యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా

హలో, Ap Web Academy కి స్వాగతం.ఇక్కడ మీరు అన్ని రకాలైన వెబ్ కాన్సెప్ట్స్ ని స్టెప్ బై స్టెప్ ఈజీ గా నేర్చుకోవచ్చు. ఈ రోజు మనం యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అనే విషయం గురించి నేర్చుకుందాం. అది కూడా ఏ విధమైన సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోవడం లేదా ఇన్ స్టాల్ చేసుకోవడం వంటివి లేకుండా యూట్యూబ్ వీడియోస్ మీ PC లేదా మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

దాదాపుగా చాలా మంది ఫ్రెండ్స్ మరియు తెలిసిన వాళ్లకి 40 నుండి 50 సార్లు దీని గురించి ఎక్సప్లయిన్ చేసాక దీని యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకొని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది.నిజం గా ఇది ఒక సింపుల్ ట్రిక్. మీ ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి 5 నిమిషాలలో ఒక ఫుల్ మూవీ ని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా మీరు నాగురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చూడగలరు.

యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా

  • ముందుగా YOUTUBE కి వెళ్ళండి.
  • మీకు నచ్చిన వీడియోని ఓపెన్ చెయ్యండి.దాన్ని ప్లే చేసి దాని యొక్క వీడియో మరియు పిక్చర్ క్వాలిటీ బాగున్నావు లేదో చెక్ చేసుకోండి.
  • ఒక వేళ మీరు ఆ వీడియో క్వాలిటీ తో శాటిస్ ఫై ఐతే ఆ వీడియో యొక్క యుఆర్ఎల్ లింక్ ను కాపీ చెయ్యండి.
  • యుఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్సెస్ లొకేటర్.
  • యుఆర్ఎల్ లింక్ పైన బ్రౌజర్ అడ్రస్ బార్ లో ఉంటుంది.

మీకు ఇంకా అర్ధం కావాలంటే ఈ క్రింది ఇమేజ్ ని గమనించండి.

యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా
యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా

మీరు ఆ వీడియో యొక్క యుఆర్ఎల్ ని కాపీ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆ వీడియో ని డౌన్ లోడ్ చేసుకునే పార్ట్ లోకి వెళదాం.ఇది చాలా సింపుల్.

  • మీ బ్రౌజర్ లో మరొక ట్యాబు ఓపెన్ చేసి KEEPVID.COM అని టైపు చెయ్యండి.
  • మీరు కాపీ చేసిన యుఆర్ఎల్ ని ఇక్కడ సెర్చ్ బార్ లో పేస్ట్ చెయ్యండి.
  • డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చెయ్యండి.

ఈ క్రింది ఇమేజ్ ను గమనించండి.

యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా 2.
యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా 2.
  • మీరు డౌన్లోడ్ అనే బటన్ ని క్లిక్ చేయగానే ఇది దాదాపుగా పది రకాల ఫార్మట్స్ ని చూపిస్తుంది.
  • మీ ఫేవరెట్ ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • దాని ఎదురుగా ఉన్న డౌన్ లోడ్ బటన్ ని క్లిక్ చెయ్యండి.
  • మీ ISP ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ స్పీడ్ ని బట్టి ఒక సినిమా డౌన్ లోడ్ చేసుకోవడానికి 2 నిమిషాల నుండి గంట వరకు పడుతుంది.

ఈ క్రింది ఇమేజీని మీరు గమనిస్తే మీకు యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అనే విష్యం మీద చాలా వరకు అవగాహన వస్తుంది.

యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా 3.
యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా 3.

మొబైల్ లేదా టాబ్లెట్ లలో యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా

ఈ ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాతోటి పని చేసే ఒక కోలిగ్ అడిగిన ప్రశ్నను బేస్ చేసుకొని ఈ పాయింట్ రాయటం జరిగింది. మొబైల్ లేదా టాబ్లెట్ లలో యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఇది కూడా చాలా తేలికైన విషయమే, ఎలాగో చూద్దాం.మీరు కనక మొబైల్ లేదా టాబ్లెట్ లో మీ బ్రౌజర్ M.YOUTUBE.COM లో బ్రౌజ్ చేస్తూ ఉంటే, ఏ విధమైన ప్రాబ్లెమ్ లేదు. సేమ్ ప్రాసెస్.

  • యుఆర్ఎల్ ని కాపీ చేసుకోండి.
  • మీ మొబైల్ లేదా టాబ్లెట్ బ్రౌజర్ లో మరొక ట్యాబు ని ఓపెన్ చేయండి.
  • KEEPVID ఓపెన్ చేయండి.
  • ఈ లింక్ ని అక్కడ పేస్ట్ చెయ్యండి.
  • మీకు కావలసిన ఫార్మాట్ లో వీడియో ని డౌన్ లోడ్ చేసుకోండి.

కానీ మనం యూట్యూబ్ యాప్ వాడితే మనకు యుఆర్ఎల్ ఎక్కడ కనిపిస్తుంది?

నేను ఇప్పుడు అదెలాగో కూడా చెపుతాను.

  • ముందుగా యూట్యూబ్ యాప్ ఓపెన్ చెయ్యండి.
  • అలాగే మీ ఇష్టమైన వీడియో మీద క్లిక్ చెయ్యండి.
  • ఆ వీడియో ఓపెన్ ఐయ్యాక దాని క్రింద ఉన్న షేర్ అనే బటన్ మీద క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడు అక్కడున్న కాపీ లింక్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి. లేదా ఆ లింక్ ని కాపీ చెయ్యండి.
  • మీ మొబైల్ బ్రౌజర్ ని ఓపెన్ చెయ్యండి.
  • కాపీ చేసిన లింక్ ని పేస్ట్ చెయ్యండి.
  • మీకు కావలసిన ఫార్మాట్ లో వీడియోని డౌన్ లోడ్ చేసుకోండి.

ఇంకా మీకు వివరంగా అర్ధం కావాలంటే క్రింద ఉన్న ఇమేజ్ ను గమనించండి.

యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలాe 4.
యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా 4.

అంతా బాగానే ఉంది, KEEPVID తో మనం ఇంకా ఏమన్నా చేయగలమా?

KEEPVID దాదాపుగా 28 సైట్ల లోని వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. వాటిలో కొన్నిటికి మాత్రం KEEPVID హెల్పర్ యూజర్ స్క్రిప్ట్ అవసరమౌతుంది.దీనిని గురించి మీకు తెలియకపోతే మీరు KEEPVID ని విజిట్ చేసి తెలుసుకొనవచ్చు. ఇప్పుడు మనం KEEPVID ఏ ఏ సైట్ లను సపోర్ట్ చేస్తుందో చూద్దాం.
ఈ క్రింది ఇమేజ్ లో వివరంగా తెలుపబడినది.

యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా 5.
యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా 5.

మీకు KEEPVID కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్న వారి వెబ్సైటు నందు కావలిసిన సమాచారం మొత్తం FAQS , గైడ్స్, టిప్స్ రూపం లో మీకు దొరుకుతుంది.

మీకు ఇంకా యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఇలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా
Article Name
యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా
Description
యూట్యూబ్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అనే విషయం గురించి నేర్చుకుందాం. అది కూడా ఏ విధమైన సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేసుకోవడం లేదా ఇన్స్టాల్ చేసుకోవడం వంటివి లేకుండా యూట్యూబ్ వీడియోస్ మీ PC లేదా మొబైల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?
Author
Publisher Name
apwebaademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: