సైబర్ క్రైమ్ అంటే ఏమిటి?

Ap Web Academy కి స్వాగతం. ఈ రోజు మనం ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే సైబర్ క్రైమ్ అంటే ఏమిటి? నాకు తెలిసి మీరు ఈ పదాన్ని ఇంతకూ ముందు వినే వుంటారు. ఏదో కంప్యూటర్ కి సంబంధించి క్రైమ్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేసారని వినే ఉంటారు  ప్రసుతం ఇంటర్నెట్ ప్రపంచంలో అనేక రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ నెట్ యూజర్ గా మీరు ఒక్కో సారి వాటిలో చిక్కుకొనే అవకాశం ఉంది. ఇలా జరగడానికి రెండు కారణాలు.ఒకటి వాళ్ళేమి చేస్తున్నారో వాళ్లకి తెలియకపోవడం. రెండవది సైబర్ క్రైమ్స్ గురుంచి తెలియక పోవడం. ఆలా జరగకుండా ఉండాలంటే అసలు మీకు సైబర్ క్రైమ్ అంటే ఏమిటి? అనే విషయం గురించి తప్పని సరిగా తెలుసుకోవాలిసిన అవసరం ఉంది.

మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

సైబర్ క్రైమ్ అంటే ఏమిటి?

సైబర్ క్రైమ్ అంటే ఒక రకంగా మోసం లేదా దొంగతనం. ఆశ్చర్యంగా ఉంది కాదు! అదెలాగో చూద్దాం.

సైబర్ క్రైమ్ అంటే.

  1. మీరు ఇతరులకు సంబంధించిన డేటా కానీ డాకుమెంట్స్ కానీ అంటే ఐడెంటిటీ థెఫ్ట్ కానీ చేయడం.
  2. వైరస్ లను క్రియేట్ చేయడం వాటిని స్ప్రెడ్ చేయడం.
  3. ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు కానీ , ఎటిఎం సంబంధించిన వ్యవహారాలలో లేదా ఎలక్ట్రానిక్ మనీ లాండరింగ్ వ్యవహారాలలో చీటింగ్ చేయడం.
  4. ఇతరులకు సంబంధించిన కంప్యూటర్స్ లేదా వెబ్ అకౌంట్స్ లోకి ప్రవేశించడం లేదా ప్రయత్నించడం అంటే పాలసీ వయోలేషన్ చేయడం.
  5. ఫిషింగ్.
  6. స్పూఫింగ్
  7. స్పామింగ్.
  8. స్కామింగ్.
  9. కాపీరైట్ ఇన్ ఫ్రిన్గ్ మెంట్.
  10. ఇంకా మరెన్నో.

పైన చెప్పిన వాటిలో ఏ ఒక్క పొరపాటు చేసిన అది సైబర్ క్రైమ్ కిందికే వస్తుంది.

ఇప్పుడు మనల్ని మనం సైబర్ క్రైమ్ నుండి కాపాడుకోవడం ఎలా?

1.మీరు ఇతరులకు సంబంధించిన డేటా కానీ డాకుమెంట్స్ కానీ అంటే ఐడెంటిటీ థెఫ్ట్ కానీ చేయడం.

  • మీ ఫ్రెండ్ పర్మిషన్ లేకుండా వారికి సంబంధించిన వెబ్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వడం అతని పేరుతొ ఆ అకౌంట్ ని మీరు వాడుకోవడం. లేదా ఆలా చేయడానికి ప్రయత్నించడం.
  • మీ కోలిగ్ పర్మిషన్ లేకుండా వారి కంప్యూటర్ను వాడుకోవడం అందులోని డేటా కాపీ చేసుకోవడం లేదా మార్చివేయడం మరియు ఆలా చేయడానికి ప్రయత్నించడం.
  • ఇతరులకు చెందినది లేదా వారి పేరుమీద కానీ వారికి సంబంధించినది కానీ దేన్నయినా వారి పర్మిషన్ లేకుండా వాడుకోవడం.

2.వైరస్ లను క్రియేట్ చేయడం వాటిని స్ప్రెడ్ చేయడం

  • ప్రమాదకరమైన వైరస్ లు, ట్రోజాన్స్, మాల్ వేర్స్ మరియు వాటికి సంబంధించిన సాఫ్ట్ వేర్స్ తయారు చేయడం
  • వాటిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించడం.
  • ఇతర వినియోగదారులకు సంబంధించిన కంప్యూటర్స్, వెబ్ సైట్స్ హ్యాకింగ్ చేయడానికి ప్రయత్నించడం.

3.ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు కానీ , ఎటిఎం సంబంధించిన వ్యవహారాలలో లేదా ఎలక్ట్రానిక్ మనీ లాండరింగ్ వ్యవహారాలలో చీటింగ్ చేయడం.

  • ఎవరైనా ఫిజికల్ షాప్ లో కానీ లేదా ఆన్ లైన్ లో కానీ ఏదయినా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా కొనడానికి ప్రయత్నించినప్పుడు వారిని మోసం చేయడం.
  • ఇతరుల ఆన్ లైన్ బ్యాంకింగ్ కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ వంటి వాటిని దొంగిలించడం, వాడుకోవడం లేదా అందుకు ప్రయత్నించడం.
  • క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లను దొంగిలించడం లేదా అందుకు ప్రయత్నించడం.
  • ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ లో నిర్దేశిత బిల్లింగ్ రేట్లు మరియు టాక్స్ కన్నా ఎక్కువగా బిల్లింగ్ చేయడం లేదా అందుకు ప్రయత్నించడం.

4.ఇతరులకు సంబంధించిన కంప్యూటర్స్ లేదా వెబ్ అకౌంట్స్ లోకి ప్రవేశించడం లేదా ప్రయత్నించడం అంటే పాలసీ వయోలేషన్ చేయడం.

  • ఇది మనం మొదటి స్టెప్ లో చెప్పుకున్న లాంటిదే.
  • ఎప్పుడు కూడా ఇతరులకు సంబంధించిన దాన్ని దేన్నీ మీరు ఉపయోగించుకోవద్దు.
  • ఒకవేళ మీరు తప్పని సరిగా ఇతరులకు సంబంధించినది అకౌంట్, కంప్యూటర్ లాంటిది అది ఏదయినా సరే వాడుకోవలసి వస్తే వారి పర్మిషన్ తప్పకుండా తీసుకోండి.

5.ఫిషింగ్

  • ఇంటర్నెట్ యూజర్స్ కి మోసపూరిత ఇమెయిల్స్ పంపి వాటి ద్వారా వారి వివరాలు లేదా మరేదయినా సమాచారం సేకరించడానికి ప్రయత్నించడం.
  • మీరు ఎవరో తెలియకుండా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, ఇతరులను ఇబ్బందికర టాపిక్ లేదా కామెంట్ లతో ఇబ్బంది పెట్టడం.
  • ప్రముఖ బ్రాండ నేమ్ ల పేరుతొ మెయిల్స్,మెస్సేజెస్ పంపడం ద్వారా యూజర్స్ ను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడం లేదా అందుకు ప్రయత్నించడం.

6.స్పూఫింగ్

  • ప్రసిద్ధి చెందిన వీడియోలు లేదా ఫోటోలకు స్పూఫ్ క్రియేట్ చేయడం.
  • యూజర్స్ ను బ్రాండ్ నేమ్స్ పేరుతొ స్పూఫ్ అకౌంట్స్ ద్వారా మోసం చేయడం.
  • ఒక్క మాటలో చెప్పాలంటే పేరు పొందిన వాళ్లకు సంబందించిన దేన్నయినా ఇమిటేట్ చేయడం లేదా అందుకు ప్రయత్నించడం.

7.స్పామింగ్

  • ఇబ్బందికర ఇమెయిల్స్ లేదా కామెంట్స్ తో యూజర్స్ ను ఇబ్బంది పెట్టడం.
  • ట్రోజాన్స్, వైరస్, మాల్ వేర్ లతో ఉన్నటువంటి మెయిల్స్ పంపించడం లేదా అందుకు ప్రయత్నించడం.
  • వాటి ద్వారా యూజర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నించడం.
  • యూజర్స్ పర్మిషన్ లేకుండా వారికి ప్రమోషనల్ ఆఫర్స్ మరియు న్యూస్ లెటర్స్ వంటివి పంపించడం.

8.స్కామింగ్

  • ప్రజలను మోసపూరిత ఆఫర్స్ తో నమ్మించడం.
  • వారికి సంబందించిన ఎలక్ట్రానిక్ ఫండ్ లేదా విలువైన డిజిటల్ వస్తువులను వారి పర్మిషన్ లేకుండా వాడుకోవడం, అమ్మడం, కొనడం.
  • ఆఫర్స్ లేదా ప్రమోషన్స్ లో ప్రకటించిన వాటిని యూజర్స్ కి ఇవ్వకపోవడం.

9.కాపీరైట్ ఇన్ ఫ్రిన్గ్ మెంట్.

  • ఇతరులకు సంబంధించిన బ్రాండ్ నేమ్ వారి పర్మిషన్ లేకుండా వాడుకోవడం.
  • పేరు పొందిన సాఫ్ట్ వేర్ లేదా టూల్స్ వారి పర్మిషన్ తీసుకోకుండా వాడుకోవడం లేదా అందుకు ప్రయత్నించడం.
  • ఇతరులకు సంబంధించిన కంటెంట్ అంటే ఆడియోస్, వీడియోస్, ఆర్టికల్స్, ఇమేజెస్ వంటి వాటిని పర్మిషన్ తీసుకోకుండా వాడుకోవడం.

10.ఇంకా మరెన్నో

  • మీరు ఇంటర్నెట్ లో మీది కానిది ఏదయినా సంబంధిత వ్యక్తుల పర్మిషన్ లేకుండా వదినా లేదా ప్రయత్నించినా అది సైబర్ క్రైమ్ అవుతుంది.
  •  అవతలి వారికి వారికి ఇష్టం లేని మెయిల్స్, మెసేజెస్, పోస్ట్స్, కామెంట్స్, ఆడియోస్, వీడియోస్, ఇమేజెస్ వంటివి పంపడం వాటి ద్వారా వారిని ఇబ్బంది పెట్టడం కూడా సైబర్ క్రైమ్ కిందికే వస్తుంది.
  • మీరు ఎవరినైనా మీ ఆక్టివిటీ ద్వారా రెచ్చగొట్టడం లేదా అవమానించడం లేదా బాధపెట్టడం కూడా సైబర్ క్రైమ్ కిందికే వస్తుంది.

ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నారు? ఇదంతా తెలియక మీరు కూడా వీటిలో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటారని మరియు ఇప్పుడు చేస్తున్నారని కదా? ఇప్పుడు మీకు ఈ ఆర్టికల్ మొదట్లో నేను చెప్పిన మాట అంటే ఇంటర్నెట్ యూజర్ గా మీరు కూడా సైబర్ క్రైమ్ చేయడానికి అవకాశం ఉంది అని నేను చెప్పిన మాట గుర్తుకు వస్తుందా?

మరేమి పర్వాలేదు! మీరు చాలా లక్కీ. అందువల్లే ఎవరు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. సో, మీరు ప్రస్తుతానికి సేఫ్ గా ఎస్కేప్ అయినట్టే. కానీ ఫ్యూచర్ సంగతేమిటి? ఇప్పుడు తెలిసింది కాబట్టి, ఇకనుండి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నా సజెషన్ ఏమిటంటే ఇంటర్నెట్ ను ఎప్పుడు కూడా తప్పు పనులకు ఉపయోగించవద్దు. ఒక జెంటిల్ మెన్ లాగ వాడండి. దాని ద్వారా సమాచారాన్ని, విజ్ఞానాన్ని పొందండి. కేవలం మీరు ఇంటర్నెట్ ను మీకు కావలిసిన సమాచారం పొందడానికి మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, విజ్ఞానాన్ని పొందడానికి వాడితే మీరు ఎట్టి పరిస్థిలో సైబర్ క్రైమ్ లో చిక్కుకోరు.

మీకు ఇంకా సైబర్ క్రైమ్ అంటే ఏమిటి అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఇలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
సైబర్ క్రైమ్ అంటే ఏమిటి?
Article Name
సైబర్ క్రైమ్ అంటే ఏమిటి?
Description
ఇంటర్నెట్ నెట్ యూజర్ గా మీరు ఒక్కో సారి వాటిలో చిక్కుకొనే అవకాశం ఉంది. ఇలా జరగడానికి రెండు కారణాలు.ఒకటి వాళ్ళేమి చేస్తున్నారో వాళ్లకి తెలియకపోవడం. రెండవది సైబర్ క్రైమ్స్ గురుంచి తెలియక పోవడం.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: