వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం?

హలో, Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు మనం వర్డుప్రెస్సు ఇన్ స్టాల్ చేసుకున్నాక వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం ఎలా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

మీరు వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసుకున్నాక కాన్ఫిగర్ చేసుకోవలసిన కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి మనం ఇంతకూ ముందు ఆర్టికల్స్ లో తెలుసుకున్నాము. అలాగే వాటితో పాటుగా ప్లగ్ ఇన్స్ మరియు థీమ్స్ కాన్ఫిగర్ చేసుకోవటానికి ముందుగా మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని మీ అడ్మిన్ డాష్ బోర్డు ను మీ టేస్ట్ కు తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవడం మరియు వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం.

పూర్తిగా కొత్త వాళ్లకి బహుశా నేనేమి చెపుతున్నానో అర్ధం కాక పోవచ్చు. మీరు ముందుగా వర్డుప్రెస్సు గురించి తెలుసుకుంటే మిగిలిన అన్ని విషయాలు నిదానంగా వాటంతట అవే అర్ధం అవుతాయి. మనం ఇప్పుడు పైన చెప్పుకున్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.

మీరు నా గురించి అబౌట్ పేజీలో వివరంగా తెలుసుకోవచ్చు.

వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం?

మనం ఆల్రెడీ ఇంతకూ ముందు పోస్టులలో వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసాక ఏమి చేయాలో వివరంగా నేర్చుకున్నాము. కానీ, నేను మీకు మరో సారి వాటికి సంబంధిచిన ఆర్టికల్స్ యొక్క లింక్స్ ఈ క్రింద ఇస్తున్నాను.

పైన చెప్పుకున్న సెట్టింగ్స్ అన్ని కరెక్టుగా సేవ్ చేసుకున్నాక మనం ప్లగిన్స్ మరియు థీమ్స్ లోకి వెళ్లే ముందుగా మనం చేయవలసిన ముఖ్యమైన పని అడ్మిన్ డాష్ బోర్డు ను అందంగా డిజైన్ చేసుకోవడం మరియు వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం. ఇప్పుడు ఒక్కో విషయం గురించి వివరంగా నేర్చుకుందాం.

మీరు వర్డ్ ప్రెస్ లోకి లాగిన్ ఐయ్యాక అడ్మిన్ డాష్ బోర్డు లో మీకు ఐదు బాక్స్ లు కనపడతాయి. అవేంటో వాటి ఉపయోగాలేంటో మనమిప్పుడు చూద్దాం.

1.WELCOME TO WORDPRESS
2.AT A GLANCE.
3.QUICK DRAFT.
4.ACTIVITY.
5.WORDPRESS EVENTS AND NEWS

ఇపుడు మనం ఒక్కో దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1.Welcome To WordPress

ఈ బాక్స్ మీకు మూడు ఆప్షన్స్ ని చూపిస్తుంది.
1.Get Started – అంటే మీరు ఇక్కడ నుండి ముందుకు వెళ్లి మీ సైట్ ను మీకు కావలసిన విధంగా కాస్ట్యూమైజ్ చేసుకోవడం లేదా ఇక్కడి నుండి వెనక్కు వెళ్లి మీ ప్రస్తుత థీమ్ ను మరొక ఫ్రీ లేదా ప్రీమియం థీమ్ కు మార్చుకోవడం.

2.Next Steps – మీ మొదటి బ్లాగ్ పోస్ట్ ని రాయండి. మీకు ఇంటరెస్ట్ ఉన్న ఏదయినా టాపిక్ పైనా, ఒక మంచి అద్భుతమైన, అర్ధవంతమైన 250 పదాల పైబడిన ఆర్టికల్ ని రాయండి.

అబౌట్ పేజీ ని ఆడ్ చేయండి.అబౌట్ పేజీలో మీరు ఆ పేజీ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అంటే మీరు ఎవరు? మీ వెబ్ సైట్ ఏమిటే? మీరు ఏ ఉద్దేశంతో మీ సైట్ స్టార్ట్ చేశారు? ఏమి ఆశించి లేదా ఏమి చెప్పాలని మీ సైట్ ను రన్ చేస్తున్నారు? మీ visitors మీ నుండి ఏమి ఆశించవచ్చు? వంటి విషయాలను ఈ పేజీ లో రాయండి.

వ్యూ యువర్ సైట్. పైన చెప్పిన విషయాలన్నీ పబ్లిష్ చేసాక ఒక్కసారి మీ సైట్ ను చెక్ చేసుకోండి.

3.More Actions. – మేనేజ్ విడ్జెట్స్ ఆర్ మెనూస్. విడ్జెట్స్ లేదా మెనూస్ సెక్షన్ కి వెళ్లి మీరు వాటిని ఎలా చుపించాలనుకుంటున్నారో ఆలా అడ్జస్ట్ చేసుకోండి.

టర్న్ కామెంట్స్ ఆన్ ఆఫ్. మీరు కామెంట్స్ ఆఫ్ మరియు ఆన్ చేసుకోవచ్చు.

లెర్న్ మోర్ అబౌట్ గెట్టింగ్ స్టార్టెడ్. ఒక మంచి బ్లాగ్ స్టార్ట్ చేయడానికి కావలసిన విషయాల గురించి మరింత సమాచారం నేర్చుకోండి.

2.At A Glance

At A Glance లో మీ సైట్ లో ఎన్ని పోస్ట్ లు ఉన్నాయి? ఎన్ని పేజీలు ఉన్నాయ్? మరియు మీ సైట్ ఏ థీమ్ మీద రన్ అవుతది అనే విషయాలను మరియు ఏవైనా బ్లాక్ చేయబడిన స్పాం కామెంట్స్ ఉంటే వాటిని చూపిస్తుంది. మీరు వీటన్నిటిని ఇక్కడి నుండే మేనేజ్ చేసుకోవచ్చు.

3.Quick Draft

క్విక్ డ్రాఫ్ట్ చాలా ఉపయోగకరమైన టూల్. ఇందులో మీ పోస్ట్ టైటిల్ కోసం ఒక చిన్న టైటిల్ బాక్స్ మరియు మిగిలిన ఆర్టికల్ కోసం డ్రాఫ్ట్ బాక్స్ ఉంటాయి. క్విక్ డ్రాఫ్ట్ బాక్స్ చివర ఇంతకూ ముందు ఏవైనా డ్రాఫ్ట్స్ ఉంటె అవి చూపించబడతాయి.

4.Activity

ఆక్టివిటీ లో మీ యొక్క లేటెస్ట్ పోస్ట్స్ మరియు కామెంట్స్ చూపించబడతాయి. మరియు వాటిని approve చేయడం, un approve చేయడం, ఎడిట్, డిలీట్ మొదలైన పనులన్నీ ఇక్కడి నుండే మేనేజ్ చేయవచ్చు.వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం కూడా చేయవచ్చు.

5.Wordpress News And Events.

ఈ బాక్స్ లో వర్డ్ ప్రెస్ కి సంబంధించిన ప్రపంచ వ్యాప్తంగా రాబోయే ఈవెంట్స్ మరియు ప్రస్తుత న్యూస్ చూపించబడతాయి.మీరు ఇక్కడ మూడు ఇంపార్టెంట్ లింక్స్ చూడవచ్చు.

1.Meetups- ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంపార్టెంట్ మీటింగ్స్ గురించి తెలియ జేస్తుంది.

2.Wordcamps- వర్డ్ క్యాంప్స్ అంటే వర్డ్ ప్రెస్ బ్లాగర్స్ మరియు ఆటోమేటిక్ గ్రూప్ వారు కలసి నిర్వహించే మీటింగ్స్.

3.News – న్యూస్ టాబ్ వర్డ్ ప్రెస్ కి సంబంధించిన ముఖ్యమైన న్యూస్ గురించి తెలియజేస్తుంది.

మనం ఇప్పటివరకు వర్డుప్రెస్సు బ్లాగ్ సెట్ చేసుకోవటానికి కావలసిన అన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకున్నాము.ఇప్పటి వరకు మనం బ్లాగ్ పోస్టింగ్ చేయటానికి ముందు కావలసిన వాటి అన్నిటిని చక్కగా సెట్ చేసుకున్నాము. మనం ఇంకొక ఇంపార్టెంట్ పని చేయవలసి ఉంది. అదేమిటంటే మీ బ్లాగ్ కి కావలసిన థీమ్స్ మరియు ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకోవడం మరియు వాటిని ఇన్ స్టాల్ చేసుకోవడం. దీనిని గురించి మనం రాబోయే పోస్టులలో నేర్చుకుందాం.

మీకు ఇంకా వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి

Summary
వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం?
Article Name
వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం?
Description
ప్లగ్ ఇన్స్ మరియు థీమ్స్ కాన్ఫిగర్ చేసుకోవటానికి ముందుగా మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని మీ అడ్మిన్ డాష్ బోర్డు ను మీ టేస్ట్ కు తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవడం మరియు వర్డ్ ప్రెస్ లో డిఫాల్ట్ పోస్ట్ మరియు కామెంట్ డిలీట్ చేయడం.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

Specify Facebook App ID and Secret in Super Socializer > Social Login section in admin panel for Facebook Login to work

Specify GooglePlus Client ID and Secret in Super Socializer > Social Login section in admin panel for GooglePlus Login to work

%d bloggers like this: