సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా?

హలో, AP WEB ACADEMY కి స్వాగతం, ఈ రోజు మనం మీరు రోజు సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా? అనే విషయం గురించి తెలుసుకుందాం. మీరెప్పుడైనా మీ పేస్ బుక్ అకౌంట్ కి లోగో ని క్రియేట్ చేసుకున్నారా? మీరు ఎప్పుడైనా సరదాగా వీడియో ని తయారు చేశారా? మీరు ఎప్పుడైనా, ఏదన్నా విషయానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారా? ఎప్పుడైనా ఎవరికయినా ఏదన్నా సమస్యలో సరైన సలహా ఇచ్చారా? ఇలాంటి వాటిని మీరు ఇప్పటికే చాలా చేశారా? మీ ఆన్సర్ అవును ఐతే మీరు ఇప్పటికే చాలా ఇన్ కం లాస్ ఐయ్యారు! ఆశ్చర్యపోతున్నారా? నేను చెప్పేది నమ్మబుద్ది కావటం లేదు కాదు! సరే, ఈ ఆర్టికల్ ను మీరు చివరి వరకు అర్ధం చేసుకొని చదవండి. నేనేమి చెపుతున్నానో మీకు అర్ధం అవుతుంది.

మీరు నా గురించి తెలుసు కోవాలనుకుంటే అబౌట్ పేజీ కి వెళ్ళండి.

సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా?

మీరు మీ ప్రస్తుత ఇన్ కం సోర్స్ మీ అవసరాలకు సరిపోక స్ట్రగుల్ అవుతున్న, ఇంటర్నెట్లో ఇన్ కం ఎర్న్ చెయ్యాలనుకొని రకరకాల ఫేక్ వెబ్ సైట్స్ లో మీ సొమ్ము పోగొట్టుకొని ఉన్న. మీరు సరైన ఆర్టికల్ ని చదువుతున్నట్లే! ఐతే నేనిప్పుడు చెప్పేది అటువంటి సైట్ కాదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా AP WEB ACADEMY తన యూజర్స్ కి ఫేక్ లేదా ఫాల్స్ వెబ్ సైట్స్ గురించి అసలు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వదు. అంటే మోసపూరితమైన కొన్ని ptc, RICH quick, లాంటి సైట్ లను ఎప్పుడు ప్రమోట్ చెయ్యదు. కేవలం మీరు మీ టాలెంట్ తో చేసే పనికి వచ్చే ఇన్ కం సోర్సెస్ గురించి మాత్రమే చెప్తుంది.

మనం పైన చెప్పుకున్న విషయాలు అన్నిటితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోగలిగే ఒక అద్భుతమైన వెబ్ సైట్ గురించి తెలుసుకుందాం. ఆ వెబ్ సైట్ ఒక ఫ్రీలాన్స్ వెబ్ సైట్. దాని పేరు FIVERR. మీరు ఈ వెబ్ సైట్ లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా కేవలం మీ టాలెంట్ తో, మీరు రోజు సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం.

Fiverr అంటే ఏమిటి?

 • FIVERR ఒక అద్భుతమైన ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్.
 • ఇది పూర్తిగా ఫ్రీలాన్స్ కమ్యూనిటీ తో పనిచేస్తుంది.
 • ఇది మీ రొటీన్ వర్క్ ని ప్రొఫషనల్ గా మార్చుకొని మీరు లైఫ్ టైం UNLIMITED ఇన్ కం పొందడానికి కావలిసిన అవకాశాలను ఇస్తుంది.
 • మీరు ఏ విధమైన పెట్టుబడి లేకుండా మరియు మీ దిన చర్య కు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు ఈ ఆర్టికల్ చదివి ఇదేంటో అర్ధం చేసుకున్న మరు క్షణం నుండే ఎర్నింగ్ స్టార్ట్ చేయవచ్చు.

ఇదెలా పని చేస్తుంది?

 • fiverr ఎలా పని చేస్తుందో మీకు ఒక్కసారి అర్ధమైతే మీరు చాలా తేలికగా ఎర్నింగ్ మొదలు పెడతారు.
 • దీనికి ముందుగా మీకు కావలిసినది ఒక యూజర్ అకౌంట్.
 • ఇది కేవలం ఒక్క నిమిషం పని.
 • అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఫ్రీలాన్సర్ గా ఏమిచేయగలరో వివరిస్తూ ఒక GIG తయారు చెయ్యాలి.దాని     ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ లో  పోస్ట్ చెయ్యాలి.
 • GIG అంటే మీరు ఏమి చేయగలరో చెప్పే ఒక సర్వీస్ డిస్క్రిప్షన్ లాంటిదన్నమాట!
 • దాని చూసి అవసరమైన వాళ్ళు మీ GIG ను లేదా మీ సర్వీస్ ను హైర్ చేసుకుంటారు.
 • అలాగే మీరు మీకు కావలిసిన GIGS ఇచ్చే ఫ్రీలాన్సర్స్ ను హైర్ చేసుకోవచ్చు.
 • మీ అసైన్మెంట్ ను వారికి తెలియజేస్తే వారు ఒప్పంద సమయం లో దీన్ని పూర్తి చేసి ఇస్తారు.

fiverr ద్వారా మీరు రోజు సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా?

ఇంకా వివరంగా చెప్పాలంటే How to make money with Fiverrfiverr ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవడం ఎలా? ఇదే కదా! ఇప్పుడు మీరు ఆలోచిస్తుంది?

 • fiverr ద్వారా మీరు ఇన్ కం ఎర్న్ చేసుకోవటానికి మీకు ఏ విధమైన కాలేజీ డిగ్రీ లేదా మరే విధమైన సర్టిఫికెట్స్ అడగదు.
 • కేవలం మీకు ఏ విషయం లోనైనా మంచి అవగాహన ఉండి ఆన్ లైన్ ఇన్ కం ఎర్న్ చేయాలనే కోరిక ఉంటె చాలు.
 • మొట్టమొదట మీకు కావలసినది మీకేమి వచ్చో మీరు దానిని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి, మీ మీద మీరు మంచి కాంఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి.
 • ఒక్క సారి మీకు నమ్మకం కుదిరాక మీరు మీ GIG క్రియేట్ చేసి దాన్ని పోస్ట్ చెయ్యండి.
 • మీరు మీ GIG క్రియేట్ చేసేటప్పుడు కొంచెం కాన్సంట్రేషన్ తో దాన్ని ఎంప్లోయర్ ని అట్టాక్ట్ చేసే విధంగా డిజైన్ చెయ్యాలి.
 • మీరు మీ GIG కి ఒక మంచి టైటిల్ మరియు అర్ధవంతమైన డిస్క్రిప్షన్ ను రాయాల్సి ఉంటుంది.
 • మీ GIG కి సంబంధించిన ఒక మంచి ఇమేజ్ ను దానికి జత చేయవలిసి ఉంటుంది.
 • మీరు అక్కడ పూర్తి చేయవలిసిన అన్ని విషయాలను జాగ్రత్తగా పూర్తి చెయ్యండి.

ఎందుకంటె మీరు ఈ ఒక్కసారి చేసే పనితో లైఫ్ టైం ఇన్ కం సంపాదించుకోవచ్చు. సాధారణంగా FIVERR లో GIGS అన్ని కూడా $5 నుండి స్టార్ట్ అవుతాయి. మీరు చేసే పనిని బట్టి దానిని మీరు ఎక్సపెక్ట్ చేసే ధరతో డిజైన్ చేసుకోవచ్చు.

Fiverr.com

FIVERR ద్వారా ఫ్రీలాన్సర్స్ ని హైర్ చేసుకోవడం ఎలా?

కొన్ని వేల అద్భుతమైన FIVERR GIGS లేదా ఫ్రీలాన్సర్స్ నుండి మీకు కావలిసిన GIG లేదా ఫ్రీలన్సర్ ని సెలెక్ట్ చేసుకోవడమంటే ఒక రకంగా కష్టమైన పనే. ఐతే మీరు కొన్ని విషయాలను ఫాలో ఐతే మాత్రం మీ పని తేలికగా అయిపోతుంది.

 • మీరు హైర్ చేసుకోవడానికి ముందుగా ఆ ఫ్రీలాన్సర్ యొక్క రేటింగ్ ను గమనించండి.
 • అలాగే అది ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చెయ్యడం ద్వారా వచ్చిందో గమనించండి.
 • వారి GIGS గురించి యూజర్స్ రాసిన రివ్యూస్ ని చెక్ చెయ్యండి.
 • ఇవన్నీ పరిశీలుస్తు ఉండగానే మీకు కావలిసిన కొంతమంది ఫ్రీలాన్సర్స్ మీకు లభ్యమవుతారు.
 • మీకు వారు చేసే పని మరియు దాని వివరాలు నచ్చితే మీకేమో కావాలో అది వారు చేయగలరో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఒక మెసేజ్ చెయ్యండి.
 • ఒక వేళ వారు రిప్లై లో ఇచ్చిన ఎక్సప్లయినషన్ మీకు నచ్చితే మీరు వారి GIG ని కొనవచ్చు.
 • ఒక వేళ మీ GIG ఎక్కువ ఖరీదైనది ఐతే ముందు వారిని కొంటె ట్రయిల్ వర్క్ చేసిమ్మనండి.
 • వారు వర్క్ మీకు నచ్చితే మీరు నిరభ్యరంతరంగా ప్రొసీఈటీ అవ్వొచ్చు.

మీరు మీ ఇన్ కం సరిపోక స్ట్రగుల్ అవుతున్న, మీ దినచర్య కు ఇబ్బంది లేకుండా, మీరు సరదాగా చేసే పనిని ప్రొఫెషనల్ గా చేసి పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఇన్ కం కావాలన్న, లేదా మీకు సంబంధించిన ఏదయినా వర్క్ కి ఒక మంచి ఫ్రీలాన్సర్ ని లేదా GIG ని హైర్ చేసుకోవాలన్న అన్నిటికి మీకు సమాధానం దొరికే ఒకే చోటు FIVERR మాత్రమే.

Fiverr.com

మీలో ఎంతమంది సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా? చదివాక ఇన్ కం ఎర్నింగ్ చేశారో, చేస్తున్నారో నాకు Comment రూపంలో తెలియ జేయండి.

మీకు ఇంకా సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి

Summary
సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా
Article Name
సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా
Description
సరదాగా చేసే పనితో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా? మీరెప్పుడైనా మీ పేస్ బుక్ అకౌంట్ లోగో ని క్రియేట్ చేసుకున్నారా? మీరు ఎప్పుడైనా సరదాగా వీడియో
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love
 • 120
  Shares

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: