వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్

, హలో Ap Web Academy కి స్వాగతం. మనం ఇంతకూ ముందు ఆర్టికల్ లో వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసాక అడ్మిన్ ప్రొఫైల్ ఎలా సెట్ చెయ్యాలో తెలుసుకున్నాం.ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం.మీరు మీ బ్లాగ్ లేదా వెబ్ సైట్ లో ఏమి చెయ్యాలన్న కూడా ముందుగా ఈ పెర్మా లింక్స్ కరెక్టుగా చేసుకున్నాకే చెయ్యాలి.ఎందుకని? ఎందుకంటె మీరు ఫ్యూచర్లో క్రియేట్ చెయ్యబోయే ప్రతి చిన్న ఆర్టికల్ లేదా పేజీ కి సంబంధించిన URL ని జనరేట్ చేసే అతి ముఖ్యమైన సెట్టింగ్ ఇది.ఇప్పుడు మనం అసలు ఈ పెర్మా లింక్స్ ఎలా పనిచేస్తాయి.వాటిని మనం ఏవిధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం.

మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీని చుడండి.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్

ఓకే, అంతా బాగానే ఉంది? కానీ ఎక్కడినుండి మొదలు పెట్టాలి?ఐతే దీనికన్నా ముందుగా మీరు ఇక్కడ చెప్పిన సెట్టింగ్స్ చేశారో లేదో చెక్ చేసుకోండి.

నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సలహా ఏమిటంటే మీరు వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకొని అడ్మిన్ ప్రొఫైల్ సెట్ చేసుకున్నాక ముందుగా పెర్మాలింక్స్ నే సెట్ చేసుకోండి.ఎందుకంటె ఇది చాలా ముఖ్యమైనది.ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా మీరు వర్డ్ ప్రెస్ లోకి అడ్మిన్ అకౌంట్ తో లాగిన్ కాగానే మీ డాష్ బోర్డు ఈక్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ image
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ image
  • అందులో సెట్టింగ్స్ ట్యాబు వద్దకు మౌస్ తీసుకు వెళ్ళగానే మీకు ప్రక్కనే ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది.
  • ఆ మెనూ లో పెర్మా లింక్స్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.ఈక్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ image 2
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ image 2
  • పెర్మాలింక్ ఒక ఫ్లాట్ నంబరింగ్ URL లాగా ఉంటుంది. ఉదారణకు https://yoursite.com/?p=123.
  • కానీ సెర్చ్ ఇంజిన్స్ ర్యాంకింగ్స్ వ్యూ లో ఇది అంత మంచి స్ట్రక్చర్ ఏమి కాదు.ఎందుకంటె మీ కీ వర్డ్ ఇందులో ఉండదు కాబట్టి.
  • అందుకని మీరు మీ పెర్మా లింక్ స్ట్రక్చర్ ని పోస్ట్ నేమ్ అనే ఆప్షన్ కి మార్చు కొండి. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.ఎందుకంటె మీరు “ఒక ఆర్టికల్” రాసారనుకోండి మీ యుఆర్ఎల్ లో మీ కీవర్డ్ లేదా మెయిన్ హెడ్డింగ్ కనపడుతుంది.
  • ఉదాహరణకు https://yoursite.com/ఒక-ఆర్టికల్

కానీ ఇక్కడే మీకు ఒక అనుమానం వచ్చి ఉండవచ్చు.మిగిలిన స్ట్రక్చర్స్ ఏమిటి? వాటిని సెట్ చేసుకొంటే ఏమి జరుగుతుంది? నేను తప్పకుండా వాటిని కూడా ఎక్స్ ప్లైన్ చేస్తాను.ఒక వెబ్ సైట్ లేదా బ్లాగ్ అడ్మిన్ గా మీకు వీటన్నిటి గురించిన అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం కూడా!.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ ఏ విధం గా పని చేస్తాయి?

  • మొదటిది మరియు వర్డ్ ప్రెస్ డిఫాల్ట్ గా ఇచ్చే సెట్టింగ్
    ఇందులో p అంటే పోస్ట్ అని మరియు 123 అనేది పోస్ట్ యొక్క ఐడి ని చూచిస్తుంది.
  • మీరు ఒక కొత్త పోస్ట్ లేదా పేజీ క్రియేట్ చెయ్యటానికి ప్రయత్నించినా ప్రతిసారి వర్డుప్రెస్సు ఒక కొత్త ఐడి తో పెర్మాలింక్ ను క్రియేట్ చేస్తుంది.
  • దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు.
  • ఎందుకంటె ఇందులో మీ కీవర్డ్ లేదా మెయిన్ హెడ్డింగ్ చూపించబడదు కాబట్టి.
  • రెండవది డే అండ్ నేమ్. ఈ విధమైన పెర్మా లింక్స్ ను ప్రెట్టి పెర్మా లింక్స్ అని పిలుస్తారు.మీరు క్రియేట్ చేసే ప్రతి ఒక్క కొత్త పోస్ట్ లేదా పేజీ కి వర్డ్ ప్రెస్ ఆటోమేటిక్ గా ఇయర్,మంత్, డే, మరియు పోస్ట్ టైటిల్ ఇంక్లూడ్ అయి ఉన్న ఒక్క యుఆర్ఎల్ ని జనరేట్ చేస్తుంది.ఉదాహరణకు https://yoursite.com/2017/06/28/sample-post/
  • మూడవది మంత్ అండ్ పోస్ట్ నేమ్. వీటిని కూడా ప్రెట్టి పెర్మా లింక్స్ అనే పిలుస్తారు.ఇది మీరు సెట్ చేసుకుంటే వర్డుప్రెస్సు జనరేట్ చేసే లింక్ లో ఇయర్, మంత్, మరియు పోస్ట్ నేమ్ ఉంటాయి. ఉదాహరణకు https://yoursite.com/2017/06/sample-post/
  • నాలుగవది న్యూమరిక్. ఇ సెట్టింగ్ కనక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వర్డ్ ప్రెస్ ఒక న్యూమరిక్ వేల్యూ ఉన్న పెర్మా లింక్ ని జనరేట్ చేస్తుంది. ఉదాహరణకు  https://yorsite.com/archives/123
  • ఐదు పోస్ట్ నేమ్.
  • అతి ముఖ్యమైనది మరియు నేను ప్రిఫర్ చేసేది.
  • మీరు ఇ సెట్టింగ్ ను కనక సెలెక్ట్ చేసుకున్నట్లయితే, వర్డ్ ప్రెస్ కేవలం మీ సైట్ నేమ్ తర్వాత మీ పోస్ట్ నేమ్ ఉన్న యుఆర్ఎల్ ని జనరేట్ చేస్తుంది.
  • దీని వల్ల సెర్చ్ ఇంజిన్స్ వెంటనే మీ పోస్ట్ ఏమిటో మరియు అది దేనికి సంబంధించినదో ఈజీ గా అర్ధం చేసుకుంటాయి.
  • ఉదాహరణకు like https://yoursite.com/sample-post/
  • కస్టమ్ స్ట్రక్చర్. ఇది మనకు ఇష్టమైనట్లుగా పెర్మా లింక్ డిజైన్ చేసుకోవటానికి ఇవ్వబడిన ఆప్షన్. మీకు పూర్తిగా అవగాహన లేకపోతె మీరు దీనిని టచ్ చేయ వద్దు.
  • ఆప్షనల్. ఆప్షనల్ అనేది క్యాటగిరీ మరియు టాగ్స్ కి సంబంధించినది దీనిని కూడా మీరు ఏ విధమైన మార్పులు చేయవద్దు.

మొత్తం మీద వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ లో మీరు ఏమి అర్ధం చేసుకొన్నారు?

ఓకే మీకు ఏది ఎంచుకోవాలో అర్ధం అయింది అంటారా? కదా! కాబట్టి వెంటనే పెర్మా లింక్ స్ట్రక్చర్ ని పోస్ట్ నేమ్ కి అసైన్ చేసి సేవ్ చేసుకోండి. అప్పుడు మీ స్క్రీన్ ఇ క్రింది సిదంగా చూపిస్తోంది.

వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ image 3
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ image 3

Important Other Settings.

మీకు ఇంకావర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా బ్లాగ్ ను ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్
Article Name
వర్డ్ ప్రెస్ అడ్మిన్ డాష్ బోర్డు పెర్మ లింక్స్ సెట్టింగ్స్
Description
నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సలహా ఏమిటంటే మీరు వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకొని అడ్మిన్ ప్రొఫైల్ సెట్ చేసుకున్నాక ముందుగా పెర్మాలింక్స్ నే సెట్ చేసుకోండి.ఎందుకంటె ఇది చాలా ముఖ్యమైనది.ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: