వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్

హలో, AP WEB ACADEMY కి స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన కొన్నివేల రూపాయలు మీకు తెచ్చిపెట్టగల టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్. అవును మీరు ఒకసారి మీకేమీ వచ్చో దానితో వీడియో కోర్స్ తయారు చేస్తే అది మీకు లైఫ్ టైం ఇన్ కమ్ ఇస్తుంది. వినటానికి బానే ఉంది కానీ, మన వీడియో కోర్స్ కి UDEMY ఎందుకు డబ్బులు ఇస్తుంది? అసలు ఈ UDEMY అంటే ఏమిటి? ఇవే కదా ఇప్పుడు మీ ప్రశ్నలు! సరే, మనం ప్రశాంతంగా అసలు ఇదంతా ఏమిటో వివరంగా చూద్దాం.

మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చూడగలరు.

వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్

1.UDEMY అంటే ఏమిటి?

  1. ఇది ఒక ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాటుఫామ్. ఇది యూజర్స్ కి తమకిష్టమైన కోర్స్ లను తయారు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
  2. UDEMY మిగతా ఆన్ లైన్ లెర్నింగ్ వెబ్ సైట్ లైన edX, Cousera మరియు Khan Academy మొదలైన ఆన్ లైన్ లెర్నింగ్ వెబ్ సైట్స్ కంటే ప్రొఫషనల్ గా మంచి కోర్స్ లను తమ యూజర్స్ కి అందిస్తుంది.
  3. అంటే తన యూజర్స్ కి UDEMY ఆన్ లైన్ కోర్స్ ల ద్వారా కాకుండా ఒక కోర్స్ కి వాళ్ళు సబ్ స్క్రైబ్ ఐతే వాళ్లకు లైఫ్ టైం యాక్సస్ ని ఇస్తుంది.
  4. అంతే కాకుండా తమ యూజర్స్ కి అంటే టీచ్ చేసే వాళ్లకి, మరియు నేర్చుకునే వాళ్లకి UDEMY అద్భుతమైన యూజర్ ఇంటర్ పేస్ ని అందిస్తుంది.
  5. UDEMY ఫ్రేమ్ వర్క్ వెనక ఉన్న ఐడియా తమ కస్టమర్స్ యొక్క ఎంప్లోయబిలిటీ ని ప్రోత్సహించడమే!
  6. Eren Bali, Oktay Caglar, మరియు Gagan Biyani 2010 లో UDEMY ని స్థాపించడం జరిగింది.
  7. ప్రస్తుతం 2017 లో UDEMY లో అన్ని రకాల కస్టమర్స్ కి ఉపయోగపడే 45000 లకు పైగా ప్రొఫషనల్ కోర్స్ లు ఉన్నాయ్.
  8. ఉదాహరణకు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడే ఈ కోర్స్ ను గమనించండి. The Complete Ethical Hacking Course: Beginner to Advanced!
  9. UDEMY తన కస్టమర్స్ కి ఏ కోర్స్ నైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకొనే అవకాశాన్ని కలిగిస్తుంది.
  10. ఎందుకంటె UDEMY కి ఒక ఆండ్రాయిడ్ మరియు IOS అప్లికేషన్స్ ఉన్నాయ్.

2.UDEMY ఎలా పని చేస్తుంది?

Udemy

ఒక టీచర్ గా మీరు ఉపయోగించుకోవాలనుకుంటే

  1. UDEMY మీకు ఒక అద్భుతమైన యూజర్ ఇంటర్ పేస్ ప్లాటుఫామ్ ని ఇస్తుంది.
  2. దానితో మీరు ఎటువంటి కోర్స్ నైనా తయారు చేయవచ్చు.
  3. కోర్స్ డెవలప్మెంట్ టూల్స్ తో మీరు మీ కోర్స్ ని మీకు కావలసిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు.
  4. వారు మీ కోర్స్ ని మరింత వినూత్నంగా మరియు ఆకర్షణీయంగా తయారు చేస్తారు.
  5. వారు ఇచ్చే టూల్స్ తో మీరు మీ కోర్స్ కి సంబంధించి వీడియో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పిడిఎఫ్, ఆడియో, జిప్ ఫైల్స్ మరియు లైవ్ క్లాసెస్ రూపంలో అందించవచ్చు.
  6. దీని వల్ల స్టూడెంట్స్ కి మామూలు క్లాస్ రూమ్ లో నేర్చుకున్న దానికన్నా తేలికగా తమకిష్టమైన సమయం లో తమకిష్టమైన చోట కావలసిన విధంగా నేర్చుకునే వీలుంటుంది.
  7. ఒక వీడియో కోర్స్ క్రియేట్ చేసాక అది UDEMY మార్కెట్ ప్లేస్ లో కొన్ని లక్షలమంది యూజర్స్ ముందు కనపడుతుంది.
  8. అంతే కాక క్రియేట్ చేసిన వారు ఎవరైనా ఈ కోర్స్ లను తమకు కావలిసిన వారితో షేర్ చేసుకోవచ్చు.
  9. అంతే కాక UDEMY మీ కోర్స్ సరైన ఆడియన్స్ ని రీచ్ అవ్వడానికి కావలిసిన మార్కెటింగ్ గైడ్ గా కూడా సపోర్ట్ చేస్తుంది.

ఒక స్టూడెంట్ గా మీరు ఉపయోగించుకోవాలనుకుంటే

  1. స్టూడెంట్స్ ఒక యూజర్ అకౌంట్ ని క్రియేట్ చేసుకొని తమకు కావలసిన కోర్స్ కి ఎన్ రోల్ కావచ్చు.
  2. మీకు ఏ కోర్స్ కావాలో చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు.
  3. లేదా మీకు కావలిసిన కోర్స్ కోసం సెర్చ్ చేసుకోవచ్చు.
  4. స్టూడెంట్స్ ఎన్ రోల్ చేసుకొన్న కోర్స్ లకు లైఫ్ టైం యాక్సస్ ఉంటుంది.
  5. మీరు వీటిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూడొచ్చు.
  6. యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్స్ స్టూడెంట్స్ కి తమ కోర్స్ ను ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సస్ చేయడంలో మరింత సహాయపడతాయి.
  7. మొబైల్ అప్లికేషన్స్ స్టూడెంట్స్ తమ కోర్స్ ని డౌన్ లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ లో చూడ్డానికి బాగా సహాయ పడతాయి.
  8. దీని వల్ల స్టూడెంట్స్ కి అధిక డేటా చార్జీల భారం ఉండదు. ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు.
  9. ఇంకో గొప్ప విషయమేమిటంటే ఒక వేళ స్టూడెంట్స్ కి తమ కోర్స్ అంత ఉపయోగకరంగా లేకపోతె తాము ఎన్ రోల్ చేసుకున్న కోర్స్ నుండి బయటకు వచ్చేసి తమ కోర్స్ ఎన్ రోల్ మెంట్ అమౌంట్ ని తిరిగి రిఫండ్ పొందే అవకాశం ఉంది.
  10. రిఫండ్ పొందడానికి 30 రోజుల వరకు అవకాశం ఉంటుంది.

ఇంతకూ మనం వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్ పొందటాలంటే ఏమి చెయ్యాలి?

Learn to make a game!

  1. ముందుగా మీరు UDEMY లో ఒక అకౌంట్ ను రిజిస్టర్ చేసుకోవాలి.ముందుగా మీరు ఒక అకౌంట్ ను రిజిస్టర్ చేసుకోవాలి.
  2. తర్వాత మీకున్న స్కిల్స్ తో మీరు ఒక కోర్స్ ని తయారు చెయ్యాలి.
  3. మీరు మీ కోర్స్ యొక్క ప్రైస్ $20 నుండి $200 వరకు మీ ఇష్టప్రకారం నిర్ణయించ వచ్చు.
  4. UDEMY మీ కోర్స్ రెవిన్యూ షేర్ ఈ క్రింద పరిస్థితి ని బట్టి ఉంటుంది.
  5. ఉదాహారణకు UDEMY వెబ్ సైట్ కి వచ్చిన స్టూడెంట్ కి మీ కోర్స్ నచ్చి అతను దాన్ని కొన్నాడనుకోండి. అప్పుడు UDEMY 50% తీసుకోని మీకు 50% ఇస్తుంది.
  6. ఒక వేళ ఒక స్టూడెంట్ మీ కూపన్ కోడ్ ద్వారా మీ కోర్స్ ని కొన్నాడనుకోండి. మీకు 97% ఇచ్చి UDEMY 3% మాత్రమే తీసుకుంటుంది.

ఒక రకంగా చెప్పాలంటే మనం ఏ విషయాన్ని ఐన దాని గురించి మనకేమి తెలియకపోయిన దాని పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే UDEMY గొప్ప గొప్ప నిపుణుల ద్వారా రూపొందించబడిన కోర్స్ ల రూపంలో అతి తక్కువ ధరలకే అందిస్తుంది. నిజం గా UDEMY తమ కోర్స్ ల ద్వారా ఎంతో మంది ప్రొఫషనల్ ని తయారు చేయడమే కాక తిరిగి మళ్ళి వారే టీచర్లు గా మారి UDEMY ద్వారా అద్భుతమైన లైఫ్ టైం ఇన్ కమ్ పొందడానికి వారి జీవితాలను మెరుగు పరుచు కోవడానికి సహాయ పడింది.

IT Certification Category (English)728x90

మీలో యెంత మంది మీ వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్ పొందడానికి రెడీ అయ్యారో మరియు ఎంతమంది ఆల్రెడీ ఇన్ కమ్ పొందుతున్నారో ఈ క్రింద కామెంట్ల రూపంలో తెలియ జేయండి.

మీకు ఇంకా వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్ అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి

Summary
వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్
Article Name
వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్
Description
వీడియో కోర్స్ తో UDEMY ద్వారా లైఫ్ టైం ఇన్ కమ్. వినటానికి బానే ఉంది కానీ, మన వీడియో కోర్స్ కి UDEMY ఎందుకు డబ్బులు ఇస్తుంది? అసలు ఈ UDEMY అంటే ఏమిటి?
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don’t have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that’s why you’re read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: