వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్

Ap Web Academy కి స్వాగతం, ఏ రోజు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ముఖ్యమైన సెట్టింగ్స్, మీరు ఇప్పుడు ఏదైతే సెట్టింగ్స్ సేవ్ చేసుకుంటారో అవి ఫ్యూచర్ లో మీరు రాసే పోస్ట్ ల యొక్క రైటింగ్, పోస్టింగ్, అప్ డేటింగ్ అప్పీరెన్స్ ని నిర్ధారిస్తాయి. కాబట్టి,వీటిని ముఖ్యమైన సెట్టింగ్స్ అని చెప్పవచ్చు. కాబట్టి వీటిని మనం కరెక్టుగా సెట్ చేసుకొని సేవ్ చేసుకోవలసి ఉంటుంది. మరి ఇప్పుడు మనం అవేంటో, వాటినెలా సెట్ చేసుకోవాలో చూద్దాం.

మెయిన్ ఆర్టికల్ లోకి వెళ్లే ముందుగా మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చూడగలరు.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్

ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నన్ను ఫాలో అవ్వండి.

  • మీ వర్డ్ ప్రెస్ అడ్మిన్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
  • మీ మౌస్ ని సెట్టింగ్స్ టాబ్ వద్దకు తీసుకోని వెళ్ళండి.
  • అప్పుడొక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది.
  • రైటింగ్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.
  • ఇప్పుడొక పేజీ ఓపెన్ అవ్వుతుంది.అది ఈ క్రింది ఇమేజ్ లో లాగ ఉంటుంది.
writing settings image for వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్
writing settings image for వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్
  • డిఫాల్ట్ పోస్ట్ క్యాటగిరి. మీరు ఏ క్యాటగిరి డిఫాల్ట్ గా ఉండాలనుకుంటున్నారో దానిని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు పోస్ట్ చేసే ఆర్టికల్స్ అన్నిటికి డిఫాల్ట్ గా ఆన్ క్యాటగిరి లో ఉంటాయి. జనరల్ లేదా రెగ్యులర్ వంటి క్యాటగిరీ సెలెక్ట్ చేసుకోండి.
  • పోస్ట్ ఫార్మాట్. ఎప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ నే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటె ఈ ఫార్మాట్ లో మీరు ఏదయినా పోస్ట్ చేయవచ్చు.ఒక వేళ మీ సైట్ ఫోటో, వీడియో లేదా మరేదయినా ఐతే మీరు మీకు కావలసిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి.
  • పోస్ట్ వయా ఇమెయిల్. ఒక వేళ మీరు ఇమెయిల్ ద్వారా పోస్ట్ చేయాలనుకొంటే ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
  • వర్డ్ ప్రెస్ దీని గురించి ఏమి చెపుతుందంటే మీరు వర్డ్ ప్రెస్ లో ఇమెయిల్ ద్వారా పోస్ట్ చెయ్యాలంటే మీరు pop3 యాక్సస్ తో ఒక సీక్రెట్ ఇమెయిల్ అకౌంట్ సెట్ చేయవలసిఉంటుంది.ఈ అడ్రస్ కు సంబంధించిన ఏ మెయిల్ అయినా పోస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఈ అడ్రస్ ను సీక్రెట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.ఇక్కడ ఉన్న 3 రాండమ్ స్ట్రింగ్స్ మీరు ఉపయోగించుకోవచ్చు.6abcdefghi,  jklmnopqr,  stuv3wxyz.
  • అంటే మీరు ఒక సీక్రెట్ popup3 ఇమెయిల్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఈ ఇమెయిల్ సంబందించిన ఇమెయిల్స్ అన్ని పోస్ట్ చేయబడతాయి. నా సజెషన్ ఏమిటంటే మీరు దీనిని సెలెక్ట్ చేసుకోవద్దు.ఎందుకంటె మనం చాలా ఒప్షన్స్ మిస్ అవుతాము.

ఒకవేళ మీరు ఇమెయిల్ ద్వారా పోస్ట్ చేయదలుచుకొంటే ఈ క్రింది ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి.

  • మెయిల్ సర్వర్. ఇక్కడ మెయిల్ సర్వర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు posts .యువర్ సైట్.కం
  • పోర్ట్. దానికి సంబందించిన పోర్ట్ నెంబర్ సెట్ చెయ్యండి.
  • లాగిన్ నేమ్. మెయిల్ కి లాగిన్ నేమ్ సెట్ చెయ్యండి. ఇది మీ మెయిల్ అడ్రస్ లాంటిది.
  • పాస్ వర్డ్. చాలా చాలా ముఖ్యమైనది.మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే పాస్ వర్డ్ ఎలా ఉండాలంటే మీకు మాత్రమే తెలిసి గుర్తుంచుకునేలా ఉండాలి. ఎవరు గెస్ చేయడానికి కూడా అవకాశం ఉండకూడదు.
  • డిఫాల్ట్ మెయిల్ క్యాటగిరి. మీ మెయిల్ పోస్ట్ ఏ క్యాటగిరి లో పోస్ట్ అవ్వాలో సెలెక్ట్ చేసుకోండి.

ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్ లో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం.

అప్ డేట్ సర్వీసెస్. వర్డ్ ప్రెస్ దీని గురించి ఏమి చెపుతుందంటే “మీరు ఎప్పుడయినా ఒక పోస్ట్ ని పబ్లిష్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ క్రింది సైట్ లకు నోటిఫై చేస్తుంది. దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కోడెక్స్ లోని అప్ డేట్ సర్వీసెస్ చూడండి. ఎక్కువ URL లు ఉంటె వాటిని లైన్ బ్రేక్స్ తో సెపరేట్ చెయ్యండి”.

అంటే మీరు ఎప్పుడైనా కొత్త పోస్ట్ పబ్లిష్ చేస్తే వర్డ్ ప్రెస్ ఈ క్రింది సైట్ లకు ఆటోమేటిక్ గా అప్ డేట్ అందజేస్తుంది. డిఫాల్ట్ గా వర్డ్ ప్రెస్ ఒక పింగ్ సైట్ యుఆర్ఎల్ మాత్రమే ఇస్తుంది. అది http://rpc.pingomatic.com/ . ఇది చాలా ఉపయోగకరమైనది. మీకు ఇంకా ఏవైనా పింగ్ సైట్ లు కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు.

  • ఇప్పుడు సేవ్ చేంజెస్ అనే బటన్ నొక్కండి.
  • అంతే, ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సెట్టింగ్స్ ను నేను చెప్పినట్టు చేసుకోవటం కన్నా మీ రిక్వైర్ మెంట్ ను బట్టి సెట్ చేసుకోండి.

మీరు ఇంకా మరిన్ని సెట్టింగ్స్ కావాలంటే ఈ క్రింది ఆర్టికల్స్ లో ఉంటాయి.

మీకు ఇంకా వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్ అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

 

Summary
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్
Article Name
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్
Description
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్. మీరు ఇప్పుడు ఏదైతే సెట్టింగ్స్ సేవ్ చేసుకుంటారో అవి ఫ్యూచర్ లో మీరు రాసే పోస్ట్ ల యొక్క రైటింగ్,
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: