డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా

Ap web academy కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ వెబ్సైటు ను బిల్డ్ చేసుకొనే ప్రాసెస్ లో లేదా మీరు హోస్టింగ్ ప్రొవైడర్స్ ను మార్చుకునే సందర్భంలో మీకు బాగా ఉపయోగ పడుతుంది. డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా ? ఇది మనం ఒక వెబ్ హోస్ట్ నుండి మరొక వెబ్ హోస్ట్ కి మన డొమైన్ లేదా హోస్టింగ్ అకౌంట్ మార్చుకునేటప్పుడు కానీ, లేదా డొమైన్ ఒక హోస్ట్ వద్ద వెబ్ హోస్టింగ్ ఒక హోస్ట్ వద్ద కొన్నప్పుడు కానీ మనకు తప్పని సరిగా చేయవలసిన మఖ్యమైన పని.

సాధారణం గా హోస్ట్ గాటర్ లాంటి మంచి పేరున్న కంపెనీలు డొమైన్, వెబ్ హోస్టింగ్ రెండు వారి వద్దే కొంటే వారే ఈ పనిని పూర్తి చేస్తారు. ఒక వేళ మనం ఒకే సారి కాకపోయినా డొమైన్, వెబ్ హోస్టింగ్ విడివిడిగా కొన్న వారి కస్టమర్ కేర్ ని సంప్రదిస్తే వాళ్ళు మన డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్స్ నేమ్ సర్వర్స్ కి అస్సైన్ చేస్తారు. కానీ బయట కొంతమంది హోస్టింగ్ ప్రొవైడర్స్ మనకి డొమైన్, వెబ్ హోస్టింగ్ అకౌంట్ విడివిడిగా ఇచ్చేస్తారు.

మీరు ఎప్పుడైనా ఒక హోస్ట్ నుండి మరొక హోస్ట్ లోకి మారిన కూడా మీకు ఒక్కోసారి నేమ్ సర్వర్స్ చేంజ్ చేసు కోవాలిసి ఉంటుంది. కాబట్టి, ఫై కారణాల అన్నిటివలన మనకు డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా? అనే విషయం తప్పనిసరిగా తెలిసిఉండాలి. అప్పుడు మనము మెయిన్ టాపిక్ లోకి వెళ్లబోయే ముందుగా,మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా

ముందుగా మీరు మీ డొమైన్ మరియు మీ హోస్టింగ్ అకౌంట్స్ లోకి లాగిన్ అవ్వండి. మీకు డొమైన్ లేకపోతే ఒక మంచి డొమైన్ నేమ్ ఇక్కడ కొనుక్కోండి. మీకు డొమైన్ కొనడం ఎలాగో తెలియకపోతే అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు చదివి కొనుక్కోవచ్చు. అలాగే మీకు హోస్టింగ్ అకౌంట్ లేకోపోతే బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే ఆర్టికల్ చదివి మీరు మంచి హోస్టింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

నేనిప్పుడు నా డొమైన్ మరియు హోస్టింగ్ కలిపి ఉన్న హోస్ట్ గాటర్ అకౌంట్ లోకి లాగిన్ అవుతున్నాను. మీరు కూడా లాగిన్ ఐయ్యాక మేనేజ్ ఆర్డర్స్  అనే ట్యాబు మీద మీ మౌస్ క్లిక్ చెయ్యండి. అది మిమ్మల్ని మీకు సంబంధించిన డొమైన్ మరియు హోస్టింగ్ అకౌంట్ వివరాలు ఉన్న పేజీ కి తీసుకు వెళ్తుంది. అది ఈ క్రింది విధంగా ఉంటుంది. హోస్ట్ గాటర్ కాకపొతే మీ అకౌంట్స్ మీ డొమైన్ మరియు హోస్టింగ్ అకౌంట్ సంబంధించిన పేజీలలోకి వెళ్ళండి. హోస్ట్ గాటర్ లో లాగిన్ అయ్యాక ఇలా ఉంటుంది.

list of orders page for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
list of orders page for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
  • ఇప్పుడు హోస్టింగ్ అకౌంట్ అని ఉన్న చోట క్లిక్ చెయ్యండి.
  • మీ క్లిక్ మిమ్మల్ని ఈ క్రింద ఉన్న పేజీ లోనికి తీసుకు వెళ్తుంది.
hosting account manage image for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
hosting account manage image for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
hosting account manage image for for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా 2
hosting account manage image for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా2
  • ముందుగా మీరు హోస్టింగ్ సంబంధిచిన సెట్టింగ్స్ లో నేమ్ సర్వర్స్ అనే ట్యాబు మీద క్లిక్ చెయ్యండి.
  • ఈ క్రింద ఇమేజ్ లో లాగ మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది.
name servers image for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
name servers image for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా

ఆ విండో లో రెండు పద్ధతులు ఉంటాయి.కానీ నేను మీకు తేలికైన మొదట పద్దతి గురించి చెపుతాను.

ఇప్పుడు మనం డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా అనే ఆర్టికల్ లోని ముఖ్యమైన పార్ట్ లోకి వెళుతున్నాం.

దాంట్లో ఏముందంటే “ఆప్షన్ నెంబర్ 1 మీ డొమైన్ నేమ్ ను మాయొక్క నేమ్ సర్వర్ తో కాన్ఫిగర్ చెయ్యండి.” అనే  లైన్ తర్వాత అక్కడ బ్లాక్ బులెట్ రెండు బ్లాక్ పాయింట్స్ ఉన్నాయ్.అవి మీ డొమైన్ యొక్క రెజిస్ట్రేషన్ మరియు మీ హోస్టింగ్ అకౌంట్ ను చూపిస్తున్నాయి.నేమ్ సెర్వెర్వేర్ నంబర్స్ మరియు అక్షరాలతో కలిపి దాదాపుగా నేను క్రింద చూపెట్టినట్లుగా ఉంటాయి.

ap1.we-in-27.apwebacademy.com
ap1.we-in-27.apwebacademy.com

  • ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి.
  • మీ డొమైన్ ప్రొవైడర్,హోస్టింగ్ ప్రొవైడర్ ఒకటే ఐనా,కాకపోయినా మీరు నేమ్ సర్వర్స్ సెట్ చేసుకునే పద్దతి మాత్రం ఒక్కటే.
  • ముందుగా మీరు మీ హోస్టింగ్ అకౌంట్ నేమ్ సర్వర్స్ ని కాపీ చేసుకోండి.
  • తరువాత మీ డొమైన్ రిజిస్ట్రేషన్ అనే పార్ట్ కి వెళ్లి అక్కడున్న నేమ్ సర్వర్స్ అనే ట్యాబు మీద క్లిక్ చెయ్యండి.
  • అది ఈ క్రింద చూపించిన విండో ని ఓపెన్ చేస్తుంది.
domain name servers image for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
domain name servers image for డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
  • ఇప్పుడు మీరు వెబ్ హోస్టింగ్ అకౌంట్ యొక్క నేమ్ సర్వర్స్ ట్యాబు లోని నేమ్ సర్వర్స్ ని కాపీ చేసుకోండి.
  • వాటిని డొమైన్ నేమ్ యొక్క నేమ్ సర్వర్స్ ట్యాబు లో పేస్ట్ చెయ్యండి.
  • అప్ డేట్ నేమ్ సర్వర్స్ అనే బటన్ నొక్కటం మర్చిపోకండి.
  • ఇప్పుడు మీరు మీ నేమ్ సర్వర్స్ ని అప్ డేట్ చేసారు.
  • సాధారంగా నేమ్ సర్వర్స్ గంట నుండి రెండు గంట ల లోపు అప్ డేట్ అవుతాయి.
  • కానీ ఒక్కోసారి 24 గంటలనుండి 72 గంటల వరకు కూడా సమయం తీసుకోవచ్చు.

ఈ విధంగా మీరు మీ నేమ్ సర్వర్స్ ను ఎప్పుడు అవసరమైతే అప్పుడు మార్చుకొంటూ ఉండవచ్చు.ఈ ప్రాసెస్ లో మీకు ఏమైనా అర్ధం కాకపోయినా నన్ను కాంటాక్ట్ చెయ్యవచ్చు.అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా బ్లాగ్ ను ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
Article Name
డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా
Description
డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా ? ఇది మనం ఒక వెబ్ హోస్ట్ నుండి మరొక వెబ్ హాట్ కి మన డొమైన్ లేదా హోస్టింగ్ అకౌంట్ మార్చుకునేటప్పుడు కానీ లేదా డొమైన్ ఒక హోస్ట్ వద్ద వెబ్ హోస్టింగ్ ఒక హోస్ట్ వద్ద కొన్నప్పుడు కానీ మనకు తప్పని సరిగా చేయవలసిన మఖ్యమైన పని.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

ajay kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply