హ్యాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది?

హలో, Ap Web Academyకి స్వాగతం. ఈ రోజు మనం వెబ్ కాన్సెప్ట్ లలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఐన హ్యాకింగ్ గురించి తెలుసుకుందాం.సుమారుగా ఒకటి రెండు నెలల కాలం నుండి మనకు ఈ పదం తరుచుగా వినపడటం జరుగుతుంది. ఉదాహరణకు ఈ మద్యే జరిగిన మేజర్ సైబర్ అటాక్స్ ఐన ర్యాన్సమ్ వేర్, పెత్యా లాంటివి. మరియు అంతకు ముందు జరిగిన DDOS ఎటాక్ ఇంటర్నెట్ తో పరిచయం ఉన్న ఎవరం మరచిపోలేము.ఒక ఇంటర్నెట్ యూజర్ గా మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే మనకు ముందు తప్పని సరిగా హ్యాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది? అనే విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏ రోజు ఆర్టికల్ లో మనం వాటిని గురించి తెలుసుకుందాం.

మీరు నాగురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చూడగలరు.

హ్యాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది?

1.హ్యాకింగ్ అంటే ఏమిటి?

ఇప్పుడు మనం హాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది లోని మొదట ప్రశ్న హాకింగ్ అంటే ఏమిటి అనే విషయం నేర్చుకుందాం.

  • హాకింగ్ అంటే ఒకరకంగా చెప్పాలంటే హైజాకింగ్ అన్నమాట.
  • అవును ఉదాహరణకు కొంతమంది ఒక బస్సు ను కానీ ప్లేయిన్ ను కానీ హైజాక్ చేశారనుకోండి. అప్పుడేమి జరుగుతుంది?
  • వాళ్ళు ఆ బస్సు లేదా ప్లేయిన్ ను మరియు అందులోని ప్రయాణికులను సురక్షితంగా విడిచి పెట్టడానికి కొంత డబ్బును కానీ లేదా వాళ్లకి కావలసిన మరేదయినా డిమాండ్ చేస్తారు.
  • హ్యాకర్లు కూడా అదే చేస్తారు.
  • వాళ్లు ఒక కంప్యూటర్ లేదా వెబ్సైటు ను కానీ హాక్ చేసినప్పుడు వాటిని మరల సేఫ్ గా రిలీజ్ చేయడానికి అంటే ఆ కంప్యూటర్ లేదా వెబ్సైటు కి కానీ వాటిలోని డేటా ఫైల్స్ కి కానీ ఏ విధమైన హాని చేయకుండా మనకు తిరిగి యాక్సస్ ఇవ్వడానికి కొంతమొత్తం లో డబ్బు కానీ లేదా ఇతర డిమాండ్స్ కానీ కండిషన్ గా పెడతారు.
  • మనం వాటిని ఫుల్ ఫిల్ చేస్తేనే వాళ్ళు మనకు యాక్సస్ ఇస్తారు.
  • ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే వాళ్ళు మనం కావలసినవి అన్ని ఇచ్చిన వాళ్ళు మన ఫైల్స్ రిలీజ్ చేస్తారు అనే గ్యారంటీ ఏమి లేదు.

2.హ్యాకింగ్ ఎలా పని చేస్తుంది?

ఇప్పుడు మనం హాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది లోని రెండవ ప్రశ్న హ్యాకింగ్ ఎలా పని చేస్తుంది అనే విషయం నేర్చుకుందాం.

  • హ్యాకర్లు హ్యాకింగ్ చేయటానికి అవసరమైన ఎన్విరాన్మెంట్ ను ముందుగానే సెట్ చేసుకొంటారు.
  • ఒక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే హ్యాకింగ్ గురించి ఎథికల్ హ్యాకింగ్ అనే ఒక ఆథరైజ్డ్ కోర్స్ కూడా ఉంది.
  • ఈ కోర్స్ సక్సెస్ ఫుల్ గా పాస్ అయితే కోర్స్ సంబంధించిన అథారిటిస్ మీకు ప్రొఫషనల్ ఎథికల్ హ్యాకర్ గా సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
  • కానీ వారిని హ్యాకింగ్ అటాక్స్ నుండి వివిధ రకాలైన ఆర్గనైజషన్స్ ను కాపాడడానికి వారికి సర్టిఫికెట్ ఇస్తారు.
  • ఒక హ్యాకర్ తన హ్యాకింగ్ ఎన్విరాన్మెంట్ ను kali linux , VM PLAYER , RASPBERRY Pi లాంటి వివిధ రకాల హ్యాకింగ్ టూల్స్ తో సెట్ చేసుకుంటాడు.
  • హ్యాకర్లు ఒక కంప్యూటర్ ని కానీ లేదా కంప్యూటర్స్ నెట్వర్క్ ని కానీ టార్గెట్ చేసుకొని వాటిని ఎటాక్ చేయటానికి ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకొని హ్యాక్ చేయడం లేదా తర్వాత మాల్ వేర్ ఉన్న లింక్స్, మెయిల్స్ పంపించడం ద్వారా హ్యాకింగ్ చేస్తారు.

3.హ్యాకింగ్ చేసే పద్ధతులు లేదా హ్యాకర్లు ఎన్ని రకాలు?

హ్యాకింగ్ చేసే పద్ధతులు లేదా హ్యాకర్లు 5 రకాలుగా ఉంటారు. వాటిని నేను ఈ క్రింద తెలియజేయడం జరిగింది.

  • వైట్ హ్యాట్ హ్యాకర్స్ white hat hackers.
  • గ్రే హ్యాట్ హ్యాకర్స్ grey hat hackers.
  • బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ black hat hackers.
  • హ్యక్టివిస్ట్ hacktivist.
  • స్క్రిప్ట్ కిడ్డీ script kiddie.

ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1.వైట్ హ్యాట్ హ్యాకర్స్ white hat hackers.

వైట్ హ్యాట్ హ్యాకర్లు అంటే ఇందాక మనం చెప్పుకున్న సర్టిఫికెట్ ఉన్న ప్రొఫెషనల్ హ్యాకర్లు.

వీరి వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం ఉండదు. వీరిని పెద్ద పెద్ద ఆర్గనైజషన్ తమ నెట్వర్క్ సిస్టం లోని లూప్ హోల్స్ కనుక్కోవడానికి తద్వారా సెక్యూరిటీ పెంచుకోవడానికి నియమించుకుంటాయి.

వీరి పనేమిటంటే తమ ఆర్గనైజషన్స్ ఎటువంటి సైబర్ హ్యాకింగ్ గురికాకుండా కాపాడడం.

వీరు ఆర్గనైజషన్స్ వద్ద అన్నిరకాల అనుమతులు తీసుకున్న తర్వాతే ఆ యొక్క కంప్యూటర్ నెట్వర్క్స్ హ్యాక్ చేయడం, హ్యాక్ చేయడానికి ఉన్న లూప్ హోల్స్ గుర్తించడం, మరియు హ్యాకింగ్ కి గురికాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవడం,వీటన్నిటిని ఆర్గనైజషన్ కు తెలియజేయడం చేస్తారు.

 

2.గ్రే హ్యాట్ హ్యాకర్స్ grey hat hackers.

గ్రే హ్యాట్ హ్యాకర్లు అంటే వైట్ హ్యాట్ మరియు బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు కు మధ్యస్తంగా ఉండేవాళ్లు.వీళ్ళు దాదాపుగా వైట్ హ్యాట్ హ్యాకర్లు చేసే పనే చేస్తారు.కానీ వీళ్ళు ఆర్గనైజషన్స్ దగ్గర ఎటువంటి అనుమతులు తీసుకోరు.

కానీ ఆర్గనైజషన్స్ లో ఏవైనా లూప్ హోల్స్ ఉంటె వాటిని ఆర్గనైజషన్స్ కు తెలియజేసి వారి వద్ద నుండి డబ్బు కానీ లేదా మరేదయినా ఆశిస్తారు.

గ్రే హ్యాట్ హ్యాకర్లు కూడా పెద్దగా ప్రమాదమేమీ కాదు. కానీ ఒక్కోసారి వీళ్ళతో కూడా చాలా ప్రమాదం.

 

3.బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ black hat hackers.

ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళని క్రిమినల్స్ అనొచ్చు. ఒక వ్యక్తి కానీ లేదా కొంతమంది వ్యక్తుల సమూహం కానీ కలిసి ఆర్గనైజషన్ నుండి అనుమతి లేకుండా ఒక కంప్యూటర్ లేదా కంప్యూటర్ నెట్వర్క్ ను డబ్బు డిమాండ్ చేయడానికి కానీ లేదా మరేదయినా డేటా దొంగిలించే ఉద్దేశంతో కానీ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారు.

వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు.

దాదాపుగా బ్లాక్ హ్యాట్ హ్యాకర్లు ఎవ్వరికీ కూడా ఏ విధమైన మోరల్స్ ఉండవు. వీళ్లంతా పాలసీ రైట్స్ అతిక్రమించడం, కార్పొరేట్ డేటా ని దొంగిలించడం, న్యాయబద్ధమైన కొన్ని సర్వీసులను యూజర్స్ కి అందకుండా చేయడం వంటివి చేస్తారు.

 

4.హ్యక్టివిస్ట్ hacktivist.

వీళ్ళొక కొత్తరకం హ్యాకర్లు. వీళ్ళు కూడా క్రిమినల్స్ లాంటి వాళ్ళే. కాకపొతే వీళ్ళు ఎందుకు హ్యాక్ చేస్తారో తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

వీళ్ళు డబ్బు కోసమో మరి దేనికోసమో హ్యాక్ చేయరీ. వీళ్ళు హ్యాక్ చేసిన కంప్యూటర్స్ లేదా నెట్వర్క్స్ మరియు వెబ్ సైట్స్, సోషల్ అకౌంట్స్ అన్నిటిలో వాళ్లకు సంబంధించిన ఏదో ఒక సందేశాన్ని డిస్ ప్లే చేస్తారు.

 

5.స్క్రిప్ట్ కిడ్డీ script kiddie.

స్క్రిప్ట్ కిడ్డీ అంటే ఒకరకంగా వీళ్ళు స్కూల్ పిల్లల లాంటి వాళ్లన్న మాట.అప్పుడే కొత్తగా హ్యాకింగ్ టూల్స్ ఉపయోగించడం నేర్చుకుంటూ దేన్నన్నా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

వీళ్ళతో పెద్ద ప్రమాదమేది ఉండదు.

వీళ్ళతో ఉన్న ఏకైక ప్రమాదమేమిటంటే వాళ్లకు హ్యాక్ చేయడమెలాగో పూర్తిగా తెలియకుండా దేన్నయినా హ్యాక్ చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ ఐతే వాళ్లకు హ్యాక్ చేసిన దాన్ని రిలీజ్ చేయడం బహుశా తెలిసి ఉండదు.

మీకు ఇంకా హ్యాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఇలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
హ్యాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది
Article Name
హ్యాకింగ్ అంటే ఏమిటి అది ఎలా పని చేస్తుంది
Description
ఒక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే హ్యాకింగ్ గురించి ఎథికల్ హ్యాకింగ్ అనే ఒక ఆథరైజ్డ్ కోర్స్ కూడా ఉంది. ఈ కోర్స్ సక్సెస్ ఫుల్ గా పాస్ అయితే కోర్స్ సంబంధించిన అథారిటిస్ మీకు ప్రొఫషనల్ ఎథికల్ హ్యాకర్ గా సర్టిఫికెట్ కూడా ఇస్తారు
Author
Publisher Name
apwebacademy
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don’t have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that’s why you’re read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: