మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా

హలో, Ap Web Academy కి సుస్వాగతం. ఈ రోజు నేను మీకు మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా ? అనే టాపిక్ గురించి ఎక్స్ ప్లైయిన్ చేయబోతున్నాను. ఎందుకని నేను వర్డ్ ప్రెస్ గురించే ఎంచుకున్నాను? మీలో కొంత మందిలో ఈ అనుమానం కలగవచ్చు!

ఎందుకంటే ఈ రోజు ప్రపంచం మొత్తం మీద 27 నుండి ౩౦% వెబ్ సైట్స్ వర్డ్ ప్రెస్ ప్లాట్ ఫామ్ మీదే రన్ అవ్వుతున్నాయి.వర్డ్ ప్రెస్ ఎటువంటి బ్లాగ్ లేదా వెబ్ సైట్ బిల్డ్ చెయ్యటానికయినా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వర్డ్ ప్రెస్ మీ సైట్ బిల్డ్ చేయటానికి అవసరమైన అనేక రకాలైన మరెవరు ఇవ్వలేనటువంటి టూల్స్ ని ఇస్తుంది. వీటిలో చాలా వరకు మనం ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.  అంతేకాక వర్డ్ ప్రెస్ వారి యొక్క ఫోరమ్ మరియు డెవలపర్స్ కమ్యూనిటీ తో వర్డ్ ప్రెస్ ఉపయోగించేంచే ప్రతి ఒక్కరికి ఎంతో సపోర్ట్ ని కూడా అందిస్తుంది.

మొత్తం మీద వర్డ్ ప్రెస్ నెంబర్ 1 అనటంలో మనకు ఏ విధమైన సందేహం అక్కరలేదు.దీనితో ఎటువంటి సైట్ నైనా బిల్డ్ చేయవచ్చు.అంతదాకా ఎందుకు ఇప్పుడు మీరు చూస్తున్న apwebacademy.com కూడా వర్డ్ ప్రెస్ మీదే బిల్డ్ ఐయ్యింది.ఇంకా చెప్పాలంటే ఎందుకని వర్డ్ ప్రెస్ నెంబర్ 1 అంటే దాదాపుగా 20 మిలియన్స్ కన్నా ఎక్కువ వెబ్ సైట్స్,బ్లాగ్స్ వర్డ్ ప్రెస్ మీదే రన్ అవ్వుతున్నాయి.

నేను ఎందుకు వర్డ్ ప్రెస్ ను ఎంచుకున్నానో మీకు అర్ధం ఐ ఉంటుందని ఆశిస్తున్నాను.ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం.మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ చూడగలరు.

మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా

ప్రస్తుతం నా డొమైన్ నేమ్ వెబ్ హోస్టింగ్ రెండు కూడా hostgator టోన్ అసైన్ అయి ఉన్నాయ్.కాబట్టి, నేను మీకు hostgator అకౌంట్ లో వర్డ్ ప్రెస్ ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలి? అనే విషయం చూపిస్తాను.

దాదాపుగా అన్ని హోస్టింగ్ అకౌంట్స్ లో కూడా ఇదే విధంగా ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం వారి యూజర్ ఇంటర్ పేస్ మాత్రమే వేరుగా ఉంటుంది.అంతకు మించి తేడా ఏమి ఉండదు. మీరు కానక ఈ ఆర్టికల్ ని స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఫాలో అయి మెథడ్ అర్ధం చేసుకొంటే మీరు ఏ వెబ్ హోస్ట్ అకౌంట్ లో నైనా వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

ముందుగా మీరు మీ హోస్టింగ్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.హోస్టింగ్ అనే ట్యాబు కానీ హోస్టింగ్ కి సంబంధించిన ట్యాబు మీద కానీ క్లిక్ చెయ్యండి.అది మీ హోస్టింగ్ అకౌంట్ ని చూపిస్తుంది.

మీకు నేనేమి చెపుతున్నానో అర్ధం కాకపోయినా, లేదా మీరు పూర్తిగా డొమైన్,హోస్టింగ్ లాంటి పదాలను కొత్తగా వింటున్న మీకు నా సజెషన్ ఒక్కటే.ముందుగా మీరు వెనక్కి వెళ్లి అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు అనే ఆర్టికల్ ను చదివితే మీకు డొమైన్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలుస్తుంది. అలాగే బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే ఆర్టికల్ చదివితే వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటో అదెలా పనిచేస్తుందో తెలుస్తుంది. అలాగే డొమైన్ నేమ్ హోస్టింగ్ సర్వర్ నేమ్స్ తో సెట్ చేసుకోవడం ఎలా అనే ఆర్టికల్ చదివితే మీకు డొమైన్ వెబ్ హోస్టింగ్ కమ్యూనికేటెడ్ గా ఎలా పని చేస్తాయి అనే విషయం అర్ధం అవుతుంది.ఈ మూడు విషయాలు కానక మీకు బాగా అర్ధం ఐతే ఇప్పుడు నేనేమి చెపుతున్నాను అనేది మీకు స్పష్టంగా అర్ధం అవ్వుతుంది.మీరు వెబ్సైటు బిల్డ్ చేసి రన్ చెయ్యాలంటే ఇప్పుడు నేను చెప్పినవి, చెపుతున్నవి అన్ని బేసిక్ నాలెడ్జ్.

  • మీరు హోస్టింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసాక మీ విండో లో ఒక కొత్త పేజీ కనపడుతుంది.
  • బహుశా కొన్ని హోస్టింగ్ అకౌంట్స్ లో ఇలా ఉండక పోవచ్చు.
  • కానీ,మీ టార్గెట్ మాత్రం హోస్టింగ్ అకౌంట్ ట్యాబు కనిపెట్టడమే.
  • మీరు దీనిని కనుగొన్నాక మేనేజ్ వెబ్ హోస్టింగ్ అనే పేరు మీద క్లిక్ చెయ్యండి.
  • క్లిక్ చేసాక మీ విండో లో c ప్యానెల్ ఓపెన్ అవ్వుతుంది.
  • అది నేను ఈ క్రింద చూపించిన ఇమేజెస్ లో లాగా ఉంటుంది.

ఇక్కడి నుండినేను చెప్పబోయే ప్రతి విషయం మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా లో ముఖ్యమైనదే.

hosting account manage image for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా
hosting account manage image for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా

c ప్యానెల్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.అక్కడ కనిపించే w ఐకాన్ వర్డ్ ప్రెస్ ని రిఫర్ చేస్తుంది. w మీద క్లిక్ చెయ్యండి.

Cpanel image for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా
Cpanel image for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా

మీరు w మీద క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది స్క్రీన్ మీకు చూపించబడుతుంది. అక్కడ ఉన్న ఇన్ స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చెయ్యండి.

wordpress installation screen for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా
WordPress installation screen for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా

ఇపుడు అక్కడ అడిగిన విషయాలను ఎంటర్ చెయ్యండి.

ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా గో తెలుసు కొండి.

  • మొట్ట మొదటిది ట్రాన్సఫర్ ప్రోటోకాల్. మీకు ssl ఉంటె https :// , లేకపోతె http :// సెట్ చెయ్యండి.
  • మీకు ssl అంటే ఏమిటో తెలియకపోతే మనం తర్వాత నేర్చుకుందాం.
  • ప్రస్తుతానికి http :// అనే సెలెక్ట్ చేసుకోండి.మనం కావాలంటే దీనిని తర్వాత మార్చుకోవచ్చు.
  • రెండవది డొమైన్ నేమ్. మీకు ఒక డొమైన్ కన్నా ఎక్కువ ఉంటే అవి ఇక్కడ కనబడతాయి.
  • లేకపోతె ఒకటే కనపడుతుంది.
  • ఓవరాల్ గా మీరు ఏ డొమైన్ మీద వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేయాలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకోండి.
  • మూడవది డైరెక్టరీ.మీరు వర్డ్ ప్రెస్ ను మీ రూట్ డొమైన్ మీద ఇన్ స్టాల్ చెయ్యాలనుకుంటే ఇక్కడ ఎంప్టీ గా ఉంచండి.
  • అప్పుడు వర్డ్ ప్రెస్ మీ డొమైన్.కామ్ మీద ఇన్ స్టాల్ అవ్వుతుంది.
  • ఒక వేళ మీరు సబ్ ఫోల్డర్ లో ఇన్ స్టాల్ చెయ్యాలనుకుంటే wp అని ఉంచండి.
  • అప్పుడు మీ డొమైన్.కామ్/wp మీద ఇన్ స్టాల్ అవ్వుతుంది.
  • మీరు ఏది కావాలనుకుంటే అది మీ అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • సాధారణంగా రూట్ డొమైన్ మీదే ఇన్ స్టాల్ చేసుకోండి. wp లెటర్స్ క్లియర్ చెయ్యండి.

తర్వాత ఆప్షన్స్ ఇలా ఉంటాయి.

wordpress installation page forమీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా 2
wordpress installation page for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా 2

ఇప్పుడు మనం మేజర్ పార్ట్ లోకి ఎంటర్ అవ్వుతున్నాము.ఈ క్రింది విషయాలను అక్కడ ఎంటర్ చెయ్యండి.

  • మీ సైట్ పేరు.
  • మీ సైట్ యొక్క డిస్క్రిప్షన్.
  • అడ్మిన్ యూజర్ నేమ్. అతి ముఖ్యమైన విషయమేమిటంటే మీరు అడ్మిన్ యూజర్ నేమ్ అడ్మిన్ అని ఉంచవద్దు. దీన్ని యూనిక్ గా ఉండేటట్లు చూసుకోండి. ఇదెలా ఉండాలంటే కేవలం మీరు మాత్రమే గుర్తుంచు కోవాలి. ఇతరులు కనీసం గెస్ చేయడానికి కూడా అవకాశం ఉండకూడదు.
  • తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ పాస్ వర్డ్ డిజైన్ చేసుకోండి. జనరల్ గా వర్డ్ ప్రెస్ మీకు చాలా స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఇస్తుంది. కానీ వాటిని గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. ఒక వేళ మీరు వాటిని గుర్తుంచుకోగలిగితే అటువంటి వాటిని డిజైన్ చేసుకోండి. లేదంటే మీకు మాత్రం గుర్తుండేలా ఎవ్వరు కనీసం ఊహించడానికి కూడా వీలు లేని ఒక మంచి పాస్ వర్డ్ ని నంబర్స్, లెటర్స్, సింబల్స్ తో కలిపి డిజైన్ చేసుకోండి.

తర్వాత లాస్ట్ స్టేజి క్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.

wordpress install page image for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా
wordpress install page image for మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా

ఫైనల్ స్టెప్స్.

  • డేటాబేస్ నేమ్ సెట్ చేసుకోండి.వర్డ్ ప్రెస్ ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది.కావాలంటే మీరు మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు.
  • టేబుల్ ప్రిఫిక్స్ అంటే మీ డేటా బేస్ లోని టేబుల్ పేరు కు ముందు ఉండే రెండు లేక మూడు డిఫాల్ట్ లెటర్స్.
  • వీటిని కూడా వర్డ్ ప్రెస్ ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది.కావాలంటే మీరు మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు.
  • ఆటో అప్ గ్రేడ్ మీద క్లిక్ చెయ్యండి.
  • తర్వాత ఆటో అప్ గ్రేడ్ వర్డ్ ప్రెస్గ్ ప్లగ్ ఇన్స్ మీద క్లిక్ చెయ్యండి.
  • ఆటో అప్ గ్రేడ్ వర్డ్ ప్రెస్ థీమ్స్ మీద క్లిక్ చెయ్యండి.
  • బ్యాక్ అప్ లొకేషన్. దీనిని మీరు మీ కన్వీనెంట్ ను బట్టి డిఫాల్ట్ గా ఉంచవచ్చు.మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు.
  • ఆటోమేటిక్ బ్యాక్ అప్. మీరు కొంచెం ఎక్స్ పర్ట్ అయ్యేదాకా దీనిని ఎనేబుల్ చేసుకోండి.
  • బ్యాక్ అప్ రొటేషన్. రోజుకు ఒక్కసారి సెట్ చేసుకోండి.
  • ఇప్పుడు ఇన్ స్టాల్ మీద క్లిక్ చెయ్యండి.

కంగ్రాట్యులేషన్స్. మీరు సక్సెస్ ఫుల్ గా మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం పూర్తి చేశారు.

ఇన్ స్టాల్ చేసుకొనే ముందుగా మీరు కొన్ని విషయాలు కచ్చితంగా పాటించండి.

  • మీ ప్రైమరీ ఇమెయిల్ నేమ్ ఇన్ స్టాల్ చేసుకునే ముందుగా మీరు అక్కడ ఎంటర్ చెయ్యాలి.
  • ఇది ఇన్ స్టాల్ ట్యాబు తర్వాత ఉంటుంది.
  • మీరు ఎంటర్ చేసిన మెయిల్ అడ్రస్ కి అడ్మిన్ యూజర్ నేమ్,పాస్ వర్డ్,డేటా బేస్ డీటెయిల్స్,మొదలైన అన్ని రకాల డీటెయిల్స్ మెయిల్ చెయ్య బడతాయి.
  • దీన్నిజాగ్రత్తగా సేవ్ చేసుకోండి.

that’s it.ఈ ప్రాసెస్ లో మీకు ఏమైనా అర్ధం కాకపోయినా నన్ను కాంటాక్ట్ చెయ్యవచ్చు.అలాగే చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా బ్లాగ్ ను ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా
Article Name
మీ డొమైన్ పై వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా
Description
అడ్మిన్ యూజర్ నేమ్.అతి ముఖ్యమైన విషయమేమిటంటే మీరు అడ్మిన్ యూజర్ నేమ్ అడ్మిన్ అని ఉంచవద్దు.దీన్ని యూనిక్ గా ఉండేటట్లు చూసుకోండి.ఇదెలా ఉండాలంటే కేవలం మీరు మాత్రమే గుర్తుంచు కోవాలి. ఇతరులు కనీసం గెస్ చేయడానికి కూడా అవకాశం ఉండకూడదు.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

ajay kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply