ హాక్ కాకుండా ఉండడానికి కావలిసిన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.ఇప్పుడు మీరు కానీ లేదా మరెవరైనా మీ జీమెయిల్ అకౌంట్ లోకి లాగిన్ కావడానికి ప్రయత్నించినప్పుడు మీ నెంబర్ కి OTP వస్తుంది. దానిని మీరు ఎంటర్ చేస్తేనే మీ అకౌంట్ లోకి లాగిన్ కాగలరు.

నా మొబైల్ లేదా సిమ్ పోయింది? సిగ్నల్ ప్రోబ్లెంస్ వలన నాకు OTP రాలేదు. నేను జీమెయిల్ అకౌంట్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి?

కామన్ గా OTP ఆప్షన్ వాడే వాళ్లంతా ఫేస్ చేసే ప్రోబ్లెంస్ ఇవి. ఒక్కోసారి సెక్యూరిటీ వలన మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందులో ఇవి కూడా కొన్ని. ఇప్పుడు వీటిని ఫేస్ చేయడమెలాగో చూద్దాం.

మీరు 2-Step వెరిఫికేషన్ పేజీ లో టర్న్ ఆన్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ని స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. మీకు ఒక ఐడియా రావడానికి ఏఈ క్రింద ఇమేజ్ ని గమనించండి.

alternative login options page for జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా
alternative login options page for జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా

అక్కడ 5 ఆప్షన్స్ కనపడతాయి. అందులో మొదటిది బ్యాక్ అప్ కోడ్స్.

follow the steps.

  • సెట్ అప్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.
  • ఒక వేళ మీ మెయిల్ అకౌంట్ మీ పాస్వర్డ్ అడిగితే మరోసారి ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చెయ్యండి.
  • ఒక విండో ఓపెన్ అవుతుంది.అందులో పది బ్యాక్ అప్ కోడ్స్ ఉంటాయి.
  • ముందుగా మీ మొబైల్ తో వాటిని ఫోటో తీసుకోండి.
  • డౌన్ లోడ్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు మీ కోడ్స్ ను మీ డివైస్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • అలాగే ప్రింట్ చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది.
  • తర్వాత సాధ్యమైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి.
  • ఇప్పుడు ఇ ఫైల్స్ అన్నిటిని జాగ్రత్తగా మీకు మాత్రమే తెలిసిన చోట ఎప్పుడు కావాలన్న అందుబాటులో ఉండే విధంగా సేవ్ చేసుకోండి.
  • ఇప్పుడు మీరు ఎప్పుడు సిగ్నల్ ప్రాబ్లెమ్ వలన మీకు OTP రాకపోయినా లేదా మీ మొబైల్ లేదా సిమ్ పోయిన ఈ కోడ్ లను ఉపయోగించి లాగిన్ కావచ్చు.
  • ఒక కోడ్ ఒక సారి మాత్రమే పనిచేస్తుంది.
  • కాబట్టి మీరు ఎప్పటికప్పుడు 6 నుండి 7 సార్లు ఈ కోడ్ లను ఉపయోగిస్తే మళ్లీ కొత్త కోడ్ లను జనరేట్ చేసుకొని సేవ్ చేసుకోండి.
  • అలాగే మొబైల్ లేదా సిమ్ పొతే గనక మీరు ఈ కోడ్ ని ఉపయోగించి లాగిన్ ఐన మొదటి సారి మరొక మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి, 2-Step వెరిఫికేషన్ ను మీ కొత్త నెంబర్ కు సెట్ చేసుకోండి.

మీకు ఇంకా జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఇలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా
Article Name
జీమెయిల్ అకౌంట్ హాకింగ్ కాకుండా చూసుకోవడం ఎలా
Description
నేను జీమెయిల్ సెక్యూరిటీ గురించే ఎందుకు చెపుతున్నానంటే మీరు ఫేసుబుక్, వాట్సాప్ మరే ఇతర వెబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్న లేదా ఏదయినా న్యూస్ లెటర్ కి లేదా యూట్యూబ్ ఛానల్ వంటి వాటికి సబ్ స్క్రైబ్ చేసుకోవాలన్న మీకు తప్పనిసరిగా ఒక మెయిల్ అడ్రస్ అవసరం.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don’t have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that’s why you’re read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: