SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

Ap Web Academy కి స్వాగతం.ఇంతకూ ముందు ఆర్టికల్ లో మనం SSL గురించి మాట్లాడుకున్నాం.చాలా మందికి SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి అనే సంగతి తెలియదు.నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ దీని గురించి ఎక్స్ ప్లయిన్ చేస్తాను.SSL అంటే మీ డొమైన్ లేదా యుఆర్ఎల్ HTTP:// నుండి HTTPS:// కి మారటమే.కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కాదు!,మరేమి పర్వాలేదు, ఈ ఆర్టికల్ పూర్తిగా అయిపోయే సమయానికి మీకు SSL అంటే ఏమిటి దానిని ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి? అనే విషయాల మీద పూర్తీ అవగాహన వచ్చేస్తుంది.

మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుగా, మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

ఇప్పుడు మనం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం.

1.SSL అంటే ఏమిటి?
2.SSLవల్ల ఉపయోగం ఏమిటి?
3.ఎవరి దగ్గర ఎలా కొనాలి?
4.ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి?
5.మనం ఇన్ స్టాల్ చేసుకొన్నామని ఎలా తెలుస్తుంది?

ఇప్పుడు మనం ఫై లిస్ట్ లో ఉన్న విషయాలను ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.

SSL గురించి తెలుసుకోవటానికి ముందుగా మీకు డొమైన్ అంటే ఏమిటి? వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? అనే విషయాలు మీకు తెలిసి ఉండాలి.ఒక వేళ మీకు అవేమి తెలియకపోతే మీరు అద్భుతమైన డొమైన్ నేమ్ కొనడం ఎలా?ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు మరియు బెస్ట్ వెబ్ హోస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం ఎలా? అనే ఆర్టికల్స్ చదవండి. వీటి వల్ల మీకు డొమైన్ గురించి, వెబ్ హోస్టింగ్ గురించి, అవి పని చేసే విధానం గురించి ఒక అవగాహన వస్తుంది.

1.SSL అంటే ఏమిటి?

మీరు గురించి తెలుసు కోవడానికి ముందుగా ఈ క్రింది వాటిని తెలుసుకొని ఉండాలి.

  • Http://- Hypertext transfer protocol
  • Https://-Hypertext transfer protocol secure
  • SSL-secure sockets layer.

సెక్యూర్ సాకెట్స్ లేయర్ లేదా SSL అనేది ఇంటర్నెట్ కి సంబంధించిన ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్.SSL మోడరన్ ఎన్ క్రిప్షన్ ను ఉపయోగించి విలువైన సమాచారాన్ని పంపించడం తీసుకోవడం చేస్తుంది.SSL ఒక సెక్యూర్ ఛానల్ నిర్మించుకొని దాని ద్వారా ఇదంతా చేస్తుంది.ఈ ఛానల్ యూజర్ యొక్క బ్రౌసర్ కి యూజర్ చూస్తున్న వెబ్సైటు సర్వర్ కి మధ్య అనుసందానంగా ఉంటుంది.ఈ ఛానల్ ఒక ప్రక్క నుండి సమాచారాన్ని ఎన్ క్రిప్ట్ చేసి పంపిస్తుంది.రెండవ ప్రక్కన దానిని రెండవ ప్రక్కన డి క్రిప్ట్ చేసుకొంటుంది.ఒకవేళ ఎవరైనా మధ్యలో ఈ సమాచారాన్ని కలెక్ట్ చేసు కొందామని ప్రయత్నిస్తే వారికి సమాచారం దొరక నివ్వదు.ఒక వేళ దొరికినా వారికి ఆ సమాచారం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఎందుకంటె,అది ముందే ఎన్ క్రిప్ట్ కాబడి ఉంది కనుక.

2.SSLవల్ల ఉపయోగం ఏమిటి?

ఒక వేళ మీ వెబ్ సైట్ కు SSL సర్టిఫికెట్ గనక ఉంటె బ్రౌజర్లు వెంటనే దానిని గమనించి రిలీజ్ అవుతాయి.ఏ విధంగా అంటే ఈ వెబ్ సైట్ నుండి పంపించే, వచ్చే సమాచారమంతా కూడా ఎన్ క్రిప్ట్ చేయబడాలి అని అర్ధం చేసుకొంటాయి. అంతే కాకుండా యూజర్స్ కి కూడా తమ యూజర్ నేమ్, పాస్ వర్డ్ మరియు మీది ఈ కామర్స్ స్టోర్ ఐతే వారి యొక్క క్రెడిట్ కార్డు లేదా ఇతర లావాదేవీల సమా చారం సేఫ్ అని తేలికగా అర్ధం చేసుకుంటాయారు.

PCI (పెమెంట్స్ కార్డ్స్ ఇండస్ట్రీ) స్టాండర్డ్స్ ప్రకారం ఆన్ లైన్ పేమెంట్ అనేది కనీసం 128 – బిట్ ఎన్ క్రిప్షన్ ద్వారానన్నా జరగాలి.అప్పుడు మాత్రమే అది సెక్యూర్ పేమెంట్ మెథడ్ గా అంగీకరింప బడుతుంది.

ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే SSL సర్టిఫికెట్ ఉన్న వెబ్ సైట్ లను గూగుల్ ర్యాంకింగ్స్ ఇవ్వటం లో ప్రయరిటీ ఇస్తుంది. ఇంట్రెస్టింగా ఉంది కాదు! కానీ ఎందుకు?ఎందుకంటె గూగుల్ ఇంటర్నెట్ సెర్చ్ యూజర్స్ కి వారి ప్రైవసీ కి మరింత సెక్యూటిటీ ఇవ్వాలనుకుంటుంది కనుక.మీకు ఇంకా వివరాలు కావాలనే గూగుల్ వెబ్ మాస్టర్స్ సెంట్రల్ బ్లాగ్ లోని ఈ ఆర్టికల్ ను చదవండి.

3.ఎవరి దగ్గర ఎలా కొనాలి?

మీరు నా వెబ్ సైట్ యొక్క బ్రౌజర్ అడ్రస్ బార్ పార్ట్ ని కనక చెక్ చేసినట్లయితే అది ఈ క్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.

ap web academy image for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
ap web academy image for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

నా యొక్క డొమైన్ మరియు వెబ్ హోస్టింగ్ అన్ని కూడా HOSTGATOR వారి ద్వారా హోస్ట్ చెయ్యబడి ఉన్నాయ్.నా SSL కూడా వారి ద్వారానే హోస్ట్ చేయబడి ఉంది. వారి సర్వీస్ మరియు వారి యొక్క టూల్స్ చాలా ఉపయోగపడతాయి. నేను మిమ్మల్ని కూడా SSL వారి వద్దే కొనుక్కోమని సలహా ఇస్తాను.మీకు ఆల్రెడీ HOSTGATOR లో అకౌంట్ ఉంటె లాగిన్ అవ్వండి.లేకపోతె రిజిస్టర్ చేసుకోండి.నేను ఇప్పుడు ఎలా కొనాలో చూపించబోతున్నాను. ముందుగా మీరు మీ హోస్టుగాటర్ వెబ్ సైట్ కి వెళ్ళండి.వారి హోమ్ పేజీ ఈ క్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.

digital ssl image for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
digital ssl image for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

తర్వాత మీ మౌస్ ని సెక్యూరిటీ/ఆడ్-ఆన్ అనే లాస్ట్ ట్యాబు మీదకు తీసుకు వెళ్ళండి.అక్కడ ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది.ఆ మెనూ లో మూడు విషయాలు ఉంటాయి.సైట్ లాక్,కోడ్ గార్డ్, డిజిటల్ సర్టిఫికెట్ అనేవి ఉంటాయి. డిజిటల్ సర్టిఫికెట్ అనే దాని మీద క్లిక్ చెయ్యండి.మీరు ఇక్కడి నుండి మరొక పేజీ లోకి వెళతారు. ఆ పేజీ ఈ క్రింది విధంగా ఉంటుంది.

digital ssl image2 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
digital ssl image2 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి


చూజ్ ప్లాన్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. ఆ తర్వాత మీరు ఈ క్రింద చూపించే పేజీ లోకి వెళతారు.అక్కడ సుల్ కి సంబంధించిన ప్లాన్స్ఉంటాయి.

digital ssl image3 SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
digital ssl image3 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

THE IMPORATANT PART OF THE ARTICLE.

నేను మీలో ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏమిటంటే అక్కడ ఉన్న మొదటి ప్లాన్ పాజిటివ్ ssl RS1452 /YR ని సెలెక్ట్ చేసుకోండి. అంతకన్నా పెద్ద ప్లాన్ సాధారణంగా ఎవరికి అవసరం ఉండదు.ఒక వేళ మీ అవసరాన్ని బట్టి మీ వెబ్ సైట్ లో పెద్ద మొత్తంలో ట్రాన్సక్షన్స్ జరిగే అవకాశం ఉంటె మీరు మీకు కావలసిన ప్లాన్ ను ఎంచుకోవచ్చు.

ఇప్పుడు BUY NOW అనే బటన్ మీద క్లిక్ చెయ్యండి.ఒక చిన్న పాప్-అప్ ఓపెన్ అవ్వుతుంది. అందులో “Do you already have a domain for your hosting plan?” అని ఉంటుంది.మీకు ఆల్రెడీ డొమైన్ ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చెయ్యండి.లేకపోతె మీకు కావలసిన నేమ్ ఎంటర్ చేసి అది అవైలబిలిటీ ఉందొ లేదో చేసుకొని కొనుక్కోండి.మీరు ఇచ్చే ఇన్ స్ట్రక్షన్స్ ఎస్ ఆర్ నో బట్టి ఆ విండో మిమ్మల్ని సంబంధిత పేజీ కి తీసుకు వెళుతుంది.ఒక వేళ మీరు ఎస్ అని ఎంటర్ చేస్తే హోస్టుగాటర్ మిమ్మల్ని ఈ క్రింది పేజీకి తీసుకు వెళుతుంది.

digital ssl image4 SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
digital ssl image4 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

నేను కేవలం ssl మాత్రమే కార్ట్ కి ఆడ్ చేసాను. ఒకవేళ మీకు కోడ్ గార్డ్, సైట్ లాక్, లెద్దా మరేదేనా సర్వీస్ కావాలంటే మీరు ఆడ్ చేసుకోవచ్చు.కంటిన్యూ మీద క్లిక్ చెయ్యండి.సైన్ ఇన్ పేజీ లో సైన్ ఇన్ అవ్వండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి.సైన్ ఇన్ ఐయ్యాక మీకు ఇష్టమైన పేమెంట్ మెథడ్ ఎంచుకోండి.మీ షాపింగ్ కార్ట్ లో ఉన్న అమౌంట్ ఎంతో చెల్లించండి.అంతే మీరు మీ వెబ్ సైట్ కి కావలసిన ssl సర్టిఫికెట్ కొనేశారు.

ఇప్పుడు మనం తర్వాతి పార్ట్ లోకి వెళదాం.

4.ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి?

ఇప్పుడు మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.మీ మౌస్ ని మేనేజ్ ఆర్డర్స్ ట్యాబు మీదకు తీసుకు వెళ్ళండి.డ్రాప్ డౌన్ మెనూ వచ్చాక లిస్ట్/సెర్చ్ ఆర్డర్స్ అనే ట్యాబు మీద క్లిక్ చెయ్యండి.తర్వాత వచ్చే పేజీ లో మీ డొమైన్ నేమ్ దానికి అసైన్ చేయబడి ఉన్న ssl సర్టిఫికెట్ మరియు ఎక్సపైరీ డేట్ ఉంటాయి.మీ ssl సర్టిఫికెట్ మీద క్లిక్ చెయ్యండి.అది మిమ్మల్ని మనం ssl మెయిన్ టైన్ చేసే పేజీ లోకి తీసుకు వెళుతుంది.అక్కడ వ్యూ సర్టిఫికెట్ అనే ట్యాబు మీద క్లిక్ చెయ్యండి. ఆ తర్వాత ఒక పాప్-అప్ ఓపెన్ అవుతుంది.అందులో మీ సర్టిఫికెట్ కోడ్ ఉంటుంది.అది ఈ క్రింద ఇమేజ్ లో లాగ ఉంటుంది.

digital ssl image5 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
digital ssl image5 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

ఇప్పుడు మీరు CSR లేదా సర్టిఫికెట్ సైన్ రిక్వెస్ట్ ను జనరేట్ చెయ్యవలసి ఉంటుంది.అదెలాగంటే,మీ అకౌంట్ లో హోస్టింగ్ సెక్షన్ లోకి వెళ్లి మానేజ్ వెబ్ హోస్టింగ్ అనే లింక్ మీద క్లిక్ చెయ్యండి.ఇప్పుడు మీ సి ప్యానెల్ ఓపెన్ అవ్వుతుంది.అందులో ssl /TLS అనేది ఎక్కడ ఉందొ వెతకండి. ఇది సెక్యూరిటీ అనే ట్యాబు కింద ఉంటుంది.ఈ క్రింద ఇమేజ్ ని గమనించండి.

digital ssl image6 SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
digital ssl image6 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

ఇపుడు దాని మీద క్లిక్ చెయ్యండి. ఒక కొత్త పేజీ ఓపెన్ అవ్వుతుంది.దానిలో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి.

digital ssl image7 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
digital ssl image7 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

రెండవడైన Generate a New Certificate Signing Request (CSR).మీద క్లిక్ చెయ్యండి.మీ క్లిక్ తర్వాత ఒక కొత్త పేజీ ఓపెన్ అవ్వుతుంది .ఈ క్రింద ఇమేజ్ ని గమనించండి.

digital ssl image8 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
digital ssl image8 for SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి

ఇప్పుడు అక్కడ వారు అడిగిన విషయాలను ఎంటర్ చెయ్యండి.అన్ని ఎంటర్ చెయ్యడం పూర్తి ఐన తర్వాత జనరేట్ అనే బటన్ ని క్లిక్ చెయ్యండి.అంతే మీ సర్టిఫికెట్ ఇష్యూ కాబడుతుంది.మరియు మీకొక కన్ఫర్ మేషన్ మెయిల్ వస్తుంది.మీరు SSL సరిఫికేట్ ఇన్ స్టాల్ చేసుకోవటానికి ముందుగా ఒక విషయము గుర్తుంచు కొండి.సర్టిఫికెట్ AUTHORITY మీకు పంపించిన మెయిల్ ఇచ్చిన అన్ని విషయాలు పూర్తిగా పాటించండి.వారి నుండి పూర్తి స్థాయి CONFIRMATION వచ్చాక మీరు మీ సర్టిఫికెట్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

ఇప్పుడు మీరు ssl /TLS ->లోకి వెళ్ళాక క్లిక్ ఆన్ మేనేజ్ ఇన్ స్టాల్ ssl ఫర్ యువర్ సైట్ HTTPS :// అని ఉంటుంది.దాని మీద క్లిక్ చెయ్యండి. ఒక కొత్త పేజీ ఓపెన్ అవ్వుతుంది.అందులో అడిగిన విషయాలన్నీ ఎంటర్ చేసి,ఇన్ స్టాల్ బటన్ నొక్కండి.

అంతే, మీరు సక్సెస్ ఫుల్ గా ssl సరిఫికేట్ ఇన్ స్టాల్ చేశారు.

యిపుడు మనం తర్వాత పార్ట్ లోకి వెళదాం.

5.మనం ఇన్ స్టాల్ చేసుకొన్నామని ఎలా తెలుస్తుంది?

ఇది మన చివరి స్టెప్.మీరు ssl ఇన్ స్టాల్ చేశారని కంఫర్మ్ చేసుకోవడానికి ముందుగా ఒక ముఖ్యమైన పని చేయాలి.

  • అన్ని HTTP లను HTTPS గా మార్చడం.

మీరు ఎక్కడెక్కడైతే HTTP అని ఎంటర్ చేశాయేమో ఆంటే మీరు వర్డ్ ప్రెస్ ఇన్ స్టాల్ చేసేటప్పుడు మరియు మీ అడ్మిన్ ప్రొఫైల్ మొదలైన ప్రతి ఒక్క చోట HTTPS అని మార్చండి.ఇదంతా పూర్తి ఐన తర్వాత మీ సైట్ గ్రీన్ లాక్ ఐకాన్ తో HTTPS ప్రిఫిక్ తో లోడ్ అవ్వటం గమనించవచ్చు.

నాకు తెలిసి SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి అనే ఆర్టికల్ లో దాదాపుగాగా నేను ప్రతి విషయాన్ని కవర్ చేసాను.

మీకు ఇంకా SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి అనే విషయం లో కానీ లేదా మరి ఏదయినా విషయం లో కానీ సందేహాలు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయ వచ్చు. అలాగే ఏదయినా చిన్న సందేహమైతే కామెంట్ లాగ అడగండి. ఈ ఆర్టికల్ మీ వారికి ఎవరికయినా ఉపయోగ పడుతుంది అనుకొంటే షేర్ చెయ్యండి. అలాగే ఎలాంటి మరిన్ని వివరణాత్మక ఆర్టికల్ కోసం మీ ఇమెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేసి నా బ్లాగ్ ను ఫాలో కావడం కానీ, లేదా యూజర్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గాని, లేదా నా సోషల్ లింక్స్ ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా గాని మీరు నా ఆర్టికల్స్ ను పొందవచ్చు.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.నా గురించి మరిన్ని వివరాలు తెలుసు కోవాలనుకొంటే అబౌట్ పేజీ ను దర్శించండి.

Summary
SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
Article Name
SSL అంటే ఏమిటి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి
Description
ఈ ఆర్టికల్ పూర్తిగా అయిపోయే సమయానికి మీకు SSL అంటే ఏమిటి దానిని ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలి? అనే విషయాల మీద పూర్తీ అవగాహన వచ్చేస్తుంది.
Author
Publisher Name
apwebacademy.com
Publisher Logo
Spread the love
  • 2
    Shares

Ajay Kumar

hello, Ap Wed Academy is a passion of an entrepreneur. a mind of web scientist I am doing a professional job in a well-named company. I don't have any degrees, I am not an English expert. but, a lot of interest and Enthusiasm about learning web concepts. that's why you're read my profile here. my goal is help people who want to learn web concepts.you can follow me by click one of my social links.

Leave a Reply

Specify Facebook App ID and Secret in Super Socializer > Social Login section in admin panel for Facebook Login to work

Specify GooglePlus Client ID and Secret in Super Socializer > Social Login section in admin panel for GooglePlus Login to work

%d bloggers like this: