నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా?

హలో. Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు మనం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఐన HTML గురించి నేర్చుకుందాం. అదేమిటంటే నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా? సాధారణంగా HTML పేజీ ని ఎటువంటి టెక్స్ట్ ఎడిటర్ తో నైనా క్రియేట్ చేయవచ్చు. కానీ నేను నోట్ పాడ్ నే ఎందుకు ఎంచుకున్నానంటే నోట్ పాడ్ విండో లోని ఒక ఫ్రీ ఇన్ బిల్ట్ టెక్స్ట్ ఎడిటర్. అందువల్లే నేను నోట్ పాడ్ ను ఎంచుకున్నాను. మీరు మీకు ఇష్టమైన మరేదయినా టెక్స్ట్ ఎడిటర్ ని ఎంచుకోవచ్చు. మీరు HTML పేజీ క్రియేట్ చెయ్యాలంటే ముందుగా మీకు HTML అంటే ఏమిటి? అనే విషయం తెలిసి ఉండాలి?

ముఖ్యమైన విషయమేమిటంటే మీరు నేర్చుకున్న ప్రతి విషయాన్ని బాగా అర్ధం చేసుకోవాలి. తర్వాత మీరు దాన్ని బాగా ప్రాక్టీస్ చెయ్యాలి. లేదంటే మీరు నేర్చుకోవడం లోనే మిగిలిపోతారు.

మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చూడగలరు.

నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా?

ఇప్పుడు మీ కంప్యూటర్ లో నోట్ పాడ్ ఓపెన్ చెయ్యండి. స్టార్టింగ్ మార్క్ అప్ అంటే మనం ఇంతకూ ముందు ఆర్టికల్ లో చెప్పుకున్నట్లు బ్రౌజర్ కి మనం ఇది HTML 5 డాక్యుమెంట్ అని తెలియజేయాలి.కానీ నేను మీకు ఈజీ గా ఉండడానికి మరొక సారి చెప్తాను.

  • నోట్ పాడ్ ఓపెన్ చెయ్యండి.
  • ఫస్ట్ లైన్ లో HTML 5 డాక్యుమెంట్ డిక్లరేషన్ చెయ్యండి.
  • అది ఎలాగంటే <!DOCTYPE html> అని రాయండి. ఇప్పుడు మనం బ్రౌజర్ కి ఇది HTML 5 అని తెలియజేసాం.
  • ఇప్పుడు HTML ఓపెనింగ్ టాగ్ రాయండి. అది ఇలా ఉంటుంది.<html>.
  • అలాగే HTML క్లోజింగ్ టాగ్ రాయండి. అది ఇలా ఉంటుంది. </html>.
  • మనం ఇంతకూ ముందు చెప్పుకున్నట్లు HTML లాంగ్వేజ్ మొత్తం ఈ టాగ్ ల మధ్యలో ఉంటుంది.
  • దీన్ని మొత్తాన్ని కలిపి మనం HTML పేజీ లేదా HTML డాక్యుమెంట్ అని పిలుస్తాం.

ఓకే, తర్వాత ఏమి చెయ్యాలి? అది కూడా చూద్దాం.HTML డాక్యుమెంట్ కు కూడా మనకు లాగే రెండు ప్రధానమైన భాగాలుగా ఉంటుంది. వాటిలో ఒక దానిని హెడ్ అని రెండవ దానిని బాడీ అని పిలుస్తారు.

ఇప్పుడు మనం హెడ్ గురించి తెలుసుకుందాం.

HEAD (హెడ్).

  • HTML హెడ్ ఎలిమెంట్ HTML డాక్యుమెంట్ లో ఒక ముఖ్యమైన భాగం.
  • హెడ్ ఎలిమెంట్ ఓపెనింగ్ <head> టాగ్ మరియు క్లోజింగ్ </html> లతో క్రియేట్ చేయబడుతుంది.
  • బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్ పైన టాబ్ లో చూపించబడే వెబ్ సైట్ లేదా వెబ్ పేజీ పేరు ఇక్కడ రాస్తారు.
  • మరియు వెబ్సైటు డిజైన్ కి సంబంధించిన CSS ప్రోగ్రాం, ఇంటర్ ఆక్టివిటీ కి సంబంధించిన జావాస్క్రిప్ట్ ప్రోగ్రాం లేదా వాటికి సంబంధించిన ఎక్సటెర్నెల్ డాకుమెంట్స్ లింకింగ్ మొదలైనవి ఇక్కడ రాస్తారు.
  • మీకు ఒక వేళ CSS, JAVASCRIPT అనేవి తెలియకపోతే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. వాటిని గురించి మనం తర్వాత ఆర్టికల్స్ లో తెలుసుకుందాం.
  • ఇప్పుడు మీరు ఇందాక రాసిన HTML ఎలిమెంట్ లో అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ HTML టాగ్ ల మధ్యలో కొంచెం స్పేస్ ఇవ్వండి.
  • అక్కడ హెడ్ ఎలిమెంట్ ను క్రియేట్ చేయండి. అంటే ఓపెనింగ్ మరియు క్లోజింగ్ హెడ్ టాగ్ లను రాయండి.
  • ఇప్పుడు హెడ్ టాగ్ ల మధ్య అంటే హెడ్ ఎలిమెంట్ లో స్పేస్ క్రియేట్ చెయ్యండి.
  • టైటిల్ ఎలిమెంట్ కూడా మనం పైన చెప్పుకునే వాటిలాగానే రెండు టాగ్ లతో అంటే ఓపెనింగ్ టైటిల్ టాగ్ మరియు క్లోజింగ్ టైటిల్ టాగ్ లతో క్రియేట్ చేయబడుతుంది.
  • ఇప్పుడు టైటిల్ టాగ్ ల మధ్యలో మీ పేరు కానీ లేదా మరేదయినా పదాలు కాయాన్ని రాయండి.ప్రస్తుతానికి ఇది చాలు. ఎందుకంటె ఇప్పటి వరకు మనం ఏమి చేసాం అదెలా వర్క్ చేస్తుంది అనేది మీరు అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.ఇప్పుడు మనం మన డాక్యుమెంట్ లో రెండవ ముఖ్యమైన భాగం బాడీ పార్ట్ గురించి తెలుసుకుందాం.

BODY (బాడీ)

  • ఒక వెబ్ పేజీ బ్రౌజర్ లో కనపడాలంటే బాడీ పార్ట్ తప్పని సరిగా క్రియేట్ చెయ్యాలి.
  • బాడీ ఎలిమెంట్ అంటే ఓపెనింగ్ <body> టాగ్ మరియు క్లోజింగ్ </body> టాగ్ లను వాటి మధ్య ఉండే మిగిలిన ఎలిమెంట్స్.
  • బాడీ ఎలిమెంట్ HTML డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు హెడ్ ఎలిమెంట్ తర్వాత వస్తుంది.
  • ఒక వెబ్ పేజీ బ్రౌజర్ లో కనపడాలంటే మనం బాడీ టాగ్ ల మధ్య ఏమైనా రాసి ఉండాలి.
  • ఇప్పుడు నోట్ పాడ్ లో హెడ్ ఎలిమెంట్ తర్వాత బాడీ ఎలిమెంట్ ను క్రియేట్ చెయ్యండి.
  • రెండు బాడీ టాగ్ ల మధ్య కొంత స్పేస్ క్రియేట్ చేయండి.
  • ఆ స్పేస్ లో మీకు ఇష్టమైన ఏదో ఒకటి రాయండి.

మీరు నేను చెప్పిన ప్రతి ఒక్కటి కరెక్టుగా ఫాలో ఐతే మీ HTML డాక్యుమెంట్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

<!DOCTYPE html>

<html>

<head>

<title> put here your name or some words</title>

</head>

<body></body>

the key point is to write some words here. otherwise, your webpage not showing in the browser.

</body>

</html>

ఇది HTML డాక్యుమెంట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఇది లేకుండా HTML డాక్యుమెంట్ ను కానీ లేదా వెబ్ సైట్ ను కానీ వెబ్ పేజీ ని బిల్డ్ చేయలేరు.దీన్నే BOILERPLATE CODE  అని కూడా అంటారు.

ఇప్పుడు మనం నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా ప్రాసెస్ మొత్తాన్ని ఒక సారి అనలైజ్ చేద్దాం.

ఇప్పుడు అంతా పైన చెప్పినట్లు కరెక్టుగా ఉంటే మీరు మీ డాక్యుమెంట్ ను .html (dot html ) అని సేవ్ చేసుకోండి. ఒక వేళ ఏవైనా తప్పులుంటే మళ్ళి ఒక సారి మొదటినుండి అర్ధం చేసుకొని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మీ కరెక్షన్స్ అన్ని సరి చేసుకున్నాక మీ డాక్యుమెంట్ ను నేను చెప్పిన విధంగా సేవ్ చెయ్యండి. ఇప్పుడు మీకు ఇది మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఐకాన్ లాగ కనపడుతుంది. ఒక్కో సారి టెక్స్ట్ డాక్యుమెంట్ లాగ కూడా కనపడవచ్చు. ఇది మీ కంప్యూటర్ సెట్టింగ్స్ ను బట్టి ఉంటుంది.మీ డాక్యుమెంట్ బ్రౌజర్ ఐకాన్ చూపిస్తే దానిమీద డబల్ క్లిక్ చెయ్యండి. ఒక వేళ మీ డాక్యుమెంట్ డాక్యుమెంట్ లాగానే చూపిస్తే దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అనే ఆప్షన్ తో ఏదయినా బ్రౌజర్ ను సెలెక్ట్ చేసుకొని దాంతో ఓపెన్ చేయండి.నేను గూగుల్ క్రోమ్ తో ఓపెన్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటె గూగుల్ క్రోమ్ ఏ విధమైన ప్రాబ్లెమ్ లేకుండా మీ డాక్యుమెంట్ ను కరెక్టుగా చూపిస్తుంది. మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేసాక మీ బ్రౌజర్లో మీకేమి కనిపిస్తుంది. ఒక్కసారి చెక్ చేద్దాం.

  • మీ బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్ పైన ఉండే టాబ్ లో మీరు హెడ్ పార్ట్ లో టైటిల్ ఎలిమెంట్ లో ఏమి రాసారో అదే కనపడుతుంది. నేను put here your name or some words అనే అక్షరాలు రాసాను. నాకు అదే కనపడుతుంది.
  • బ్రౌజర్ బాడీ మీరు బాడీ సెక్షన్ లో ఏమి రాసారో అదే చూపిస్తుంది. నేను the key point is to write some words here. otherwise, your webpage not showing in the browser. అనే వర్డ్స్ రాసాను కాబట్టి నాకు అదే చూపిస్తుంది.

మీకు ఇంకా నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా? అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఇలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా?
Article Name
నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా?
Description
నోట్ పాడ్ తో HTML పేజీ ని క్రియేట్ చేయడం ఎలా? సాధారణంగా HTML పేజీ ని ఎటువంటి టెక్స్ట్ ఎడిటర్ తో నైనా క్రియేట్ చేయవచ్చు.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: