వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్

హలో, Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం.

మిగిలిన అన్ని సెట్టింగ్స్ లాగే జనరల్ సెట్టింగ్స్ కూడా ఏంటో ముఖ్యమైనవి. ఈ జనరల్ సెట్టింగ్స్ లోనే మీ వెబ్ సైట్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయ్. వాటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటేనే మీరు మీ వెబ్ సైట్ ని బాగా మెయిన్ టైన్ చేయగలుగుతారు.అవి ఏమిటి వాటిని ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. అలాగే మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ చూడగలరు.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్

ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.ముందుగా మీరు ఈ క్రింది ఇమేజ్ ని గమనించండి.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ image
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ image
  • మీరు వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు లోకి లాగిన్ అయ్యాక మీ మౌస్ ని సెట్టింగ్ టాబ్ మీదకు తీసుకు వెళ్ళండి.
  • సెట్టింగ్స్ టాబ్ ప్రక్కన ఒక సబ్ మెనూ కనపడుతుంది.
  • సబ్ మెనూ లోని జనరల్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.అప్పుడు మీకు ఒక పేజీ లోడ్ అవ్వుతుంది. అది ఇ క్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ image 2
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ image 2

ఇప్పుడు నన్ను స్టెప్ బై స్టెప్ ఫాలో చెయ్యండి.

  • జనరల్ సెట్టింగ్స్ లో మొదటిది సైట్ టైటిల్. ఇక్కడ మీ బ్లాగ్ లేదా వెబ్సైటు టైటిల్ ని ఎంటర్ చెయ్యండి.
  • రెండవది టాగ్ లైన్. ఇక్కడ మీ సైట్ కి సంబంధించిన టాగ్ లైన్ ఎంటర్ చెయ్యండి. అది చదవగానే మీ సైట్ ఏమిటి అనేది అర్ధం కావాలి.
  • వర్డ్ ప్రెస్ అడ్రస్ (యుఆర్ఎల్). మీ సైట్ యొక్క అడ్రస్ లేదా URL ని ఎంటర్ చెయ్యండి.మీకు కనక SSL సర్టిఫికెట్ ఉంటే HTTPS :// MEESITE .COM అని లేకపోతె HTTP :// MEESITE .COM అని ఎంటర్ చెయ్యండి.ఒక వేళ మీకు SSL అంటే ఏమిటో తెలియకపోతే మీకు SSL అంటే ఏమిటి అది ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి అనే ఆర్టికల్ ని చదవండి.
  • సైట్ అడ్రస్ (URL ). ఇది కూడా ఇంతకూ ముందు లాగే మీ సైట్ అడ్రస్ ని ఎంటర్ చెయ్యండి.
  • ఇమెయిల్ అడ్రస్. ఇక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చెయ్యండి. గుర్తుంచుకోండి మీతో మీ సైట్ విజిటర్స్ కమ్యూనికేట్ అయ్యేది దీని ద్వారానే కాబట్టి ప్రొఫషనల్ గా ఉండే ఇమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చెయ్యండి. ఒకవేళ మీకు ప్రొఫషనల్ ఇమెయిల్ లేకపోతె మీ పేరుతొ ఇమెయిల్ క్రియేట్ చేయడం ఎలా అనే ఆర్టికల్ ను ఫాలో కావడం ద్వారా మీరు ఒక ఏ మెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు.
  • మెంబర్ షిప్. అక్కడున్న బాక్స్ లో క్లిక్ చెయ్యండి. ఒక వేళ మీ సైట్ ప్రైవేట్ వెబ్సైటు ఐతే మీరు క్లిక్ చేయకండి.
  • న్యూ యూజర్ డిఫాల్ట్ రోల్. సబ్ స్క్రైబర్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
  • సైట్ లాంగ్వేజ్. మీ సైట్ యొక్క డిఫాల్ట్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి.

ఇప్పుడు మనం తరవాత ఆప్షన్స్ ని చూద్దాం.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ IMAGE 3
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ IMAGE 3

ఇప్పుడు మనం తరవాత ఆప్షన్స్ ని చూద్దాం. ఒక్క సారి పైనున్న ఇమేజ్ ని గమనించండి.

  • టైం జోన్.మీ టైం జోన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటె మీ యొక్క పోస్ట్ లు కామెంట్లు మరియు మిగిలిన చాలా విషయాలలో ఇది చాలా ముఖ్యమైనది.
  • డేట్ ఫార్మాట్. మీకు కావలసిన డేట్ ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • టైం ఫార్మాట్. ఇది కూడా డేట్ ఫార్మాట్ లాగానే మీకు కావలసిన టైం ఫార్మాట్ ను సెలెక్ట్ చేసుకోండి.
  • వీక్ స్టార్ట్స్ ఆన్. సాధారణంగా ప్రతివారం సోమవారం తో మొదలవుతుంది. కాబట్టి MONDAY అని సెలెక్ట్ చేసుకోండి.

ఇప్పుడు అప్ డేట్ బటన్ ని క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ అన్నిటిని చక్కగా సెలెక్ట్ చేసుకొని వాటిని సేవ్ చేసుకున్నాం.

Important Other Settings.

ఇవేనండి వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్. దాదాపుగా మనం వీటిని చాలా చక్కగా సెలెక్ట్ చేసుకున్నాం.అలాగే మీరు ఇప్పుడే వర్డ్ ప్రెస్ కనక ఇన్ స్టాల్ చేసుకొని ఉంటే మీరు తప్పకుండా వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి అనే ఆర్టికల్ చదవండి.దాదాపుగా ప్రతి ఒక్క అడ్మిన్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇందులో కవర్ చేయబడి ఉన్నాయ్.అలాగే వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ ఆర్టికల్ ని కూడా తప్పక చదవండి. ఇందులో మనం పెర్మ లింక్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి? దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించబడింది.ఒక వేళా మీరు ఈ రెండు ఆర్టికల్స్ కనక చదవక పొతే వెంటనే వీటిని చదవండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి.

మీకు ఇంకా వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్
Article Name
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్
Description
ఈ జనరల్ సెట్టింగ్స్ లోనే మీ వెబ్ సైట్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయ్. వాటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటేనే మీరు మీ వెబ్ సైట్ ని బాగా మెయిన్ టైన్ చేయగలుగుతారు.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don’t have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that’s why you’re read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: