మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా?

హలో, Ap Web Academyకి స్వాగతం.ఈ రోజు మన టాపిక్ మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా? ప్రస్తుతం వెబ్ వరల్డ్ లో ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ ఇమెయిల్ కామన్ విషయం అయిపోయింది.కానీ ఇప్పటికి చాలా మందికి ప్రొఫషనల్ ఇమెయిల్ యొక్క విలువ తెలియదు.దానిని క్రియేట్ చేయడం కూడా తెలియదు.ఇప్పుడు మనం ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం.మీరు ప్రొఫెషనల్ ఇమెయిల్ క్రియేట్ చెయ్యాలనుకుంటే మీకు తప్పని సరిగా ఒక డొమైన్ నేమ్ మరియు ఒక హోస్టింగ్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.

మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళదాం.మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ మీద క్లిక్ చెయ్యండి.

మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా

మీకు ఏదేనా వెబ్ సైట్ కానీ,బ్లాగ్ కానీ,లేదా మరి ఏదయినా ఆన్ లైన్ ప్రెజన్స్ కానీ ఉందా? మీ సమాధానం అవును ఐతే మీకు తప్పని సరిగా ఒక ప్రొఫషనల్ ఇమెయిల్ ఉండి తీరాలి. ఈ రోజు ప్రతి ఒక్క ఆన్ లైన్ ఎంటర్ ప్రెన్యూర్ తమ తమ సొంత ప్రొఫషనల్ ఇమెయిల్ కలిగి ఉన్నారు.

ఉదాహరణకు మీపేరు.మీడొమైన్.కామ్ లాగా,మీరు ఆల్రెడీ ఇప్పటికే ఒక ప్రొఫెషనల్ ఇమెయిల్ అడ్రస్ కలిగిఉంటే ఏ ప్రాబ్లెమ్ లేదు.లేదంటే కచ్చితంగా ఒకటి క్రియేట్ చేసుకోండి.యాడ్ ఎలాగో మనమిప్పుడు చూద్దాం.

పర్సనల్ గా నా డొమైన్ నేమ్,హోస్టింగ్ అకౌంట్ hostgator వద్ద హోస్ట్ చేయబడి ఉన్నాయ్.నేనిప్పుడు నా అకౌంట్ లోకి లాగిన్ అవుతున్నాను.మీరు కూడా మీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి నన్ను స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి.

మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా తెలుసుకునే ముందుగా మీకు డొమైన్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే విషయాలు మీకు తెలిసి ఉండాలి.

ఒక వేళ మీకు అవేమి తెలియకపోతే మీరు అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు మరియు బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే ఆర్టికల్స్ చదవండి. వీటి వల్ల మీకు డొమైన్ గురించి, వెబ్ హోస్టింగ్ గురించి, అవి పని చేసే విధానం గురించి వివరంగా తెలుసుకొంటారు.

మీరు హోస్టుగాటర్ అకౌంట్ లోకి లాగిన్ ఐయ్యాక ఈ క్రింది విషయాలను ఫాలో అవ్వండి.

  • మౌస్ ని మేనేజ్ ఆర్డర్స్ అనే ట్యాబు మీదకు తీసుకు వెళ్ళండి.అక్కడొక డ్రాప్ డౌన్ మెనూ కొన్ని లింక్స్ తో కనిపిస్తుంది.
  • వాటిలో మొదటిదయినా లిస్ట్/సెర్చ్ ఆర్డర్స్ అనే లింక్ మీద క్లిక్ చేయండి.మీ క్లిక్ మిమ్మల్ని ఆర్డర్స్ పేజీ లోనికి తీసుకు వెళుతుంది.ఆ పేజీ లో గ్రీన్ బులెట్ పాయింట్స్ లిస్ట్ లాగ ఉంటాయి.
  • వాటిలో హోస్టింగ్ కు సంబంధించిన లింక్ ను క్లిక్ చెయ్యండి.దీని ప్రక్కనే మీ డొమైన్ మరియు మీ హోస్టింగ్ అకౌంట్ యొక్క ఎక్సపెరీ డేట్ ఉంటాయి.మీ క్లిక్ మిమ్మల్ని మరొక పేజీ లోనికి తీసుకు వెళుతుంది.
  • అక్కడ మేనేజ్ వెబ్ హోస్టింగ్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.ఇప్పుడు మీరు Cpanel పేజీ లోకి వెళతారు.
  • cpanel లో ఇమెయిల్ అనే సెక్షన్ కోసం వెతకండి. అది ఈ క్రింది లాగ ఉంటుంది.
c panel email tab image forమీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా.
c panel email tab image forమీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా

ఇమెయిల్ అకౌంట్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.ఇప్పుడొక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అది ఈ క్రింది విధంగా ఉంటుంది.

follow me carefully.

c panel email tab image2 for మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా
c panel email tab image2 forమీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా
  • ఇప్పడు అక్కడ అడిగిన విషయాలను ఎంటర్ చెయ్యండి.
  • క్రియేట్ అకౌంట్ అనే బటన్ ని నొక్కండి.మీ అకౌంట్ వెంటనేక్రియేట్ అవ్వుతుంది.
  • ఆ తర్వాత ఆకూ పచ్చ రంగు అక్షరాలలో మీ అకౌంట్ క్రియేట్ అయినట్లు చూపిస్తుంది.
  • ఇప్పుడు పేజీ ని క్రిందకి స్క్రోల్ చెయ్యండి.
  • అక్కడ మీ ఇమెయిల్ యూజర్ నేమ్, పాస్ వర్డ్, మెయిల్ కోటా,సెటప్ మెయిల్ క్లయింట్, డిలీట్ అనే ఆప్షన్స్ కనపడతాయి.

కొన్ని సెక్యూరిటీ కారణాల వాళ్ళ నేను ఇక్కడి నుండి మీకు స్క్రీన్ షాట్స్ చూపించటం లేదు.కంగారు పడవలసినది ఏమి లేదు. మీరు నన్ను స్టెప్ బై స్టెప్ ఫాలో ఐతే మీకు అంతా క్లియర్ గా అర్ధం అవుతుంది.

ఇప్పుడు మనం మెయిల్ సెట్ అప్ క్లయింట్ గురించి తెలుసు కుందాం.

మీ ఇమెయిల్ అడ్రస్ ఎదురుగా ఉన్న మెయిల్ సెటప్ క్లయింట్ మీద క్లిక్ చెయ్యండి.

ఇది మీకు ఆటో కాన్ఫిగరేషన్ స్క్రిప్ట్స్ మరియు మాన్యువల్ సెట్టింగ్స్ చూపెడుతుంది.ప్రతి ఒక్కరికి నా సలహా ఏమిటంటే మాన్యువల్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోండి.మరియు ఎల్లప్పుడూ మీ ఇమెయిల్ మీ ఫోనుతోనే కాన్ఫిగర్ చేసుకోండి.వివరాలు ఈ క్రింద తెల్పిన విధంగా ఉంటాయి.

  • సెక్యూర్ SSL /TLS సెట్టింగ్స్ మరియు NON -SSL సెట్టింగ్స్ అని రెండు బాక్స్ లు విడివిడిగా ఉంటాయి.
  • ఒకవేళ మీకు SSL సర్టిఫికెట్ ఉంటె SSL /TLS అని లేకపోతె NON -SSL అని సెలెక్ట్ చేసుకోండి.

ప్రతి ఒక్క బాక్స్ ఈ క్రింది వివరాలను చూపిస్తోంది.

  • యూజర్ నేమ్
  • పాస్ వర్డ్
  • ఇన్ కమింగ్ సర్వర్
  • అవుట్ గోయింగ్ సర్వర్

ఇప్పుడు మీరు ఇ క్రింద చెప్పే విషయాలను ఫాలో అవ్వండి.

  •  మీ ఫోన్ లో కి వెళ్లి ఇమెయిల్ అనే ఐకాన్ కోసం చెక్ చెయ్యండి.
  • అది దొరికాక దాని మీద క్లిక్ చెయ్యండి.
  • అక్కడ అడిగిన విషయాలను స్టెప్ బై స్టెప్ ఎంటర్ చెయ్యండి.
  • తర్వాత ఒకసారి మీ ఇమెయిల్ అకౌంట్ ని చెక్ చేసుకోండి.
  • మీ ఇమెయిల్ అకౌంట్ నుండి మీ మరొక E మెయిల్ అకౌంట్ కి ఒక మెయిల్ సెండ్ చెయ్యండి.
  • అలాగే మీ మరొక ఇమెయిల్ అకౌంట్ నుండి మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఇమెయిల్ అకౌంట్ కి ఒక మెయిల్ సెండ్ చేసి అది రిసీవ్ అయిందో లేదో చెక్ చేసుకొండి.

అంతా కరెక్టుగా ఉంటె మీరు మీ లేదా మీ వెబ్ సైట్ పేరుతో ఒక ప్రొఫషనల్ ఇమెయిల్ అకౌంట్ ని క్రీట్ చేసినట్లే.

మీకు ఇంకా మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా బ్లాగ్ ను ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా?
Article Name
మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా?
Description
మీకు ఏదేనా వెబ్ సైట్ కానీ,బ్లాగ్ కానీ,లేదా మరి ఏదయినా ఆన్ లైన్ ప్రెజన్స్ కానీ ఉందా? మీ సమాధానం అవును ఐతే మీకు తప్పని సరిగా ఒక ప్రొఫషనల్ ఇమెయిల్ ఉండి తీరాలి.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don’t have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that’s why you’re read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: