మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా?

హలో, Ap web Academy కి స్వాగతం. ఇంతకు ముందు ఆర్టికల్స్ లో అన్ని రకాల వర్డుప్రెస్సు సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

ప్రస్తుత వెబ్ ప్రపంచంచం లో వేల కొలది ఉచిత మరియు ప్రీమియం థీమ్ లు లభ్యమవుతున్నాయి. వీటిలో ఒక మంచి థీమ్ ను సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా విషయాలు కీలక పాత్ర వహిస్తాయి. ఇప్పుడు మనం ఒక మంచి థీమ్ ను సెలెక్ట్ చేసుకోవటంలో ఏ ఏ విషయాలు కీలక పాత్ర పోషిస్తాయి. మరియు వాటిని అనుసరించి మనం మంచి థీమ్ ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.

ఒకే మనమిప్పుడు ఎక్కువ లేట్ చెయ్యకుండా మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా?

మనం మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే విషయం లోకి వెళ్ళ్లే ముందుగా మీరు మీ యొక్క అన్ని రకాల వర్డుప్రెస్సు అడ్మిన్ డాష్ బోర్డు సెట్టింగ్స్ ను కరెక్టుగా సెట్ చేసుకోండి. ఒక వేళ మీకు ఎలా సెట్ చేసుకోవాలో తెలియకపొతే ఈ క్రింది ఆర్టికల్ ని ఫాలో అవ్వండి.

మీరు పైన ఇవ్వబడిన ఆర్టికల్స్ లోని అన్ని రకాల సెట్టింగ్స్ కర్రెక్టుగా సెట్ చేసుకున్నాక మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒక మంచి ఫ్రీ లేదా ప్రీమియం థీమ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

1.ఫ్రీ లేదా ప్రీమియం.

  • ఫ్రీ థీమ్ అంటేనే ఉచితం అని అర్ధం. దీనికి మీరు ఏ విధమైన సొమ్ము చెల్లించనవసరం లేదు.
  • ప్రీమియం థీమ్స్ కి వాటి యొక్క ప్రొఫెషనల్ డిజైన్ మరియు సపోర్ట్ కారణంగా మనం కొంత సొమ్ము చెల్లించవలసి ఉంటుంది.
  • ఫ్రీ థీమ్ అంటే లిమిటెడ్ సపోర్ట్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి.
  • ప్రీమియం థీమ్స్ ఆన్ లిమిటెడ్ సపోర్ట్ ఆప్షన్స్ 24 *7 లభ్యమవుతాయి.
  • ఫ్రీ థీమ్స్ లో లిమిటెడ్ ఫీచర్స్ మరియు లిమిటెడ్ ఫంక్షనాలిటీ వంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.
  • ప్రీమియం థీమ్స్ లో ఆన్ లిమిటెడ్ ఫీచర్స్ మరియు ఫ్లెక్సిబుల్ ఫంక్షనాలిటీ ఉంటుంది.
  • ఫ్రీ థీమ్స్ కి ఏ విధమైన వారంటీ కానీ యూనిక్ నెస్ కానీ ఉండదు.
  • ప్రీమియం థీమ్స్ కి ఎక్స్పర్ట్ సపోర్ట్ మరియు యూనిక్ నెస్ అనేది కచ్చితంగా ఉంటుంది.

2.మంచి థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా?

  • మీ థీమ్ తప్పనిసరిగా రెస్పాన్సివ్ డిజైన్ కలిగి ఉండాలి.
  • అన్ని రకాల ప్లగ్-ఇన్స్ సపోర్ట్ చేయగలగాలి.
  • మీ థీమ్ లో అన్ని రకాల రైటింగ్ ఫాంట్స్ లభించాలి.
  • ఇది అన్ని రకాల కలర్ ఫార్మట్స్ ని సపోర్ట్ చెయ్యాలి.
  • మీ థీమ్ యొక్క కోడ్ క్లీన్ గా ఉండాలి. ఇది తప్పని సరిగా రకరకాల సైడ్ బార్స్, విడ్జెట్స్, మెనూస్ సపోర్ట్ చెయ్యాలి.
  • మీ థీమ్ అన్ని రకాలైన పోస్టింగ్స్ సపోర్ట్ చెయ్యాలి.

3.ఫ్రీ థీమ్స్ లో బెస్ట్ థీమ్స్ (నా దృష్టిలో)

  • నేను నా ఫస్ట్ ఆప్షన్ గా ట్వంటీ ఫోర్టీన్ ను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటె ఇందులో ఇంతకూ ముందు మనం చెప్పుకున్న అంశాలన్నీ దాదాపుగా ఉన్నాయ్. కానీ దీని యొక్క కలర్ ఫార్మటు సపోర్ట్ నాకు నచ్చ లేదు.
  • నా రెండవ ఆప్షన్ కలర్ మాగ్. అద్భుతమైన థీమ్. ప్రస్తుతం నేను వాడుతున్నాను.

4.ప్రీమియం థీమ్స్ లో బెస్ట్ థీమ్స్ (నా దృష్టిలో)

దాదాపుగా మూడు నెలల రీసెర్చ్ తర్వాత Ap web Academy రిపోర్ట్ లో My Theme Shop థీమ్స్ బెస్ట్ థీమ్స్ గా సెలెక్ట్ కావడం జరిగింది. షాక్ అయ్యారా? సరే! ఇప్పుడు నేను ఎందుకని మై థీమ్ షాప్ థీమ్స్ బెస్ట్ థీమ్స్ నేను మీకు స్టెప్ బై స్టెప్ బై వివరిస్తాను.

  • ఈ థీమ్స్, క్లీన్ కోడ్ అంటే సెక్యూర్ మరియు ఆప్టిమైజ్డ్ కోడ్ ని కలిగి ఉంటాయి.
  • అదే విధంగా గూగుల్ ర్యాంకింగ్ ఫాక్టర్ లో ఒకటి ఐన వెబ్ సైట్ స్పీడ్ కి కూడా ఆప్టిమైజ్ చేయబడి ఉంటాయి.
  • ఇన్ బిల్ట్ రివ్యూ సిస్టం విజిటర్స్ ని మరియు సెర్చ్ ఇంజిన్స్ ని అట్ట్రాక్ట్ చేస్తుంది. తద్వారా మరిన్ని క్లిక్స్, మరింత ట్రాఫిక్ లభిస్తుంది.
  • ఇన్ బిల్ట్ స్కీమ సపోర్ట్ వలన సెర్చ్ ఇంజిన్స్ సైట్ ను బాగా క్రాల్ చేసుకుంటాయి. ఇదొక ర్యాంకింగ్ ఫాక్టర్.
  • 24 * 7 అద్భుతమైన ప్రీమియం టెక్నికల్ సపోర్ట్.
  • ఒక వేళా మీకు ఏ కారణం చేతనైన మీకు నచ్చక పొతే 30 రోజులలో మీ సొమ్ము మీకు వాపస్.
  • ఇన్ బిల్ట్ సోషల్ మీడియా షేర్ ఐకాన్స్.
  • అన్ని రకాల బ్రౌజర్లు మరియు డివైస్ కంపాటబిలిటీ.
  • తేలికగా ఉపయోగించ గలిగే ఒప్షన్స్ ప్యానెల్.
  • ఇన్ బిల్ట్ యాడ్ మానేజ్మెంట్.
  • తేలికగా మీ కంటెంట్ ను ఎక్కడి నుండైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
  • మీరు మీ సొంత CSS స్టైల్స్ ను యాడ్ చేయవచ్చు.
  • ఆన్ లిమిటెడ్ బ్యాక్ గ్రౌండ్.
  • SEO రెడీ.
  • ట్రాన్సలేషన్స్ రెడీ.
  • యూజ్ ఫుల్ షార్ట్ కోడ్స్.
  • రిలేటెడ్ పోస్ట్స్.
  • రెడీ టూ యూజ్ ఐకాన్ ఫాంట్స్.
  • అన్ని రకాల గూగుల్ ఫాంట్స్ లభ్యత.
  • కస్టమ్ విడ్జెట్స్ .
  • ఇంక్లూడెడ్ డెమో డేటా.
  • సోషల్ మీడియా ఇంటిగ్రేషన్.

5.చూట్టానికి బానే ఉంది! కానీ, ప్రీమియం థీమ్స్ లో నిజం గా వర్త్ ఉందా?

  • మీరు ఒక మంచి డిజైన్ ఫ్రీలాన్సర్ ని హైర్ కు తీసుకోని అతనితో పైనచెప్పిన ఆప్షన్స్ అన్ని వచ్చేలా డిజైన్ చెయ్యమంటే అతను కనీసం $1000 ఛార్జ్ చేస్తాడు.
  • ఒక Seo ఎక్స్పర్ట్ ని హైర్ చేసుకొని మీ థీమ్ లో పైన చెప్పిన ఆప్షన్స్ ఆరెంజ్ చేయడానికి కనీసం $500 ఛార్జ్ చేస్తాడు.
  • మీరు మీ థీమ్ ని స్పీడ్ ఆప్టిమైజ్ చెయ్యాలనుకుంటే దానికి సంబంధించిన స్పషలిస్టు కనీసం $100 ఛార్జ్ చేస్తాడు.
  • మిగిలిన అన్ని రకాల సెట్టింగ్స్, సోషల్ మీడియా ఆప్టిమైజషన్స్ , ఇంకా ఇతర సెట్టింగ్స్ కు $400 ఈజీ గా ఛార్జ్ చేస్తారు.
  • మొత్తం కలిపి $2000 నుండి $2500 వరకు అవుతుంది.

ఇప్పడు నేను మీ అందర్నీ సూటిగా అడుగుతున్నాను! ప్రీమియం థీమ్స్ లో వర్త్ లేదంటారా?

మీకు ఇంకా మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి

 

Summary
మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా?
Article Name
మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా?
Description
మంచి వర్డుప్రెస్సు థీమ్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎలా? మనం ఒక మంచి థీమ్ ను సెలెక్ట్ చేసుకోవటంలో ఏ ఏ విషయాలు కీలక పాత్ర పోషిస్తాయి. మరియు వాటిని అనుసరించి మనం మంచి థీమ్ ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don’t have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that’s why you’re read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: