HTML అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది

Ap Web Academyకి స్వాగతం. ఈ రోజు మనం కోడ్ ప్రోగ్రామింగ్ లోకి వెళదాం. ముందుగా మనం బేసిక్ ఫ్రంట్ ఎండ్ డెవలప్ మెంట్ లాంగ్వేజ్ ఐన HTML గురించి తెలుసు కుందాం. ప్రస్తుతం HTML ప్రతి ఒక్క వెబ్ డెవలపర్ తప్పని సరిగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. అలాగే బ్లాగర్,వర్డుప్రెస్సు లాంటి కొన్ని ఈజీ యూజర్ ఇంటర్ పేస్ ప్రొవైడర్స్ ని మినహాయిస్తే,  మనం HTML సహాయం లేకుండా వెబ్ పేజీ ని కానీ వెబ్ సైట్ ని కానీ నిర్మించలేము. మీరు ఇప్పుడు చదువుతున్న Ap Web Academy లోని వెబ్ పేజీ కూడా HTML5 సహాయంతో నిర్మించబడినది.ఇప్పుడు మనం అసలు HTML అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది HTML బ్యాక్ గ్రౌండ్ ఏమిటి మరియు HTML యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం.

మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే అబౌట్ పేజీ ని చూడండి.

HTML అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది

1.HTML అంటే ఏమిటి

  • HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్.
  • కొంత మంది HTML కోడ్ అని అంటారు. కానీ HTML కోడ్ లాంగ్వేజ్ కాదు. మార్కప్ లాంగ్వేజ్.
  • HTML అంటే మనం టెక్స్ట్ ని ,ఇమేజెస్ ని, ఆడియో,వీడియో లను మనకు కావలిసిన ఫార్మాట్ లలో బ్రౌజర్లో చూడడానికి అంటే హెడింగ్, పేరా, బోల్డ్, ఇటాలిక్ లాంటి ఫార్మాట్ లలో చదవడానికి లేదా చూడడానికి మనం కొన్ని HTML టాగ్స్ తో వీటిని మార్కప్ చేస్తాము.
  • HTML టాగ్ అంటే యాంగిల్ బ్రాకెట్స్ మధ్యలో ఉండే HTML లాంగ్వేజ్ కి సంబందించిన కొన్ని కమాండ్ లెటర్స్, మరియు యాంగిల్ బ్రాకెట్ ను కలిపి టాగ్ అంటారు.
  • మనం బ్రౌజర్ లో చూసే ప్రతి ఒక్క పేరా,హెడింగ్, ఇమేజ్, ఆడియో, వీడియో, మరియు ఇతర అన్ని రకాల ఫైల్స్ HTML ఎలిమెంట్స్ లో ఉంటాయి.
  • ఓపెనింగ్ టాగ్ మరియు క్లోజింగ్ టాగ్ లను కలిపి HTML ఎలిమెంట్ అంటారు.
  • ఇందులో కేవలం క్లోజింగ్ టాగ్ మాత్రం యాంగిల్ బ్రాకెట్స్ లో ఓపెనింగ్ బ్రాకెట్ తర్వాత కమాండ్ లెటర్ కు మందు ఫార్వర్డ్ స్లాష్ (/) గుర్తు ను కలిగి ఉంటుంది.

ఇప్పుడు ఈ క్రింద నేను ఇచ్చిన HTML ఎలిమెంట్ ను పైన చదివిన దానిని అర్ధం చేసుకొని జాగ్రత్తగా గమనించండి. మీకు HTML అంటే ఒక ఐడియా వస్తుంది.

HTML element

opening tag <b> we write the text here.</b> closing tag

<బి> టాగ్ అంటే మనం రాసే అక్షరాలు బోల్డ్ గా రావడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఓపెనింగ్ బి టాగ్ అంటే <బి>, మరియు క్లోజింగ్ బి టాగ్ అంటే </బి> టాగ్ లను కలిపి ఎలిమెంట్ అని అంటాము. మనం <బి> మరియు </బి> టాగ్ ల మధ్య రాసేది ఏదయినా మనకు బ్రౌజరు లో బోల్డ్ గా కనిపిస్తుంది.

ఉదాహరణకు నేను
<బి> apwebacademy </బి> అని HTML డాక్యుమెంట్ లో రాసి దాన్ని బ్రౌజర్లో రన్ చేశాననుకోండి. అది నాకు బ్రౌజరు లో బోల్డ్ గా కనపడుతుంది.

2.HTML ఎలా పనిచేస్తుంది

HTML లాంగ్వేజ్ ఓపెనింగ్ HTML టాగ్ మరియు క్లోజింగ్ HTML టాగ్ మధ్యలో ఉంటుంది.
ఉదాహరణకు
<html> opening tag.

మిగిలినదంతా ఈ మధ్యలో ఉంటుంది.

</html> closing tag.

ప్రతి ఒక్క HTML డాక్యుమెంట్ కూడా ఈ రెండు టాగ్ ల మధ్య లోనే ఉంటుంది. మనం మిగిలిన అన్ని టాగ్ లను లేదా ఎలిమెంట్ లను ఈ రెండు టాగ్ ల మధ్యలోనే ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే ఏ బ్రౌజరు ఐనా దీనిని HTML డాక్యుమెంట్ గా అర్ధం చేసుకొని ఆ రెండు టాగ్ ల మధ్యలో ఉన్న మిగిలిన అన్ని రకాల మార్కప్ లాంగ్వేజ్ టాగ్స్ ను ప్రాసెస్ చేసి మనకు టెక్స్ట్, ఇమేజ్ మరియు మిగిలిన సంబంధిత రూపాలలో మనకు అందజేస్తుంది.

3.HTML బ్యాక్ గ్రౌండ్ ఏమిటి

వికీపీడియా మనకు అందించే సమాచారం ప్రకారం HTML బెర్నెర్స్-లీ అనే అతని ద్వారా 1991 లో క్రియేట్ చేయబడినది. కానీ HTML 2 .0 html వెర్షన్స్ యొక్క ఫస్ట్ స్టాండర్డ్. ఇది మొట్ట మొదటిసారిగా 1995 లో ఉపయోగించ బడినది.ఆ తర్వాత html రోజురోజుకి మరింత కొత్తగా డెవలప్ అవుతూ ఉంది. నేను ఈ క్రింద లిస్ట్ లో HTML యొక్క అన్ని వెర్షన్స్ ఇచ్చాను.గమనించగలరు.

  • 1991 – HTML.
  • 1995 – HTML 2.0
  • 1997- HTML 3.2
  • 1999- HTML 4.01
  • 2000- XHTML
  • 2014- HTML5 the present standard of HTML

4.HTML యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్

  • మీరు ఒక HTML డాక్యుమెంట్ రాయాలన్న, లేదా ఒక వెబ్ పేజీ గాని వెబ్సైటు గాని నిర్మించాలన్న కొన్ని బేసిక్ రూల్స్ తప్పని సరిగా ఫాలో అవ్వాలి.
  • లేదంటే HTML సరిగా పనిచేయదు.ఇప్పుడు అవేంటో చూద్దాం.
  • ప్రసుతం మనం HTML5 ను ఉపయోగిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క HTML డాక్యుమెంట్ క్రియేట్ చేసే ముందుగా అది HTML5 లో బిల్డ్ చేస్తున్నామని మనం బ్రౌజరు కి తెలియ చేయాలి. ఆలా చేయాలంటే <!DOCTYPE html> అని రాయాలి. ఇది మన ఓపెనింగ్ HTML టాగ్ అంటే <HTML> కంటే ముందుగా మనం డాక్యుమెంట్ లో రాయాలి.
  • ప్రతి ఒక్క HTML డాక్యుమెంట్ .html (DOT html ) అని మాత్రమే సేవ్ చేయాలి. లేదంటే అది సరిగా పనిచేయదు.
  • html లేదా HTML&CSS కాంబినేషన్ లో డిజైన్ చేసిన వెబ్ పేజీ లేదా వెబ్ సైట్ లను స్టాటిటిక్ వెబ్ పేజెస్ లేదా స్టాటిటిక్ వెబ్ సైట్స్ అని అంటారు. అంటే మనం వీటిలోని టెక్స్ట్ మరియు ఇమేజ్ వంటి వాటిని చూడటం తప్పితే యూజర్ ఇంటర్ ఆక్టివిటీ అంటే మనం వాటిని మార్చటం లేదా అప్ డేట్ చేయటం వంటివి చేయలేము.
  • కొన్ని html టాగ్స్ ని సెల్ ఎండెడ్ టాగ్స్ అంటారు. అంటే ఇవి కేవలం ఒక టాగ్ తోనే క్లోజ్ అవుతాయి. ఉదాహరణకు </br> </img > </hr> లాంటివి. కానీ 90 శాతం టాగ్స్ అన్నిఓపెనింగ్ మరియు క్లోజింగ్ టాగ్స్ కలిగి ఉంటాయి.

మీకు ఇంకా HTML అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఇలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా సైటును ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
HTML అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది
Article Name
HTML అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది
Description
HTML అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది. మీరు ఒక HTML డాక్యుమెంట్ రాయాలన్న, లేదా ఒక వెబ్ పేజీ గాని వెబ్సైటు గాని నిర్మించాలన్న కొన్ని బేసిక్ రూల్స్
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

%d bloggers like this: