వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? గురించి ముందుగా చిన్న మాట.

హాయ్, ap web academy కి స్వాగతం. ముందుగా వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే కాన్సెప్ట్ ను నా మొదటి పోస్ట్ గా స్టార్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. మీరు నా గురించి వివరంగా తెలుసు కోవాలను కుంటే అబౌట్ పేజీ ని చూడగలరు.

నేను వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే కాన్సెప్ట్ ను నా మొదటి పోస్ట్ గా ఎనుచుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది.

ఈ రోజు దాదాపుగా ప్రతి ఒక్కరు వెబ్ ను సులభంగా వాడుతున్నారు. కానీ, వాడే వారిలో యెంత మందికి వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే విషయం తెలుసు?

అలాగే మరో ముఖ్యమైన విషయం, నా సైట్ యొక్క ప్రధమ ఉద్దేశం వెబ్ కాన్సెప్ట్స్ ను స్టెప్ బై స్టెప్ గా అందించడం. రీడర్స్ అందరు వెబ్ కాన్సెప్ట్స్ ను చక్కగా అర్ధం చేసుకోవాలంటే ముందుగా వారికి వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అనే విషయం కచ్చితంగా తెలిసి ఉండాలి. ఫై రెండు కారణాల చేత నేను ఈ విషయాన్ని నా మొదటి పోస్ట్ గా ఎంచు కోవడం జరిగింది.

ఇక మరి మనం మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళదాం.

వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

వెబ్ అంటే ఇంటర్నెట్ సర్వర్స్ సిస్టం. సర్వర్ అంటే అది చాలా ఎక్కువ ప్రమాణాలతో కాన్ఫిగర్ చేయబడిన ఒక హెవీ సూపర్ కంప్యూటర్. వెబ్ లేదా వెబ్ సైట్ లేదా వెబ్ పేజీ అనేవి వెబ్ బ్రౌజర్ ద్వారా కానీ సంబధిత అప్ ద్వారా కానీ మనం యాక్సెస్ చేయ గలుగుతాము. సర్వర్లు ప్రత్యేకముగా ఫార్మాట్ చేయబడిన డాకుమెంట్స్ ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఆ డాకుమెంట్స్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా ఫార్మాట్ చేయబడతాయి. ఆ మార్కప్ లాంగ్వేజ్ ను html అంటారు. html అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్.

html లింక్స్, ఇతర డాకుమెంట్స్, గ్రాఫిక్స్, ఆడియో, వీడియో, మరెన్నో రకాల ఫైల్స్ ను సపోర్ట్ చేస్తుంది. సర్వర్లు ఫార్మాట్ చేయబడిన డాక్యూమెంట్ల ను ప్రాసెసింగ్ చేసి మనకు వెబ్ పేజీలు గా, వెబ్ సైట్ లు గా వెబ్ బ్రౌజర్ లో అందిస్తాయి.

నాకు వెబ్ అంటే ఏమిటో తెలిసింది ? నేను ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.

యెప్పుడైన మనం ఒక వెబ్ పేజీ ని చూడాలనుకుంటే మనం దాని పేరును మన బ్రౌజర్ లో టైపు చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి.ప్రతి ఒక్క వెబ్ పేజీ కి ఒక సెపరేట్ అడ్రస్ ఉంటుంది. ఈ సెపరేట్ అడ్రస్ లేదా పేరు నే మనం డొమైన్ నేమ్ లేదా URL అంటాం.

URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్.

మనం బ్రౌజర్ అడ్రస్ బార్లొ URL ఎంటర్ చేసాక కీబోర్డ్ లోని ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తాం. అప్పుడు బ్రౌజర్ మన రిక్వెస్ట్ ను ఆ URL యొక్క హోస్టింగ్ సర్వర్ కు తీసుకువెళుతుంది. సర్వర్ బ్రౌజర్ యొక్క రిక్వెస్ట్ ను ప్రాసెస్ చేసి ఆ URL కు సంబందించిన రా వెబ్ సైట్, లేదా రా వెబ్ పేజీ ని కానీ వెతికి, దానిని బ్రౌజర్ కి పంపిస్తుంది. బ్రౌజర్ దానిని ప్రాసెస్ చేసి మనం చూడగలిగే విధంగా ఆ వెబ్ సైట్ ను కానీ, వెబ్ పేజీని కానీ మన ముందుకు తీసుకు వస్తుంది.

ఉదాహరణ:-మీరు GOOGLE .COM అనే URL ను మీ బ్రౌజర్ అడ్రస్ బార్ లో టైపు చేసినట్లయితే, ఎంటర్ నొక్కాక బ్రౌజర్ మీ యొక్క రిక్వెస్ట్ ను గూగుల్ హోస్ట్ చేయబడిన సర్వర్ కు చేరవేస్తుంది. ఆ సర్వర్ బ్రౌజర్ రిక్వెస్ట్ ను ప్రాసెస్ చేసి సంబంధిత రా ఫైల్స్ ను బ్రౌజర్ కు చేరవేస్తుంది. బ్రౌజర్ ఆ ఫైల్స్ ను ప్రాసెస్ చేసి మనం చూడ గలిగే విధంగా వాటిని మనకు చూపిస్తుంది.

ఈ కింద ఇమేజ్ ను గమనించ గలరు.

googe image for వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?
google URL in web browser address bar

మీరు ఈ పోస్ట్ ద్వారా వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? అనే విషయాలకు సంబంధించిన బేసిక్స్ ను నేర్చుకున్నారని భావిస్తున్నాను. మరియు ఇప్పుడు మీరు బ్రౌజింగ్ చేసేటప్పుడు మరింత తేలికగా బ్రౌజింగ్ చేయటానికి ఆవకాశం ఉంది.

వెబ్ అంటే ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని అనుకొంటున్నాను. మీకు  మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా బ్లాగ్ ను ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

AP WEB ACADEMY ని విజిట్ చేసినందుకు కృతఙ్ఞతలు. నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చూడగలరు.

read this post in english.

Summary
వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?
Article Name
వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?
Description
ఈ రోజు దాదాపుగా ప్రతి ఒక్కరు వెబ్ ను సులభంగా వాడుతున్నారు. కానీ,వాడే వారిలో యెంత మందికి వెబ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే విషయం తెలుసు?
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love
  • 2
    Shares

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

Specify Facebook App ID and Secret in Super Socializer > Social Login section in admin panel for Facebook Login to work

Specify GooglePlus Client ID and Secret in Super Socializer > Social Login section in admin panel for GooglePlus Login to work

%d bloggers like this: