వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు మీడియా సెట్టింగ్స్
హలో, Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు మీడియా సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు సెట్టింగ్స్ లో చివరివి.ఇవి చాలా ముఖ్యమైన సెట్టింగ్స్. ఎందుకంటె మీరు వీటిని ఎలా సెట్ చేసుకుంటారు అనేదాని మీదే ఫ్యూచర్ లో మీరు అప్ లోడ్ చేసే మీడియా ఫైల్స్ అంటే ఫొటోస్,వీడియోస్ మొదలైన వాటి యొక్క ఆక్టివిటీస్ ఆధారపడి ఉంటాయి.మరి మనం అవేంటో వాటినెలా సెట్ చేసుకోవాలో వెంటనే తెలుసుకుందాం.
మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా మీరు నా గురించి తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ని చూడగలరు.
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు మీడియా సెట్టింగ్స్
Products from Amazon.in
-
Price: Check on Amazon
-
Price: Check on Amazon
-
Price: Check on Amazon
-
Price: Check on Amazon
Media Settings
ఇప్పుడు నన్ను స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీడియా సెట్టింగ్స్ జాగ్రత్తగా కాన్ఫిగర్ చేసుకోండి.
Image sizes
- The sizes listed below determine the maximum dimensions in pixels to use when adding an image to the Media Library.
- మీరు ఈ క్రింద ఏదితే కన్ఫిగర్ చేస్తారో అవే సెట్టింగ్స్ డిఫాల్ట్ గా మీరు అప్ లోడ్ చేసే మీడియా ఫైల్స్ కు అప్లై చేయ బడతాయి.
1.Thumbnail size
- Width 0. విడ్త్ జీరో సెట్ చేసుకోండి.
- Height 0. హైట్ జీరో సెట్ చేసుకోండి.
- Crop thumbnail to exact dimensions (normally thumbnails are proportional).ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటె థంబ్ నెయిల్స్ మనకు డిఫాల్ట్ గా కరెక్ట్ పోసిషన్ లో రావు.
2. Medium size
- Width 0. విడ్త్ జీరో సెట్ చేసుకోండి.
- Height 0. హైట్ జీరో సెట్ చేసుకోండి.
- మీరేమి ఆలోచించవలసిన అవసరం కానీ అనుమాన పడవలసిన అవరం కానీ లేదు. నేను ఎందుకు అన్నిటికి జీరో సెట్ చేసుకోమంటున్నానో మీకు తర్వాత చెపుతాను.
3.Large size
- ఇంతకూ ముందు మీరు ఏదయితే చేశారో అదే ఇక్కడ ఫాలో అవ్వండి.
- Width 0. విడ్త్ జీరో సెట్ చేసుకోండి.
- Height 0. హైట్ జీరో సెట్ చేసుకోండి.
4.Tiled Galleries
- Display all your gallery pictures in a cool mosaic. ఈ ఆప్షన్ ను మీ అవసరాలను బట్టి సెలెక్ట్ చేసుకోండి.
Uploading Files
- Organize my uploads into month- and year-based folders.
- ఈ ఆప్షన్ ను కచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటె దీని వాళ్ళ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ మీడియా ఫైల్స్ ఏది కావాలంటే అది ఈజీ గా యాక్సస్ చేయగలరు. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఇప్పుడు సేవ్ చేంజెస్ అనే బటన్ ను నొక్కండి. అంతే, మీరు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా కాన్ఫిగర్ చేశారు.
ఇప్పుడు నేను మిమ్మల్ని అన్ని ఇమేజ్ సైజు లకు జీరో సెట్ చేసుకోమని చెప్పినందుకు మీకు ఎంతో కొంత డౌట్ వచ్చి ఉంటుంది కదూ? వాటిని క్లియర్ చేస్తాను.
మీరు సేవ్ చేసుకొన్న వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు మీడియా సెట్టింగ్స్ ఎందుకని కరెక్ట్?
నా సలహా ఏమిటంటే అసలు సెట్టింగ్స్ లో ఈ పార్ట్ లోనుండి స్కిప్ అయిపోండి.ఎందుకంటె మీరు ఆ సెట్టింగ్స్ లో జీరో కాకుండా ఏమి సెట్ చేసుకున్నా మీరు అప్ లోడ్ చేసే ప్రతి మీడియా ఫైల్ మూడు రకాల ఫార్మాట్స్ లో సేవ్ అవుతుంది. అంటే కాకుండా ఇవన్నీ మీ డేటా బేస్ లో ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. దాని వాళ్ళ మీ సైట్ లోడింగ్ స్పీడ్ తగ్గుతుంది. అంతేకాక కొన్ని సార్లు డూప్లికేట్ ఇమేజెస్ తో చాలా తలనొప్పులు ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది.
అదే ఒకవేళ మీరు కానక థంబ్ నైల్ సైజు, మీడియం సైజు, మరియు లార్జ్ సైజు మూడు కూడా విడ్త్ ౦, హైట్ ౦ సెట్ చేసుకొంటే, మీరు వర్డ్ ప్రెస్ కి ఇమేజ్ లను ఏ విధమైన రీ సైజు చెయ్యవద్దని చెప్పినట్టు అవుతుంది. మరియు ఇమేజెస్ అన్ని కూడా ఒరిజినల్ సైజు అండ్ క్వాలిటీ తో అలాగే ఉంటాయి.
ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే మీరు మీ ఇమేజ్ లను పోస్ట్ చేసే ముందుగా క్వాలిటీ పోకుండా వాటి బైట్ తగ్గే విధంగా అంటేఇమాజ్ ఆప్టిమైజషన్ చేయవలసి ఉంటుంది.
ఇమేజ్ ఆప్టిమైజషన్ కోసం wp smush ప్లగ్-ఇన్ ఇన్ స్టాల్ చేసుకోండి. ఎందుకంటె ఇది ఒక అద్భుతమైన ప్లగ్-ఇన్. ఒక వేళ మీకు ప్లగ్-ఇన్ అంటే ఏమిటి? లేదా wp smush అంటే ఏమిటో తెలియకపోతే దాని గురించి ఎక్కువగా కంగారు పడవలసిన అవసరం లేదు. మనం వాటి గురించి రాబోయే ఆర్టికల్స్ లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అన్ని అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్ కంప్లీట్ చేసాం.ఇప్పుడు మనం రాబోయే పోస్ట్ లలో థీమ్స్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి తెలుసుకుందాం. అంటే థీమ్ మరియు ప్లగ్-ఇన్ అంటే ఏమిటి? వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మరియు ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకొందాం.
మీరు ఇంకా మరిన్ని సెట్టింగ్స్ గురించి తెలుసుకోవాలంటే క్రింద ఆర్టికల్స్ చదివి తెలుసుకోవచ్చు.
- 1.వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రీడింగ్ సెట్టింగ్స్.
- 2.వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు జనరల్ సెట్టింగ్స్.
- 3.వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్.
- 4.వర్డుప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలి
- 5.వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు రైటింగ్ సెట్టింగ్స్
- 6.వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు డిస్కషన్ సెట్టింగ్స్
మీకు ఇంకా వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు మీడియా సెట్టింగ్స్ అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.
ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

