మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి.

హలో Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదేమిటంటే మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి. వినటానికి బావుంది కాదు! కానీ ఇప్పటికే ఎన్నో స్కీములు చూసాం, ఇవన్నీ అయ్యే పనులు కాదని అనుకుంటున్నారు కాదు! సరే నేను ఒక్కడిని ఈ మాట చెపితే నేనే అవగాహన లేకుండా చెప్పాననుకోవచ్చు. కానీ, ఒక్కసారి ఆలోచించండి. 2,48,25,955 మంది ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించామని, ఇంకా సంపాదిస్తున్నామని చెపితే మీరు వాళ్ళందరూ చెప్పేది కూడా తప్పే అంటారా? ఏంటి కన్ఫ్యూస్ అయ్యారా? సరే మనం దీనిని గురించి పూర్తీ వివరాలు తెలుసుకుందాం.

మీరు నా గురించి తెలుసుకోవటానికి అబౌట్ పేజీ కి వెళ్ళండి.

మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి.

మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి. గురించి కొంచెం వివరంగా చెప్పండి.

ముందుగా ముఖ్యమైన విషయమేటంటే ఆన్ లైన్ లో మనం ఎక్సట్రా ఇన్ కం సంపాదించాలంటే మనకు ఇప్పటికన్నా కొంచెం ఎక్కువ సంపాదించ వలసిన అవసరం ఉండాలి. మనకు మనమే బాస్ లాగ జీవించాలంటే ఆన్ లైన్ ఇన్ కం మనకు ఉన్న తేలికైన మార్గం. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీ సమాధానం ఎస్ ఐతే మీరు ఈ ఆర్టికల్ ను పూర్త్తిగా చదవండి. ఒక వేళ మీ సమాధానం నో ఐతే దీన్ని మీరు అక్కడితో ఆపేసి మీ పని మీరు చూసుకోండి. ఎందుకంటె, ఈ ఆర్టికల్ మీకు కాదు. ముందుగా ఆ ప్రశ్నలేమిటో చూద్దాం!

 1. మీరు ప్రతి నెల టైట్ బడ్జెట్ లో రన్ అవుతున్నారు. మీరు మీ బడ్జెట్ ను రీచ్ అవ్వాలంటే మీకు మరికొంత అడిషనల్ ఇన్కమ్ కావాలి. అలాగే నెల నెల మరికొంత సేవింగ్స్ కు కావాలి?
 2. మీకు మీరే బాస్ లాగ మిమ్మల్ని ఎవరు కమాండ్ చేయనటువంటి లైఫ్ మీకు కావాలి.( నేను ఇక్కడ ఏ జాబ్ ను కానీ, ఏ ప్రొఫెషన్ ను కానీ, మరి దేనిని కానీ తక్కువ చేయటం లేదు.) ఇప్పుడు సంపాదించే దానికంటే కనీసం 2 టైమ్స్ ఎక్సట్రా సంపాదించాలి.ఇవ్వన్నీ కూడా మీకు తెలిసిన లేదా మీరు రోజు చేసే పనినే చేయడం వల్ల కానీ లేదా మీ కాలేజి టైమ్ లో నేర్చుకున్న స్కిల్స్ తో కానీ సంపాదించాలి?
 3. మీరు వెబ్ డెవలపర్ కానీ వెబ్ డిజైనర్ కానీ, లేదా మీకు రైటింగ్ స్కిల్స్ కానీ మార్కెటింగ్ స్కిల్స్ కానీ, లేదా మీరు SEO కానీ SEM స్పెషలిస్ట్ కానీ, లేదా మీరు IT ప్రొఫెషనల్ లేదా డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ కానీ ఏదో ఒక జాబ్ చేస్తున్నారనుకుందాం. మీకు మీ క్రెడిట్ కార్డు బిల్స్ కి లేదా మంత్లీ ఇన్ స్టాల్ మెంట్స్ కి ఏంటో కొంత అడిషనల్ ఇన్ కం అవసరం.
 4. మీరొక స్టూడెంట్. మీకు తెలుసు మీ స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఏదో ఒక జాబ్ చెయ్యాలని, కానీ మీ గోల్ ఏమిటంటే మీ తెలివి తేటలతో మరింత ఎక్కువ సాధ్యమైనంత తొందరగా సంపాదించాలని, ఇంకా వివరంగా చెప్పాలంటే మీకు జాబ్ వచ్చే లోపు వాళ్ళు ఆఫర్ చేసే శాలరీ ఆల్రెడీ మీరు సంపాదిస్తూ ఉండాలి.
 5. మీరు బాగా సెటిల్ అయ్యారు. మీ దగ్గర కావలిసినంత డబ్బు ఉంది. మీకు కావలిసినంత ఫ్రీ టైం కూడా ఉంది. ఐనా మీకు ఏదయినా కొత్త విషయం నేర్చుకోవాలి దాని ద్వారా మనకు ఎంతో కొంత ఇన్ కం వస్తే మరి మంచిది అనుకొంటున్నారు.

yes or no?

ఇప్పడు మనం మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండిఅనే ఆర్టికల్ లో ముఖ్యమైన విషయాలను పరిశీలించబోతున్నాము.

ముందుగా నో అనే ఆన్సర్ చెప్పే వాళ్లందరికీ నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు. ఎందుకంటె మీకు అవసరం లేకపోయినా ఇక్కడ దాకా వచ్చి ఇప్పటివరకు ఈ ఆర్టికల్ ను చదివారు.

అలాగే ఎస్ అనే వాళ్ళు ఇప్పుడు నాతొ పాటు ఈ ఆర్టికల్ లో మనం పైన చెప్పిన విషయాలన్నీ ఎలా సాధ్యమో స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం.

1.అసలు ఇదంతా ఏమిటి?

 • ఇదంతా మీ టాలెంట్ తో ఆన్ లైన్ లో ఇన్ కం సంపాదించుకొనే జెన్యూన్ ప్రోగ్రాం గురించి మీకు తెలియజేయడం.
 • ఇదంతా మీకు సంబంధించిన అన్నిరకాల జాబ్స్ లేదా వర్క్స్ కి జెన్యూన్ పీపుల్ ను అప్పోయింట్ చేసుకోవడం లేదా హైర్ చేసుకోవడం గురించి తెలియజేయడం.

ఒక్క మాటలో చెప్పాలంటే మీకు నేను జెన్యూన్ గా ఎక్సట్రా ఇన్ కం సంపాదించుకోవడానికి ఒక వెబ్ సైట్ ను పరిచయం చేస్తున్నాను. దాని పేరు Freelancer.

2.ఫ్రీలాన్సర్ అంటే ఏమిటి?

 • ఫ్రీలాన్సర్ అనేది ఒక అవుట్ సౌర్చింగ్ క్రౌడ్ గ్లోబల్ మార్కెట్. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్రీలాన్సర్స్ మనకు మన జాబ్ లేదా వర్క్ కోసం మనము హైర్ చేసుకొనే ప్రదేశం.
 • ఇది 2009 లో ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రారంభమైనది. వాంకోవర్, లండన్, బ్యూనస్ ఎయిర్స్, మనీలా, జకార్తా మరియు సదరన్ కాలిఫోర్నియా లో బ్రాంచ్ ఆఫీస్ లు ఉన్నాయ్.
 • ఫ్రీలాన్సర్ వెబ్ సైట్ లో మీరు మీ రిక్వైర్మెంట్స్ తో ఒక జాబ్ లేదా ఒక వర్క్ మీకు అనుకూలమైన బడ్జెట్ తో ఎంప్లోయర్ గా పోస్ట్ చేయవచ్చు.
 • ఇది మార్కెట్ ప్లేస్ లో ఎంతో నైపుణ్యం మరియు అనుభవజ్ఞులైన చాలా మంది ఫ్రీలాన్సర్స్ కి కనపడుతుంది.
 • వారిలో మీ ఆఫర్ నచ్చిన వారు మీ ప్రాజెక్ట్ కి బిడ్ వేస్తారు.
 • వచ్చిన బిడ్లలో తక్కువ రేట్ బిడ్ ను కానీ లేదా టాప్ రేటెడ్ సెల్లర్ ను కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
 • మీరు ఒక ఫ్రీలాన్సర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ముందుగా వారికి సంబంధించిన వర్క్ ఎక్సపీరియెన్స్ , రేటింగ్, కమ్యూనికేషన్ రెస్పాన్స్ మరియు పోర్టుఫోలియో మొదలైన అనేక విషయాలను తెలుసుకొనే అవకాశం మనకు ఫ్రీలాన్సర్ కలగజేస్తుంది.

3.ఫ్రీలాన్సర్ వెబ్ సైట్ తో మనమెలా ఎక్సట్రా ఇన్ కం సంపాదించుకుంటాము?

 • ముందుగా మీరు ఒక ఫ్రీలాన్సర్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది.
 • తర్వాత మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
 • మీ స్కిల్స్ తో మీరు ప్రొఫైల్ ను కంప్లీట్ చెయ్యండి.
 • ఆ తర్వాత వర్క్స్ అనే టాబ్ వెబ్ సైట్ పైన లెఫ్ట్ సైడ్ నుండి రెండవది గా మీకు కనపడుతుంది. అందులో ప్రాజెక్ట్స్ విత్ మై స్కిల్స్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.
 • మీరు బ్రౌజ్ ప్రాజెక్ట్స్ అనే లింక్ ద్వారా కూడా మీకు కావలిసిన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
 • మీరు ఒక ప్రాజెక్ట్ ను సెలెక్ట్ చేసుకొన్నా తర్వాత దానికి ఆకర్షణీయమైన ప్రైస్ మరియు డిస్క్రిప్షన్ తో బిడ్ వెయ్యండి.
 • ఇంకా ఎక్కువ అటెన్షన్ మరియు కమ్యూనికేషన్ కోసం పర్సనల్ మెసేజ్ కూడా పంపించండి.
 • మీరు ప్రాజెక్ట్ చేయడానికి సెలెక్ట్ ఐతే ఆ ప్రాజెక్ట్ ను చక్కగా ఇన్ టైం లో కంప్లీట్ చేసి అప్పచెప్పండి.
 • మీ డబ్బు మీరు పొందే సమయంలో ఆ ప్రాజెక్ట్ మీకు అసైన్ చేసిన ఎంప్లాయర్ ను ఒక రివ్యూ  లేదా రేటింగ్ ఇమ్మని అడగండి.

4.ఫ్రీలాన్సర్ లో ఏ విధమైన ప్రాజెక్ట్ లు ఉంటాయో తెలుసుకోవచ్చా?

ఎందుకు తెలుసుకోకూడదు, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఫ్రీలాన్సర్ లో ముఖ్యంగా 12 మెయిన్ క్యాటగిరి లు గా ప్రాజెక్ట్స్ పోస్ట్ అవుతాయి. ఇందులో చాలానే సుబ క్యాటగిరి లు ఉన్నాయ్. మనం మెయిన్ క్యాటగిరి ల గురించి తెలుసుకుందాం.

1.Websites, IT & Software (వెబ్ సైట్, ఐటీ&సాఫ్ట్ వేర్ )
2.Mobile Phones & Computing (మొబైల్ ఫోన్స్&కంప్యూటింగ్)
3.Design, Media & Architecture (డిజైన్, మీడియా&ఆర్కిటెక్చర్)
4.Writing & Content (రైటింగ్&కంటెంట్)
5.Data Entry & Admin (డేటా ఎంట్రీ&అడ్మిన్)
6.Sales & Marketing (సేల్స్&మార్కెటింగ్)
7.Product Sourcing & Manufacturing (ప్రోడక్ట్ సౌర్చింగ్&మాన్యుఫాక్చరింగ్)
8.Translation & Languages (ట్రాన్సలేషన్&లాంగ్వేజస్)
9.Engineering & Science (ఇంజనీరింగ్&సైన్సు)
10.Business Services (బిజినెస్&సర్వీసెస్)
11.Local Jobs & Services (లోకల్ జాబ్స్&సర్వీసెస్)
12.Other (మిగిలినవి)

5.ఫ్రీలాన్సర్ ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి నాకేమి కావాలి?

దీని గురించి పెద్దగా వర్రీ అవ్వ వలసిన అవసరం లేదు. అన్ని సింపుల్ థింగ్స్.

 • ఫ్రీలాన్సర్ అకౌంట్ రిజిస్ట్రేషన్ కోసం ఒక పర్సనల్ జీమెయిల్ లేదా ఏదయినా ఇమెయిల్ అకౌంట్.
 • ప్రాజెక్ట్స్ కి బిడ్ వేయడం కోసం పైన చెప్పిన వాటిలో కనీసం ఏదయినా ఒక క్యాటగిరి కి లేదా సబ్ క్యాటగిరి కి సంబందించిన స్కిల్.
 • మరియు మనీ విత్ డ్రా కోసం ఒక వెరిఫై ఐన పే పాల్ లేదా స్క్రిల్ లేదా పర్సనల్ బ్యాంకు అకౌంట్.

6.ఫ్రీలాన్సర్ లో డబ్బు సంపాదించుకోవడానికి నాకేమైనా క్వాలిఫికేషన్ కావాలా?

మీకు తప్పకుండా ఈ క్రింద నేను చెప్పే ఒకే ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

మీకు తప్పకుండా మీరు ఇప్పుడు సంపాదించే దానికంటే ఎక్కువగా సంపాదించాలి మరియు అద్భుతమైన లైఫ్ క్రియేట్ చేసుకోవాలి అనే బర్నింగ్ డిజైర్ మీకు తప్పకుండా ఉండాలి.

 • మీరు ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా ఒక్క రూపాయి ఇన్వెస్ట్ చేయడం కానీ నష్టపోవడం కానీ ఉందా?   లేదు.
 • అలాంటప్పుడు మీరు అడిషనల్ ఇన్ కంసంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారా?   అవును.
 • ఐతే వెంటనే ఫ్రీలాన్సర్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి.

మీలో యెంత మంది మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి. అనే ఆర్టికల్ ద్వారా ఫ్రీలాన్సర్ లో డబ్బు సంపాదిస్తున్నారో నాకు క్రింద కామెంట్ల రూపం లో తెలియ జేయండి.

మీకు ఇంకా మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి

Summary
మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి.
Article Name
మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి.
Description
మీ టాలెంట్ తో ఇన్వెస్టుమెంట్ లేకుండా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించండి. 2,48,25,955 మంది ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించామని, ఇంకా సంపాదిస్తున్నామని చెపితే మీరు
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love
 • 124
  Shares

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: